BaabuBangaram Posted May 17, 2017 Report Posted May 17, 2017 అర్జునా.. ఫల్గుణా అనక్కర్లేదు.. పిడుగును ముందే పట్టేస్తారు అరగంట ముందే హెచ్చరిక మొబైల్ ఫోన్లకు సమాచారం తొలిసారిగా ఏపీలో ప్రయోగం ఈనాడు - అమరావతి తుపాన్లపై ముందే హెచ్చరికలు వస్తాయి.. వర్షాలు ఎప్పుడుపడతాయో, ఉష్ణోగ్రతలు ఏ మేరకు పెరుగుతాయో కూడా ముందే తెలుస్తోంది. అయితే పిడుగుల గురించి మాత్రం ముందుగా తెలిసే అవకాశం ఇంతవరకు లేదు. ఇప్పుడది అందుబాటులోకి వచ్చింది. పిడుగులు ఎప్పుడు.. ఏ ప్రాంతంలోపడే అవకాశం ఉందో అరగంట ముందే హెచ్చరించే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ సమకూర్చుకుంది. ఈమేరకు హెచ్చరికలు కూడా జారీ చేస్తోంది. మంగళవారం రాత్రి చిత్తూరు జిల్లా కుప్పం, పలమనేరు మండలాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నట్లు ముందే హెచ్చరించింది. కుప్పం మండలంలో కాకిమడుగు, కొత్తపల్లి గ్రామాల సమీపంలో, పలమనేరు మండలంలో మొగిలి, కుమైల మధ్య పిడుగుపడే అవకాశాన్ని పసిగట్టారు. ఇటీవల అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం కలుగోడులో పిడుగు ప్రమాదంపై పావుగంట ముందుగానే జిల్లా యంత్రాంగానికి సమాచారమిచ్చారు. ఈ పరిజ్ఞానంపై ఇటీవల మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చించారు. విపత్తుల నిర్వహణ కమిషనర్ శేషగిరిబాబు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని గురించి, తాము ఇస్రోతో చేసుకున్న ఒప్పందాన్ని గురించి వివరించారు. ఇదీ నేపథ్యం: విపత్తుల నిర్వహణ సంస్థ అమెరికాకు చెందిన ఎర్త్ నెట్‌వర్క్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంది. దీని ద్వారా ఏ ప్రాంతంలో పిడుగుపడుతుందో.. అక్కడ నివాస ప్రాంతాలున్నాయా లేదో కూడా తెలుసుకోవచ్చు. వెంటనే ఆ ప్రాంత అధికార యంత్రాంగానికి సమాచారాన్ని పంపిస్తారు. ఈ హెచ్చరికల్ని వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు కూడా చేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. మంగళవారం రాత్రి ఇలాగే హెచ్చరికలు జారీ చేయడంతో ఆయా ప్రాంతాల అధికారులు, ప్రజా ప్రతినిధులు అప్రమత్తమై దండోరా వేయించారు. కుప్పం ప్రాంతంలో రెండు పిడుగులుపడ్డాయనీ, వాటిలో ఒకటి బైరెడ్డిపల్లె జనావాసాలకు 200 మీటర్ల దూరంలో పడిందని ఏపీ విపత్తు నిర్వహణ సాధికార సంస్థ తెలిపింది. దేశంలో ఇదే తొలిసారి * పిడుగుపాటుపై ముందుగా సమాచారాన్ని పసిగట్టి హెచ్చరించడం దేశంలో ఇదే తొలిసారి. * ఇందుకోసం అనంతపురం, కుప్పం, విశాఖల్లో ప్రత్యేక సెన్సార్లు ఏర్పాటు చేశారు. మరో 8 ప్రాంతాల్లో కూడా ఇలాంటివి ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో సెన్సారు పరిధి 200 కి.మీ. ఉంటుంది. * కుప్పం ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థినుల బృందం పిడుగుపాటును తెలిపే యాప్‌ను సిద్ధం చేస్తోంది. * ఎక్కడ పిడుగుపడే అవకాశం ఉందో అక్కడి సెల్ టవర్ల ఆధారంగా ఆ ప్రాంత ప్రజల మొబైల్ ఫోన్లకు సమాచారం పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ శేషగిరిబాబు తెలిపారు. Quote
naaperunenu Posted May 17, 2017 Report Posted May 17, 2017 telugu prajala meeda chandra babu lanti pidugu padinappudu...ilanti app untey bagundu... Quote
princeofheaven Posted May 17, 2017 Report Posted May 17, 2017 28 minutes ago, naaperunenu said: telugu prajala meeda chandra babu lanti pidugu padinappudu...ilanti app untey bagundu... Quote
BaabuBangaram Posted May 18, 2017 Author Report Posted May 18, 2017 eeroju kuda mundhugaane inform chesaru so no damage Quote
bhaigan Posted May 18, 2017 Report Posted May 18, 2017 6 minutes ago, BaabuBangaram said: eeroju kuda mundhugaane inform chesaru so no damage yes chittoor dist la ne kada Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.