BaabuBangaram Posted May 15, 2017 Report Posted May 15, 2017 1803లో హెన్రీకాల్లే కాటన్ దంపతుల పదో సంతానంగా కాటన్ జన్మించారు. సహాయ ఇంజినీరుగా దక్షిణ విభాగంలో పంబా జలసంధిని లోతు చేసేందుకు కృషి చేశారు. 1841లో ఎలిజబెత్‌ను వివాహమాడి 1844లో విశాఖరేవుకు, గోదావరి డెల్టా అభివృద్ధికి 1860లో పదవీవిరమణ పొందినప్పటికీ ప్రభుత్వంచే రాజబంధువు బిరుదు పొంది సాగు, తాగునీటి సదుపాయం కల్పించిన ప్రజాబంధువు కాటన్. విశేష సేవలతో కేసీఎస్‌ఐ(నైట్ కమాండర్ ఆఫ్ సుప్రీం ఇండియా) అనే బిరుదు పొంది 96 సంవత్సరాల 2 నెలల పరిపూర్ణ జీవితం గడిపి 1899లో కన్నుమూశారు. నిడదవోలు: అది 1839వ సంవత్సరం. కోస్తా ఆంధ్రలో పెనుతుపాన్.. ఉప్పెన తాకిడికి సుమారు 2 లక్షల మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం స్పందించి కారణాలు తెలుసుకుని నివేదిక పంపాల్సింది కాటన్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికే తీవ్రమైన క్షామంతో అల్లాడుతున్న నదీ పరీవాహక ప్రాంత ప్రజలు రు విడిచి వలసలు వెళ్లిపోవడం ప్రారంభించారు. పైగా గోదావరి మండలం అంతా అతివృష్టికి, వరదలకు గురి కావడాన్ని ప్రత్యక్షంగా గమనించిన కాటన్ గోదావరికి ఆనకట్ట నిర్మించాలనే యోచనలో ప్రతిపాదనలు పంపించారు. ఆయన చేసిన ప్రతిపాదనకు 1846లో గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణానికి లండన్ డైరెక్టర్లు ఆమోద ముద్ర వేశారు. సర్ హెన్రీమౌంట్ గొమెరీ అనే అధికారి నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై కాటన్ గోదావరి తీర ప్రాంతాలను పరిశీలించడం ప్రారంభించారు. గోదావరి ఎగువప్రాంతం అయిన కొయిదా, జీడికుప్పం ప్రదేశాలను, పాపికొండల్లో గోదావరి ప్రవాహవేగాన్ని గమనించారు. పోలవరం వద్ద మహానంది కొండను, పొదలి కొన వద్ద గోదావరి లోతుపాతులను అధ్యయనం చేశారు. అశ్వాన్ని వాహనంగా చేసుకుని అరటి పళ్లే ఆహారంగా అహోరాత్రులు అవిరామంగా గోదావరి పరవళ్లను అధ్యయనం చేశారు. అనువైన ప్రాంతాన్ని గుర్తించి.. రాజమహేంద్రవరం దిగువున గోదావరి లంకలు, ఇసుకతిప్పలతో నాలుగు పాయలతో వెడల్పు ఉన్న ప్రదేశాన్ని ఆనకట్టకు అనుకూలంగా గుర్తించారు. ఈ ప్రదేశంలో ఆనకట్ట కట్టడానికి నిర్మాణ దశలో నదినీటిని మళ్లించడానికి అనువైన ప్రదేశంగా గుర్తించి ధవళేశ్వరం-విజ్జేశ్వరంల మధ్య ఆనకట్ట నిర్మాణానికి కాటన్ నిర్ణయం తీసుకున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణానికి నివేదికను కాటన్ అప్పటి మద్రాస్ గవర్నర్ మార్కస్ ఆఫ్ ట్వేత్‌డేల్‌కు అందించగా ఆయన ఆమోదించి లండన్ పంపగా అక్కడి బోర్డు ఆఫ్ డైరెక్టర్లు 1846లో రాజముద్ర వేసి ఆమోదించారు. మరుసటి సంవత్సరం నుంచే ఆనకట్ట నిర్మాణ పనులను ప్రారంభించారు. అప్పటి సబ్‌కలెక్టర్ హెచ్.ఫోర్డ్సు జిల్లా యంత్రాగంతో కూలీలను చేర్పించే బాధ్యతలను చేపట్టారు. 1949లో బ్రిటి ష్ ప్రభుత్వం నుంచి ఆనకట్ట నిర్మాణానికి నిధులు పూర్తిగా అందడంతో కాటన్ పనులను ముమ్మరం చేశారు. 1852లో ఆనకట్టకు మూడు అడుగుల తలుపులు అమర్చి సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి ఆనకట్ట నిర్మాణం పూర్తయ్యిందంటూ కాటన్ ప్రభుత్వానికి నివేదిక పంపించారు. సకాలంలో నిర్మాణం పూర్తి సేద్యపు అవసరాలకు నీటి సరఫరా సరిపోకపోవడంతో 1862-67ల మధ్య ఆనకట్ట ఎత్తును రెండు అడుగులకు పెంచారు. తిరిగి 1897-1899ల మధ్య ఆనకట్టను సిమెంట్, కాంక్రీట్‌తో 9 అంగుళాలు ఎత్తు పెంచారు. ఆనకట్ట నిర్మాణాన్ని సకాలంలో పూర్తిచేసి కొన్ని లక్షల కుటుంబాలకు జీవనోపాధి కల్పించిన కాటన్ మహాశయుని ప్రతిభను గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వం ‘సర్’ బిరుదునిచ్చి సత్కరించింది. 1852లో గన్నవరం వద్ద అక్విడెక్టు ఆవశ్యకతను గుర్తించి నిర్మాణం చేశారు. అన్నపూర్ణగా ఖ్యాతి గోదావరిపై ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజీ నిర్మాణం కాక ముందు ఉభయగోదావరి జిల్లాలు తీవ్ర కరవుకాటకాలతో విలవిలలాడాయి. 1852లో కాటన్ బ్యారేజీ నిర్మాణం అనంతరం అప్పటి వరకు కరవు కాటకాలతో ఉన్న ప్రాంతం ఒక్కసారిగా పచ్చని పంటపొలాలతో ఆంధ్రా అన్నపూర్ణగా ఖ్యాతికెక్కాయి. ఆనకట్ట నిర్మాణం అనంతరం కొద్ది కాలం పాటు 2.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. ఆ సమయంలో ఖరీఫ్, రబీ పంటలకు సంబంధించి 10 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం దిగుబడి వచ్చేది. అనంతరం బ్యారేజీ గేట్ల ఎత్తును పెంచి సాగునీరు అందించడంతో ఏటా రెండు పంటలకు 5.50 లక్షల ఎకరాల చొప్పున సాగునీరు అందిస్తున్నారు. స్టీమ్ బాయిలర్... ఈ పరికరాన్ని కాటన్ ఉపయోగించేవారు. పరికరాలు పనిచేయాలంటే ఈ యంత్రం ద్వారా ఆవిరిపట్టి బొగ్గును నింపి విద్యుదుత్పత్తి చేసేవారు. ఇటుక...ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణ సమయంలో కాటన్ వినియోగించిన ఇటుకలు ఆవిరియంత్రం...ఆనకట్ట తలుపులకు రివిట్లు వేసేందుకు ఉపయోగించిన స్టీమ్ ఇంజన్ ఆనకట్ట...గోదావరిపై తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం నుంచి పశ్చిమగోదావరి జిల్లా విజ్జేశ్వరాన్ని కలుపుతూ నిర్మించిన ఆనకట్ట రంధ్రాలను పూడ్చే యంత్రం...ఆనకట్ట లోపల ఏర్పడిన రంధ్రాలను పూడ్చగలిగే ఎయిర్ కంప్రెషర్ పరికరం ఇది. ముందు ఇసుక చల్లించి ఆ తర్వాత బండరాళ్లను పంపించి పటిష్టత చేసేందుకు వాడేవారు. గేట్ల తలుపులు తుప్పు వదిలించే పరికరమిది. రివిట్‌రంధ్రాలు వేసే యంత్రం...ఈ పరికరం పేరు రివిటింగ్ వాల్ పంచింగ్ మిషన్. ఆనకట్ట నిర్మాణ సమయంలో తలుపులు, గేట్లను జత చేసేందుకు, బెండులు తీసేందుకు దీన్ని వాడేవారు. స్కవర్ స్లూయిస్, ఇనుపగడ్డర్లు ఏర్పాటు చేయడానికి ఉపయోగించేవారు. సానపట్టే యంత్రం...ఆనకట్ట తలుపులు తయారు చేసేందుకు వాటికి అవసరమైన సాన పట్టేందుకు ఈ యంత్రాన్ని వినియోగించేవారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.