shango Posted May 12, 2017 Report Posted May 12, 2017 నువ్వొనొచ్చు... చంద్రబాబుకి తీయగా మాట్లాడ్డం రాదని ! నువ్ చెప్పొచ్చు... చంద్రబాబు మాటలతో బూరెలు వండలేడని ! నీకు ఉండొచ్చు..కబుర్లు అమ్ముకోవడం లేదు, పోటీలో ఎక్కడ ఉంటాడో అని ! తమ్ముడూ ! డోన్ట్ వర్రీ ! వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ సీఈవో ఓమాట చెప్పాడు. వంద ప్రశ్నలకి ఒక్కటే సమాధానం దొరికినట్టు... నెగెటివ్ భయాలు పటాపంచలైనట్టు ఉంటుంది. జాన్ ఛాంబర్స్. సిస్కో సీఈవో. చంద్రబాబు గురించి సింపుల్ కామెంట్ చేశారు. టిపికల్ టాస్క్ ఓరియెంటెడ్ పొలిటీషియన్ అని ! ఇండియన్ లీడర్స్ ఎవరైనా కుశల ప్రశ్నలు అడుగుతారట. మీరు సూపర్... బంపర్ అని ఎదురు బూస్ట్ ఇస్తారట ! కానీ చంద్రబాబు వెరీ థర్డ్ వర్డ్ నుంచే, అంటే మూడో మాట నుంచే విషయానికి వచ్చేస్తారట ! అదీ ఛాంబర్స్ అబ్జర్వేషన్ ! హౌఆర్ యు అని పలకరించిన తర్వాత అసలు బిజినెస్ మొదలైపోతుందట ! కోతల్లేవ్. పూతల్లేవ్. ఎందుకు రావాలి ఏపీకి... మీ కోసం ఏం చేస్తాం... మీరు మా దగ్గరకొస్తే ఏం లాభం అంటే అని చెప్పే తీరులో కన్విక్షన్ కట్టిపడేస్తుందన్నాడు ! అందుకేనేమో యాపిల్ సీఓఓ జెఫ్ విలియమ్స్ కూడా అన్నాడు ! చంద్రబాబు ఓ డ్రగ్ అని తేల్చాడు. వర్క్ హాలిక్ నేచర్ తో ఆకట్టుకునేవాడు... ఆల్కాహాలిక్ కన్నా ఎక్కువ కిక్కు ఎక్కిస్తాడు. అందుకే రిజల్ట్ టేస్ట్ తెలిసినవాడెవ్వడూ అంత తేలిగ్గా వదల్లేడు. వదులుకోలేడు. ఇదే చంద్రబాబుకి ఎదురులేని ప్లస్ పాయింట్ ! ఇది లెటెస్ట్. రీసెంట్ ఆర్క్వైవ్స్ చూస్తే ఇలాంటివి ఇక చాలానే కనిపిస్తాయ్ ! హీరో సౌతిండియాకి రావాలనుకున్నప్పుడు కర్ణాటక కన్నేసింది. సడెన్ గా ఓ సాయంత్రం హీరో ఛైర్మన్ ముంజాల్ కి ఫోన్ కాల్ వెళ్లింది. రేపు మార్నింగ్ మీతో బ్రేక్ ఫాస్ట్ చేయాలనుకుంటున్నా అని ! కాదనరుకదా ! కట్ చేస్తే... హీరో మన శ్రీ సిటీకి వచ్చేసింది ! అలా ఎలా వెళ్తారు ? మా దగ్గరలేనిది ఏపీలో ఏముంది అని అడిగితే... ప్రొఫెనల్ ప్యూరిటీ అని ఇన్ డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పారట ముంజాల్. ఏం చేశారు చంద్రబాబు ? ఏం లేదు... గ్రోత్ ఏపీలో స్కోప్ ఎలా ఎక్కువఉందో చెప్పారంతే ! ఆ లాజిక్ తో కన్విన్స్ అయ్యారోలేదో కానీ, చంద్రబాబులా ఆలోచించే వాళ్ల సపోర్ట్ ఉంటే మాత్రం సాధ్యమే ఏదైనా అని ముంజాల్ ఓపెన్ గా నే విశాఖ పెట్టుబడుల సమ్మిట్ లో చెప్పారు కూడా ! ఎవడికి తెలుసు... జీరో నుంచి మొదలైన ఓ రాష్ట్రం గురించి మూడేళ్లు తిరిగే లోపల యాపిల్ ఎంక్వైరీ చేస్తుందని ! మైక్రోసాఫ్ట్ ఇన్నొవేషన్ సెంటర్ పెట్టాలనుకుంటుందని ! క్లౌడ్ లా కౌగిలించుకుంటామంటూ గూగుల్ మన గుడిసె ముందుకు వస్తుందని ! కానీ వచ్చాయ్. వస్తున్నాయ్. వాస్తవం. చేతులతో చేపలు పట్టినట్టు... పట్టుజారుతున్నా వదలకుండా బాహుబలి పైకెక్కినట్టు... సవాళ్లు నాల్గు పక్కల నుంచి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా ఎదురు నిలబడటానికి సత్తా కావాలి. అలాంటి స్టామినా ఉంది కాబట్టే ఏపీ చంద్రబాబుపై భరోసా తో ఉంది. గుండెలపై చేయి వేసుకొని చెబుతోంది. ఎస్... వి ఆర్ ద బెస్ట్ అని ! ఫైనల్ గా ఒక్కమాట. చంద్రబాబు శిల్పి. చెక్కుతూపోతాడు. శిలలకి రూపురేఖలిస్తాడు. అవే మాట్లాడతాయ్. వంద మాటలకి ఒక్క కవళికతో సమాధానం చెబుతాయ్. ఆ సమాధానం కూడా నిన్నవాగితే ఇవాళ మర్చిపోయేట్టు ఉండదు. శిలలాగే నిలిచి పోతుంది ఎప్పటికీ ! మన మనసు గెలిచిపోతుంది ! అమెరికా కూడా ఇదే మాట చెప్పిందిప్పుడు ! కావాలంటే వినండి ! Courtesy.. Satish Chaganti Quote
Bathai_Babji Posted May 12, 2017 Report Posted May 12, 2017 Jai Balayya ... Jai Jai Balayya ... Jai Balayya ... Jai Jai Balayya ... Jai Balayya ... Jai Jai Balayya ... Jai Balayya ... Jai Jai Balayya ... Jai Balayya ... Jai Jai Balayya ... Jai Balayya ... Jai Jai Balayya ... Jai Balayya ... Jai Jai Balayya ... Jai Balayya ... Jai Jai Balayya ... Jai Balayya ... Jai Jai Balayya ... Jai Balayya ... Jai Jai Balayya ... Jai Balayya ... Jai Jai Balayya ... Jai Balayya ... Jai Jai Balayya ... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.