nenuinthe Posted July 10, 2010 Report Posted July 10, 2010 [center][img]http://akamai.telugu.maastars.com/wp-content/uploads/2010/07/nagarjuna-telugu-star-300x259.jpg[/img][/center][size=15pt][color=navy]గతంలో నాగార్జున, కె. రాఘవేంద్ర రావు ల కలయికలో వచ్చిన భక్తిరస చిత్రాలు “అన్నమయ్య”, “శ్రీరామదాసు” చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో, వీరిద్దరి కాంబినేషన్ కి ఎంత క్రేజ్ ని తెచ్చిపెట్టాయో తెలిసిన విషయమే. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు బాటలోనే నడుస్తూ, “భక్తి” అయినా, “రక్తి” అయినా.. సాంఘిక చిత్రాలైనా… తనకు తానే సాటి అని నాగ్ నిరూపిస్తున్నాడు.ప్రస్తుతం దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు- నాగార్జున కలయికలో మరొక భక్తిరస చిత్రం రాబోతోంది. ఈమధ్యన “ఆదిశంకరాచార్య” గురించి వాకబు చేసి, రాఘవేంద్ర రావు, జె.కె. భారవి లకు ఆయన మీద రీసెర్చ్ చేసి చక్కటి కథను సిద్ధం చేసుకోమని నాగ్ పురమాయించాడట. తదనుగుణంగానే ఆ ఇద్దరూ కూర్చుని కష్టపడి ఒక మంచి స్క్రిప్ట్ ని రెడీ చేసుకుని నాగ్ కి చూపించారట. ఆది నాగ్ కి ఎంతగానో నచ్చిందని సమాచారం. మరొక్కసారి ముగ్గురూ కూర్చుని స్క్రిప్ట్ కి తుది మెరుగులు దిద్ది, షూటింగ్ మొదలుపెట్టే యోచనలో రాఘవేంద్ర రావు- నాగార్జున ఉన్నారట.ఇదిలా ఉండగా, “అన్నమయ్య” “శ్రీరామదాసు” రెండూ భక్తి పూరితమైన కథలు కాబట్టి నాగ్ అభిమానులు కూడా సంతోషించారు. కానీ… “ఆదిశంకరాచార్య” పరిపూర్ణమైన సాధువు(సన్యాసి). మరి మన టాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ హీరో నాగ్ ని ఎంతవరకు ఆ పాత్రలో చూసి అభిమానులు రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి.[/color][/size]
Recommended Posts