BaabuBangaram Posted May 30, 2017 Report Posted May 30, 2017 ఇంటర్నెట్ డెస్క్: తిరుకుమార్.. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఈ పేరు తెలియని వారుండరు. ఇంతకీ ఏమిటీ ఆయన ప్రత్యేకత అంటారా? న్యూయార్క్ వాసులకు 44 రకాల దోశలను పరిచయం చేసిన వ్యక్తి. సాధారణంగా ‘దోశ’ అనేది భారతీయుల్లో మరీ ముఖ్యంగా దక్షిణ భారతీయులకు ఎంతో ఇష్టమైన వంటకం. అటువంటి దాంతో శ్రీలంకకు చెందిన తిరుకుమార్ న్యూయార్క్‌లో పేరుప్రఖ్యాతలు పొందాడు. అందుకే తిరుకుమార్ను ‘‘దోశ మ్యాన్’గా పిలుస్తుంటారు. అయితే తిరుకుమార్ జీవితం నల్లేరుమీద నడకేం కాదు. ఎన్నో కష్టనష్టాలనొర్చి ఈ స్థాయికి రాగలిగాడు. శ్రీలంక నుంచి అమెరికాకు వలస వెళ్లిన తిరుకుమార్ మొదట నిర్మాణ రంగంలో కార్మికుడిగా జీవితాన్ని ఆరంభించాడు. తర్వాత రోడ్డు పక్కన అల్పాహారం విక్రయించే చిన్నపాటి దుకాణం పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. సుమారు మూడున్నర సంవత్సరాల తర్వాత గానీ ప్రభుత్వ అధికారుల నుంచి అనుమతి పొందలేకపోయాడు. 2001లో వాషింగ్టన్ స్క్వేర్ పార్క్ వద్ద దుకాణం ప్రారంభించాడు. ఇక అప్పటి నుంచి వెనుక్కి తిరిగి చూడలేదు. అందులో రోటీ, కూర, కేకులు, సమోసాలు, తన ప్రత్యేకమైన దోశలను విక్రయిస్తాడు. అక్కడ శాకాహార దుకాణం తిరుకుమార్దే కావడం విశేషం. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 11.15గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు దుకాణం కిటకిటలాడుతూనే ఉంటుంది. తిరుకుమార్ దోశ కార్ట్‌కు కాలిఫోర్నియా, జపాన్‌లో ఫ్యాన్ క్లబ్స్ ఉండటం గమనార్హం. Quote
BaabuBangaram Posted May 30, 2017 Author Report Posted May 30, 2017 4 minutes ago, mahesh1 said: yadi kelli ettukostav isonti news... Eenadu...office lo khali roju eenadu.net pai nunchi kindha varaku chaduvutha Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.