Annayya_fan Posted April 6, 2017 Report Posted April 6, 2017 ఏటిగడ్డకిష్టాపుర్, తొగుట, తుక్కాపూర్& పల్లేపహడ్ లో జివో123 ప్రకారం భూసేకరణ చేసినంక మిగిలిన భూములకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇయ్యాల్టి సాక్షి పేపర్ లో నోటిఫికేషన్ వేసారు... నోటిఫికేషన్ అంతా #తప్పుల_తడక, #దొంగలు_దొంగలు ఊర్లు పంచుకున్నట్లు ప్రజలను గందరగోళ పర్చే విధంగా పేపర్ ప్రకటణ.. ఏటిగడ్డకిష్టాపుర్ లో ఇదివరకు తీస్కున్న భూములు #మల్లన్నసాగర్ కోసం... ఇప్పుడు తీస్కునే భూములు #కొండపోచమ్మ సాగర్కట...???🤐🤐 నిజంగా ఎదో ఒక సాగర్ కడ్తారా లేక #రియల్_ఎస్టేట్ చేస్కొవడానికి భూములు గుంజుకుంటుర్రా?? ఏటిగడ్డకిష్టాపుర్ లో వచ్చె సాక్షి మేయిన్(తెలంగాణ మేయిన్) పేపర్ లో ఈ నోటిఫికేషన్ లేదు, హైదరాబాద్ సాక్షి మేయిన్ లో నోటిఫికేషన్ ఏపించిన మన బంగారు పాలకులు, అంటే భూబాధితులు ఆ నోటిఫికేషన్ చూడొద్దు, వాల్ల అభ్యంతరాలు తెల్పొద్దు, తీరా గడువు అయిపోయినంక అధికారులు గ్రామానికొచ్చి మేం నోటిఫికేషన్ ఏసినం కని మీరే చూడలే, మీ తప్పే అంటారు. ప్రభుత్వం అధికారులచే ఆడుతున్న దొంగ నాటకాలు Quote
TOM_BHAYYA Posted April 6, 2017 Report Posted April 6, 2017 Dora elections preparations start chesinda aithe.. Quote
Annayya_fan Posted April 6, 2017 Author Report Posted April 6, 2017 మల్లన్నసాగర్ కోసం భూసేకరణ మొదలుపెట్టి దాదాపు సంవత్సరం గడిసినంక ఇప్పుడు ప్రజలకు అక్కడే 50 టియంసి ల గోళెం ఎందుకు కావాలో వివరించాలి అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది...ఇంత తొందరగా ఎందుకు ఒయస్డి గారు ఇంకో 10 సంవత్సరాల తర్వాత చెప్తే బాగుండు కదా. ప్రజలను మబ్యపెట్టడం కోసం మీరు పడ్డ తాపత్రయం లో 10% అయినా ప్రజలబాగుకోసం పడ్తే వాల్లు మిమ్మల్ని నాలుగు కాలాలపాటు గుర్తుపెట్టుకునెటొల్లు... మీ ఇంజనీర్లే అనధికారికంగా అక్కడ అస్సలు 50TMC అవసరమే లేదు అని చాలా సార్లు చెప్పిర్రు, కని వాల్లెవ్వరికి కెసిఆర్ కి చెప్పే ధైర్యం లేకపోయింది... మీ వ్యాసం లో పోల్చిన పట్టికను చుస్తేనే అర్థం అవ్తుంది, ఇది ఎంత అవగాహనా రాహిత్య రిజర్వాయరో అని...నదులమీద కట్టే ఆనకట్టలను ఒక మైదాన ప్రాంతంలో కట్టే గోళేం ను ఎలా పోలుస్తారో మీకే అర్థమవ్వాలి!!!??? ఇంకో విషయం ప్రస్తావించారు మల్లన్నసాగర్ కట్టే ప్రాంతం తెలంగాణ లో ఎత్తైనా ప్రాంతం అందుకే అక్కడ మల్లన్నసాగర్ నిర్మించడానికి తలపెట్టారు అని, అయ్యా నేను 2 ప్రాంతాల మ్యాప్స్ పెట్టిన సముద్ర మట్టం నుంచి 600మీ.ల(కెసిఆర్ వ్యవసాయ క్షేత్రం) ఎత్తున్న ప్రాంతం కంటే 520-530మీటర్ల (మల్లన్నసాగర్ ప్రాంతం) ఎత్తున్న ప్రాంతం ఎట్ల ఎత్తైతదో మీరే చెప్పాలి,నేను చెప్పిన 2ప్రాంతాలు కేవలం 20 కి.మీ దూరం లో కూడవెళ్ళి వాగు పరిసరప్రాంతాలే. కోట్ల ఆస్తులున్న కెసిఆర్ వ్యవసాయ క్షేత్రాన్ని మల్లన్నసాగర్ కోసం త్యాగం చేస్తే నాయకుడయ్యెటోడు కదా?? ఇంతగొప్పాగా సంఖ్యలతో మాయాజాలం చేసి రాసిన మీరు వ్యాసం లో అక్కడ నిర్వాసితులను ఆదుకోవడం కోసం ఎమిస్తే బాగుంటదో ప్రస్తావించకపోవడం హాస్యాస్పదం... ప్రజాస్వామ్యం లో ప్రజలే దేవుల్లు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలసేవకులనే విషయాన్ని మర్వడం దారుణం.... ప్రజాస్వామ్యం వర్దిళ్లాలి...వ్యక్తిపూజ నషించాలి.... Quote
Annayya_fan Posted April 6, 2017 Author Report Posted April 6, 2017 13 minutes ago, TOM_BHAYYA said: Dora elections preparations start chesinda aithe.. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.