TampaChinnodu Posted June 5, 2017 Report Posted June 5, 2017 తలమానికం పరిపాలన నగరం అమరావతిలో 900 ఎకరాల్లో పరిపాలన నగరం, మరో 465 ఎకరాల్లో న్యాయనగరం నిర్మాణ పనులు అతి త్వరలో మొదలవనున్నాయి. లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ సంస్థ 1365 ఎకరాల్లో పరిపాలన, న్యాయ నగరాలకు ప్రణాళిక, ఐకానిక్ భవనాలుగా నిర్మించే శాసనసభ, హైకోర్టుల ఆకృతులు సిద్ధం చేస్తోంది. పరిపాలన నగర ప్రణాళిక దాదాపు సిద్ధమైంది. శాసనసభ ఆకృతిపై కూడా ఒక స్పష్టత వచ్చింది. హైకోర్టు ఆకృతిని రెండు వారాల్లో ఖరారు చేయనున్నారు. ఆ వెంటనే టెండర్లు పిలిచి, రెండు నెలల్లో పరిపాలన నగర పనులు ప్రారంభించాలన్నది ఆలోచన. పరిపాలన నగరంలో సచివాలయం, విభాగాధిపతులు కార్యాలయ భవనాలు, గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రుల నివాస భవనాల ఆకృతుల రూపకల్పనకు ఆర్కిటెక్ట్‌ల ఎంపిక ప్రక్రియ తుది దశలో ఉంది. పరిపాలన నగరాన్ని రాజధానికే తలమానికంగా, అత్యద్భుతంగా నిర్మించాలన్నది ప్రభుత్వ సంకల్పం. శాసనసభ భవనంతో పాటు, నగరం మొత్తాన్ని తిలకించేందుకు పరిపాలన నగరం మధ్యలో నిర్మించే 560-600 అడుగుల ఎత్తైన టవర్, జలమార్గాలు, ఎలక్ట్రిక్ కార్లు, వాటర్ ట్యాక్సీలు, సెంట్రల్ స్పైన్ వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పరిపాలన నగరంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు, వివిధ దేశాల కాన్సులేట్లు, మిషన్లు, కల్చరల్ సెంటర్లు వంటివి ఉంటాయి. 8 లక్షల చ.అడుగుల టవర్..! అమరావతిలోని కేంద్ర రాజధాని ప్రాంతంలో 1691 ఎకరాల్ని... సింగపూర్‌కి చెందిన అసెండాస్-సింగ్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్ సంస్థల కన్సార్టియం, అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) కలసి స్టార్టప్ ప్రాంతంగా అభివృద్ధి చేస్తాయి. సింగపూర్ సంస్థల కన్సార్టియంతో ఇటీవలే ఒప్పందం, ప్రాజెక్టుకి శంకుస్థాపన జరిగాయి. 1691 ఎకరాల్ని మూడు దశల్లో అభివృద్ధి చేస్తారు. మొదట 656 ఎకరాల్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఉత్ప్రేరక అభివృద్ధిలో భాగంగా మొదటి దశలో 50 ఎకరాల్లో 8 లక్షల చ.అడుగుల నిర్మితప్రాంతం కలిగిన వాణిజ్య టవర్ నిర్మిస్తారు. ఆ తర్వాత అలాంటిదే మరో టవర్ నిర్మాణం చేపడతారు. 15 ఏళ్లలో మొత్తం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది లక్ష్యం. అమరావతిలో 80 ఎకరాల్లో బిజినెస్ పార్కు, 40 ఎకరాల్లో మైస్‌హబ్ ఏర్పాటుకి సీఆర్డీఏ త్వరలోనే టెండర్లు పిలవనుంది. మైస్ హబ్‌లో కన్వెన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్ స్పేస్; హోటళ్లు వంటివి వస్తాయి. రాజధానిలో ఐదు, నాలుగు, మూడు నక్షత్రాల హోటళ్లకు టెండర్లు పిలవగా 8 బిడ్లు వచ్చాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పాఠశాలల ఏర్పాటుకి బిడ్లు ఆహ్వానించగా 16 బిడ్లు వచ్చాయి. ప్రస్తుతం బిడ్ల పరిశీలన జరుగుతోంది. - ఈనాడు, అమరావతి Quote
TampaChinnodu Posted June 5, 2017 Author Report Posted June 5, 2017 2 నెలల్లో పాలన నగర పనులు 40 రోజుల్లో మిగిలిన భూసేకరణ పూర్తి రైౖతులకిచ్చిన స్థలాల్లో నెలలో లేఅవుట్ల అభివృద్ధి: ‘ఈనాడు’తో మంత్రి నారాయణ ఈనాడు, అమరావతి: పాలనానగరం, అంకుర ప్రాంతం (స్టార్టప్ ఏరియా)లో నిర్మాణాలు, విద్యాసంస్థలు, కార్పొరేట్ ఆసుపత్రులు, నక్షత్రాల హోటళ్లు, అంతర్జాతీయ స్థాయి పాఠశాలల నిర్మాణంతో... వచ్చే ఏడాది చివరి నాటికి రాజధాని నిర్మాణం తొలిదశ కొలిక్కి వస్తుందని మున్సిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ పేర్కొన్నారు. మొత్తం రాజధాని నగర ప్రాంతంలో సమీకరణ కింద ప్రభుత్వానికివ్వని భూమంతటినీ 40రోజుల్లో సేకరణ రూపంలో తీసుకుంటామని వెల్లడించారు. 2013 భూసేకరణ చట్టం కింద ఈభూమిని సేకరిస్తున్నట్లు తెలిపారు. రైతులకిచ్చిన స్థలాల అభివృద్ధి పనులకు నెలలో శ్రీకారం చుట్టబోతున్నామని పేర్కొన్నారు. గ్రామకంఠాల సమస్య 99శాతం పరిష్కారమైందని, ఇతరత్రా భూవివాదాల పరిష్కారమూ దాదాపు పూర్తయినట్లేనని వెల్లడించారు. అమరావతి నిర్మాణ విశేషాల్ని ‘ఈనాడు’కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరించారు. ‘‘రాజధానిలో అత్యంత కీలకమైన పాలనానగర నిర్మాణ పనులు రెండు నెలల్లో ప్రారంభించబోతున్నాం. 15 రోజుల్లో నార్మన్ ఫోస్టర్ సంస్థ తుది నమూనా అందిస్తుంది. ఆపై మూడు వారాల్లో స్ట్రక్చరల్ డిజైన్ ఇస్తుంది. వెంటనే టెండర్లు పిలుస్తాం. ఆ పనులతో పాటే దిగ్గజ (ఐకానిక్) నిర్మాణాలైన శాసనసభ, హైకోర్టు పనులు ప్రారంభమవుతాయి. విట్, ఎస్ఆర్ఎం విద్యా సంస్థల భవనాల పనులు వేగంగా సాగుతున్నాయి. తొలిదశలో బ్యారేజీ పక్కనుంచే సీడ్ యాక్సెస్ రహదారి: కనకదుర్గ వారధి నుంచి సీడ్ యాక్సెస్ రహదారిని నిర్మించాలంటే భారీ పైవంతెనతోపాటు జనావాసాల మధ్యనుంచి ఆరు వరసల రహదారి నిర్మించాల్సి ఉంటుంది. ఇది ఆలస్యమవుతున్నందున... ప్రజలకు సీడ్ యాక్సెస్ రహదారి త్వరగా అందుబాటులోకి వచ్చేందుకు వీలుగా ప్రస్తుతానికి ప్రకాశం బ్యారేజ్ పక్కనుంచే సీడ్ యాక్సెస్ రహదారి ప్రారంభమయ్యేలా కొన్ని మార్పులు చేశారు. ఇక్కడ కొంత భూమిని సేకరించాలి. అది పూర్తయ్యాక ఈపనులు ప్రారంభమవుతాయి. ఇప్పటికే ఈరహదారి నిర్మాణం చాలా వేగంగా జరుగుతోంది. నాలుగైదు నెలల్లో అందుబాటులోకి వస్తుంది. మలిదశలో మణిపాల్ ఆసుపత్రి వరకు పొడిగిస్తాం. రైతులకిచ్చిన స్థలాల్ని లేఅవుట్లుగా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే టెండర్లు పిలిచాం. నెలలో ఈ పనులు ప్రారంభమవుతాయి. రాజధాని నగరాభివృద్ధికి హడ్కో నుంచి రూ.7వేల కోట్లు, ప్రపంచబ్యాంకు నుంచి రూ.6800 కోట్లు మంజూరయ్యాయి. ఈ ప్రాంత అభివృద్ధికి మొత్తం రూ.25వేల కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం. పేదలకు 5వేల ఇళ్లు! రాజధానిలో ఇళ్లు లేని పేదలకి మొదటి దశలో ఒక్కోటి రూ.5.5లక్షల వ్యయంతో 300చ. అడుగుల విస్తీర్ణంలో 5 వేల మందికి ఫ్లాట్లు నిర్మిస్తున్నాం. వీటిల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీ రూ.3లక్షలు, లబ్ధిదారుని పేరిట బ్యాంకు రుణం రూ.2.5లక్షలు చొప్పున ఉంటుంది. రెండోదశలో మరో రెండు వేల ఫ్లాట్లు నిర్మిస్తాం. ఉపాధి లేని రైతు కూలీలందరికీ నిర్మాణ పనుల్లోకి తీసుకునే ఏర్పాటుచేశాం. Quote
pahelwan Posted June 5, 2017 Report Posted June 5, 2017 Padinde padara pachipalla dasari anattu same ppt tho andhra janalki bale comedy chupistunaru kada pulkas Quote
sattipandu Posted June 5, 2017 Report Posted June 5, 2017 2 minutes ago, idibezwada said: i love the irony Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.