TampaChinnodu Posted May 13, 2017 Report Posted May 13, 2017 కదులుతున్న హవాలా డొంక 9 మంది నిందితుల్లో ఇద్దరు చార్టర్డ్ అకౌంటెంట్లు విశాఖ, కోల్‌కతా, హైదరాబాద్‌లలో బ్యాంకు ఖాతాలు కుంభకోణంపై విశాఖ డీసీపీ నవీన్‌గులాటీ ఈనాడు - విశాఖపట్నం విశాఖ కేంద్రంగా బయటపడిన రూ.1,500 కోట్లకు పైగా హవాలా కుంభకోణానికి సంబంధించి ఇప్పుడిప్పుడే మూలాలు బయటకొస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని నడిపించిన 24 సంవత్సరాల వడ్డి మహేశ్‌కు ఇద్దరు ఛార్టర్డ్ అకౌంటెంట్లు సహకరించారనేది శనివారం వెలుగులోకి వచ్చిన అంశం. విశాఖ, కోల్‌కొత నగరాల్లో ఏర్పాటు చేసిన డొల్ల కంపెనీల వివరాలను కూడా పోలీసులు బహిరంగపరిచారు. విశాఖ, కోల్‌కతా, హైదరాబాద్‌లలో బ్యాంకు ఖాతాలు తెరిచి, నకిలీ పత్రాలు సృష్టించి డబ్బును దేశ సరిహద్దులు దాటించినట్టు తెలిపారు. ఈ కేసులో కీలక నిందితుడు వడ్డి మహేశ్‌ను మధ్యాహ్నం 12 గంటల సమయంలో కోల్‌కతా నుంచి ఇండిగో విమానంలో పోలీసులు వైజాగ్ తీసుకొచ్చారు. అక్కణ్నుంచి ఎక్కడికి తీసుకెళ్లారో ఎవరికీ తెలియనివ్వలేదు. ఉదయం పోలీసు కమిషనరేట్లో విశాఖ డీసీపీ నవీన్‌గులాటీ విలేకరుల సమావేశం నిర్వహించి ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటిదాకా నిర్ధరణ అయిన వివరాలను తెలియజేశారు. మొత్తం 12 డొల్ల కంపెనీలను స్థాపించారని వాటిలో రెండు విశాఖలో ఉండగా... పది కోల్‌కతాలో ఉన్నట్లు చూపారన్నారు. ఆయా సంస్థలకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు 20కు పైగా విశాఖలో, నాలుగు కోల్‌కతాలో, రెండు హైదరాబాద్‌లో ఉన్నట్టు రూఢీ అయ్యిందని తెలిపారు. ఆయా ఖాతాల్లోకి రూ.680.94 కోట్లు జమ కాగా రూ.569.93 కోట్లు సింగపూర్, హాంకాంగ్, చైనా దేశాల్లోని ఐదు కంపెనీలకు తరలిపోయాయని చెప్పారు. వాస్తవానికి ఆ డబ్బును ఎందుకు పంపారు? ఆయా దేశాల్లోని ఖాతాలకు నిధులు వెళ్లిన తరువాత ఆ సంస్థలు వాటిని ఏ విధంగా వెచ్చించాయి? లబ్ధి పొందిన విదేశీ కంపెనీలను ఎవరు నిర్వహిస్తున్నారు? తదితర విషయాలన్నీ తేలాల్సి ఉందన్నారు. నకిలీ విదేశీ ఇన్వాయిస్‌లు...: విదేశీ సంస్థలకు నిధులను పంపాలంటే ‘విదేశీ ఇన్వాయిస్’ పత్రాలను బ్యాంకులకు ఇవ్వాలని, నకిలీవి సృష్టించి బ్యాంకుల్ని మోసం చేశారని డీసీపీ తెలిపారు. ఈ అక్రమ లావాదేవీల కోసం పలు బోగస్ పత్రాలను సృష్టించారని, సంతకాలను ఫోర్జరీ చేశారని చెప్పారు. నిందితులు అందరూ కలిసి కుట్రలు పన్ని, తప్పుడు పత్రాలను ఉపయోగించారని గులాటీ వివరించారు. తమ వద్దనున్న కొంతమంది ఉద్యోగుల పేర్లతో డొల్ల కంపెనీల్ని సృష్టించి మహేశ్ నిధుల్ని బదలాయిస్తుండేవాడని వివరించారు. చైనా, హాంకాంగ్, సింగపూర్ దేశాలకు తరలిన నగదు రూ.569.93 కోట్లు సాఫ్ట్‌వేర్ దిగుమతికని అధికారులకిచ్చిన పత్రాల్లో పేర్కొన్నారని... కానీ ఎలాంటి సాఫ్ట్‌వేర్‌ను ఆయా సంస్థల నుంచి దిగుమతి చేసుకోలేదని తేలిందన్నారు. నిందితులంతా డైరెక్టర్లు: తప్పుడు పత్రాలతో ప్రభుత్వాన్ని మోసం చేసి నగదు బదిలీ చేయడం కచ్చితంగా ఆర్థిక కుంభకోణమని, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద వారు శిక్షార్హులని డీసీపీ పేర్కొన్నారు. ప్రసన్నకుమార్‌రాయ్ బర్మన్, ప్రవీణ్‌కుమార్‌ఝా కోల్‌కతాలో ఛార్టెడ్ అకౌంటెంట్లుగా ఉన్నారని... డొల్ల కంపెనీలకు డైరెక్టర్లుగా కూడా వ్యవహరిస్తున్నారని తెలిపారు. నిందితులందరూ ఆయా కంపెనీల్లో డైరెక్టర్ల హోదాలో ఉన్నవారేనని వివరించారు. దేశవిదేశాల్లో లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని, కేసును సీఐడీకి లేదా సీబీఐకిగానీ బదిలీ చేయాలన్న అంశంపై ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారన్నారు. నిందితులెవర్నీ అరెస్ట్ చేయలేదని... పలు బృందాల్ని పంపి గాలిస్తున్నామని వివరించారు. నిందితులు విదేశాలకు తరలించిన నగదు ఎవరిదన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతోందని పేర్కొన్నారు. విశాఖపట్నంలో డొల్ల కంపెనీలు ఇవే 1. శ్రీపద్మప్రియ స్టోన్‌క్రషింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంవీపీ కాలనీ. 2. బాల్‌ముకుంద వేర్‌హౌసెస్ ప్రైవేట్ లిమిటెడ్, పాండురంగపురం. కోల్‌కతాలో... 1. లావెండర్ ఈ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్. 2. వామ్‌వుడ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. 3. సెరికోస్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. 4. శివ్‌కృప ట్రేడ్ లింక్ ప్రైవేట్ లిమిటెడ్. 5. ఫాక్స్‌గ్లోవ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. 6. క్లౌడ్ బెర్రీ సాఫ్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. 7. ప్రిమ్ రోజ్ టెక్నోసొల్యూషన్స్ ప్రైవేట్‌లిమిటెడ్. 8. మెరాక్ ఈ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్. 9. కౌస్తవ్ ఎక్స్‌పోర్ట్ ఇంపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్. 10. డెల్ఫినియం ఈసిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్. మొత్తం తొమ్మండుగురు కుట్రదారులు 1. వడ్డి మహేశ్ 2. వడ్డి శ్రీనివాసరావు 3. ఆచంట రాజేశ్ 4. ఆచంట హరీశ్ 5. ప్రసన్నకుమార్ రాయ్‌బర్మన్ 6. ప్రవీణ్‌కుమార్ ఝా 7. ఆయుష్‌గోయల్ 8. వినీత్ గోయంకా 9. వికార్ గుప్తా Quote
TampaChinnodu Posted May 13, 2017 Author Report Posted May 13, 2017 హవాలా కేసులో అన్నదమ్ముల అరెస్టు పెరవలి, న్యూస్‌టుడే: విశాఖ హవాలా కేసులో పాత్రధారులైన పశ్చిమగోదావరి జిల్లా పెరవలికి చెందిన అన్నదమ్ములు ఆచంట రాజేష్, హరీష్‌లను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. వీరు పెరవలిలో తల్లి్లదండ్రుల వద్దే ఉంటున్నారు. అమెరికా అధ్యక్షుడు కారణంగా ఉద్యోగాలకు ఇబ్బంది ఏర్పడిందని.. అందుకే తిరిగి వచ్చామని తల్లిదండ్రులకు చెప్పారు. విశాఖ పోలీసులు వీరిద్దరినీ తీసుకెళ్లారు. Quote
TampaChinnodu Posted May 13, 2017 Author Report Posted May 13, 2017 Just now, TampaChinnodu said: హవాలా కేసులో అన్నదమ్ముల అరెస్టు పెరవలి, న్యూస్‌టుడే: విశాఖ హవాలా కేసులో పాత్రధారులైన పశ్చిమగోదావరి జిల్లా పెరవలికి చెందిన అన్నదమ్ములు ఆచంట రాజేష్, హరీష్‌లను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. వీరు పెరవలిలో తల్లి్లదండ్రుల వద్దే ఉంటున్నారు. అమెరికా అధ్యక్షుడు కారణంగా ఉద్యోగాలకు ఇబ్బంది ఏర్పడిందని.. అందుకే తిరిగి వచ్చామని తల్లిదండ్రులకు చెప్పారు. విశాఖ పోలీసులు వీరిద్దరినీ తీసుకెళ్లారు. Quote
TampaChinnodu Posted May 13, 2017 Author Report Posted May 13, 2017 photo lo hero laa nadusthunnadu gaa. papam poor farmers ki emo sankellu. veellaki emo VIP treatment. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.