Jump to content

Recommended Posts

Posted
సీఎం బంధువుకు రూ. 1,000 కోట్ల సర్కారు భూమి నజరానా
బామ్మర్ది వియ్యంకుడు ఎంవీవీఎస్‌ మూర్తికి 55.24 ఎకరాల భూమి కారు చౌకగా కట్టబెట్టేందుకు కేబినెట్‌ రెడీ
 
ప్రభుత్వ ముఖ్య నేతకు దగ్గరి బంధువు కావడంతో చట్టమూ చుట్టమైపోయింది.. అడిగిందే తడవుగా అంతా అనుకూలంగా చేసి పెట్టండని కనుసైగ చేశారు.. తప్పు తప్పన్న అధికారులే ఒప్పు అంటున్నారు.. నిబంధనలు నీరుగారిపోయాయి.. కబ్జా చేయడం ఇంత సులువా అన్నట్లు వ్యవహారం సాగిపోయింది.. తుదకు కంచే చేనును మేసింది.. జనమేమనుకుంటారనే ఇంగిత జ్ఞానం లేకుండా విలువల వలువలూడదీశారు.. దండుకోవడమే పరమావధిగా నీతి, నియమాలకు పాతరేశారు.. రాచరిక పాలనే లక్ష రెట్లు నయం అనిపిస్తున్నారు.
 
సాక్షి, అమరావతి: అది నూటికి నూరు శాతం ప్రభుత్వ భూమి. ‘గీత’O దాటి దర్జాగా ఆక్రమించాడు. అధికారులు సర్వే నిర్వహించి కబ్జాకు గురైందని సర్కారుకు నివేదించారు. చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు మిన్నకుండిపోయారు. దీంతో తన అవసరాలకు ఆ భూములు కేటాయించాలని కబ్జాదారుడు దరఖాస్తు చేశారు. మరోమాటకు తావు లేకుండా ఆ భూములు అతనికే ఇచ్చేయాలంటూ ఫైలు సిద్ధమై పోవడం విస్తుగొలుపుతోంది. టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ, గీతం కాలేజీ చైర్మన్‌ ఎంవీవీఎస్‌ మూర్తి ప్రభుత్వ ముఖ్య నేతకు దగ్గరి బంధువు. విశాఖపట్నం జిల్లా యండాడ, రుషికొండ గ్రామాల్లోని సర్వే నెంబర్లు 15పి, 16పి, 19పి, 20పి, 55పి, 61పి, 34, 35, 37, 38ల్లోని 55.24 ఎకరాలను 2013లో ఆక్రమించుకున్నారు.

ఈ భూమి విలువ సుమారు రూ.1,000 కోట్లకు పైగానే పలుకుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆక్రమించుకున్న ఈ భూములను గీతం కాలేజీకి కేటాయించాలంటూ 2014లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయమై అప్పటి ప్రభుత్వ పెద్దలు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అయినా అధికారులు లొంగలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో విశాఖపట్నంలోని ఎంతో విలువైన ఈ భూమి ప్రభుత్వ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, మూర్తికి కేటాయించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

అయినా ఒత్తిడి పెరగడంతో ఏదో విధంగా ఆ భూములను కాపాడాలనే ఉద్దేశంతో 2014లో ఎస్సీ హాస్టల్‌ కాలేజీ నిర్మాణానికి ఐదు ఎకరాలు, పోస్టు మెట్రిక్‌ విద్యార్థులకు రెండు హాస్టళ్ల నిర్మాణాలకు ఆరు ఎకరాలు, బలహీన వర్గాల గృహ నిర్మాణం, శిక్షణ కేంద్రాలకు ఆరు ఎకరాలు, ఆదాయపు పన్ను శాఖ విభాగం కార్యాలయం, ఇళ్ల నిర్మాణాలకు ఆరు ఎకరాలు, ఇందిరాగాంధీ జాతీయ ఓపెన్‌ యూనివర్సిటీ రీజినల్‌ కేంద్రం భవన నిర్మాణానికి ఐదు ఎకరాలు, పోస్టు మెట్రిక్‌ విద్యార్థినుల రెండు హాస్టళ్ల నిర్మాణాలకు ఏడు ఎకరాలను కేటాయించారు. ఈ 35 ఎకరాల భూమిని భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఎ) కేటాయింపులకు అనుగుణంగా ఆయా సంస్థలకు అప్పగించలేదు. దీనిపై విశాఖపట్నానికి చెందిన ఒక పౌరుడు.. ఎంవీవీఎస్‌ మూర్తి 55.24 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించడమే కాకుండా అనుమతి లేకుండా నిర్మాణాలను చేపట్టారని జిల్లా కలెక్టర్, డీజీపీ, పోలీసు కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు. దీనిపై విచారణ జరిపి నిర్మాణాలను తొలగించి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు.
 
భూ ఆక్రమణ నిజమే..
గీతం కాలేజీ చైర్మన్‌ ఎంవీవీఎస్‌ మూర్తి.. ప్రభుత్వ భూమి 55.24 ఎకరాలను ఆక్రమించిన విషయం వాస్తవమేనని జిల్లా కలెక్టర్, ఆర్‌డీవో, తహసీల్దార్‌ ధ్రువీకరించారు. సర్వే అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నేతృత్వంలో సర్వే చేయించి కబ్జాను నిగ్గు తేల్చారు. యండాడ, బుషికొండలో గీతం యూనివర్సిటీ ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను గూగుల్‌ మ్యాప్‌తో సహా ధృవీకరిస్తూ 2015 అక్టోబర్‌ 8వ తేదీన తహసీల్దార్‌ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
 
అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం ఆ భూములను స్వాధీనం చేసుకోలేదు. ఈ నేపథ్యంలో తహసీల్దార్, డిప్యుటీ తహసీల్దార్‌ గీతం కాలేజీ యాజమాన్యం నుంచి లంచం తీసుకుని కబ్జాను పట్టించుకోవడం లేదని మరో పౌరుడు గత ఏడాది డిసెంబర్‌లో జిల్లా కలెక్టర్‌కు, డీజీపీ, విశాఖపట్టణం సీఐడీ రీజినల్‌ కార్యాలయం అదనపు ఎస్‌పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐడీ అదనపు ఎస్‌పీ స్పందిస్తూ.. నేరుగా తమంతట తాము చర్యలు తీసుకోలేమని చెప్పారు. డీజీపీ, సీఐడీ అదనపు డీజీపీకి ఫిర్యాదు చేయాలని, అప్పుడు దర్యాప్తునకు ఆదేశిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తరుణంలో ఈ భూ ఆక్రమణలపై జాయింట్‌ కలెక్టర్, తహసీల్దారు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలకు సంబంధించి సర్వే ల్యాండ్‌ రికార్డుల అదనపు డైరెక్టర్‌ రూపొందించిన నివేదిక ఇవ్వాల్సిందిగా ఆ పౌరుడు జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేశారు. గీతం కాలేజీ ఆక్రమణలను నిర్ధారిస్తూ సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డుల అదనపు డైరెక్టర్‌ సమర్పించిన మ్యాప్‌ను గత ఏడాది డిసెంబర్‌లో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం అతనికి అందజేసింది.
 
ఆ భూములిచ్చేయాలంటూ కలెక్టర్‌ సిఫార్సు
కబ్జా జరిగిందని ధ్రువీకరించినా ఆ భూములను వదులు కోవడానికి గీతం వర్సిటీ ససేమిరా అంటూ మళ్లీ చక్రం తిప్పింది. ప్రభుత్వ ముఖ్య నేత సూచన మేరకు గీతం కాలేజీ చైర్మన్‌.. ఆ భూములు తనకే కేటాయించాలని కోరుతూ ఇటీవల జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. సామాజిక సేవలో భాగంగా కాలేజీని నిర్వహిస్తున్నానని, నామమాత్రపు ధరకు 55.24 ఎకరాలను తనకు ఇవ్వాలని దరఖాస్తులో పేర్కొన్నారు. ఆ దరఖాస్తుకు అనుగుణంగా జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. గీతం కాలేజీ ఆక్రమించుకున్న భూమి ప్రభుత్వానిదేనని జిల్లా అధికార యంత్రాంగం నిర్ధారించినా, అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా.. పట్టించుకోక పోవడం అటుంచి, నామమాత్రం ధరకు వారికే ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్‌ సిఫార్సు చేయడం పట్ల అధికార యంత్రాంగం నివ్వెరపోతోంది. జిల్లా కలెక్టర్‌ సిఫార్సు ఆధారంగా ఆగమేఘాలపై రూ.1,000 కోట్ల విలువైన భూమిని ఎంవీఎస్‌ మూర్తికి చౌక ధరకు కట్టబెట్టేందుకు ఫైలు సిద్ధమైపోయింది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఇందుకు ఆమోదం తెలపాలని నిర్ణయించారు. 

Posted
రోడ్డునపడ్డ 250 మంది ఉద్యోగులు.
స్టార్టప్‌ కంపెనీల పేరుతో నిరుద్యోగులకు బురిడీ

ఒక్కొక్కరి నుంచి 2 లక్షల వరకు వసూళ్లు
నెలలు తిరక్కుండానే మూత.. కంపెనీలపై కేసు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి):
 అదో ఐటీ కంపెనీ. తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్‌ కంపెనీలను ప్రోత్సహించడంతో పుట్టుకొచ్చిన కంపెనీ. మూడు నెలల క్రితమే ప్రారంభమైంది. ఏమైందో ఏమో ఉన్నట్టుండి బోర్డు తిప్పేసింది. యథావిధిగా విధులకు వచ్చిన ఉద్యోగులు.. కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో అవాక్కయ్యారు. యాజమాన్యానికి ఫోన్‌ చేయగా..‘‘వారం రోజులు ఆగండి. ప్రస్తుతం ప్రాజెక్టులు లేవు’’ అని సమాధానం వచ్చింది. అలా వారాలు గడిచినా కంపెనీ మాత్రం తెరుచుకోలేదు. ఇంతకూ.. వారికి ఆ కొలువు ఊరికే రాలేదు.

ఒక్కొక్కరు అక్షరాల రెండు లక్షల రూపాయలు సమర్పించుకున్నారు. ఒక్కసారిగా కంపెనీ బోర్డు తిప్పేయడంతో మోసపోయామని గ్రహించిన ఉద్యోగులు పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్‌కే తలమానికమైన ఐటీ కారిడార్‌లో ఇలా వారం రోజుల వ్యవధిలో మొత్తం నాలుగు స్టార్టప్‌ కంపెనీలు బోర్డులు తిప్పేశాయి. ఫలితంగా 250 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు.

అవెన్యూ ‘మాయ’..
కంపెనీ పేరు అవెన్యూ ఐటీ. గచ్చిబౌలిలో బహుళ అంతస్తుల భవనంలో కార్యాలయం. మూడు దశల్లో ఇంటర్వ్యూ. కొలువుకు ఎంపికైతే ఏడాదికి రూ.3 లక్షల ప్యాకేజీ. ఏ మాత్రం ఆలోచించకుండా నిరుద్యోగులు ఆ కంపెనీ వైపు ఆకర్షితులయ్యారు. ఇదే అదనుగా కన్సల్టెన్సీల ద్వారా వచ్చేవారు రూ. 2 లక్షలు.. నేరుగా కంపెనీ నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారు రూ.1.5 లక్షలు చెల్లించాలని కంపెనీ షరతు విధించింది. దాంతో 120 మంది వరకు కంపెనీ ఖాతాలో డబ్బు జమచేశారు. రెండు నెలలు ట్రైనింగ్‌తో వెల్లదీసిన కంపెనీ.. మొదట్లో నెలకు రూ.10 వేలు ఇచ్చి సరిపెట్టింది.

వారం రోజుల క్రితం ఒక లీగల్‌ అడ్వజర్‌ను తీసువచ్చి.. ‘‘కొన్ని కారణాల వల్ల కంపెనీ మూతపడింది. మీరు వేరే ఉద్యోగం చూసుకోండి. పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నా ఫర్వాలేదు. న్యాయపరంగా మేం చేసింది సబబే’’ అని చెప్పించింది. ఇలా అయితే ఎలా అని ప్రశ్నించిన కొందరు ఉద్యోగులను కొంత ముట్టజెప్పి వారి నోరు మూయించింది. దాంతో 120 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. బాధితులు మాదాపూర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ పోలీ్‌సస్టేషన్‌లో ఇలాంటి మరో రెండు కేసులు నమోదైనట్లు సమాచారం. రాయదుర్గంలోని మరో కంపెనీని కూడా ఇలాగే మూసేయడంతో 40 మంది ఉద్యోగాలు కోల్పోయారు.

స్టార్టప్‌ ముసుగులో..!
బిచాణా ఎత్తేసిన కంపెనీలు అన్ని స్టార్టప్‌ కంపెనీ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్‌ కంపెనీలకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని గమనించిన కేటుగాళ్లు.. కన్సల్టెన్సీల ద్వారా ఈ మోసానికి పాల్పడుతున్నట్లుగా తేలింది. ఇలాంటి కంపెనీల చేతుల్లో మోసపోతున్న వారిలో అత్యధికంగా బీటెక్‌ విద్యార్థులు ఉండటం గమనార్హం.

బ్యాక్‌డోర్‌ నియామకాలంటే నమ్మొద్దు
కొందరు ఐటీకారిడార్‌లో కంపెనీలు స్థాపించి నిరుద్యోగులను మోసం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. బ్యాక్‌డోర్‌ ఉద్యోగాలని చెప్పి కుచ్చుటోపీ పెడుతున్నారు. ఈ తరహా కంపెనీలు ఒక గదిని అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నాయి. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.1-3 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ఇలాంటి కంపెనీల పట్ల నిరుద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. బ్యాక్‌డోర్‌ నియామకాలంటే నమ్మొద్దు.
-విశ్వప్రసాద్‌, డీసీపీ మాదాపూర్‌.

Posted
1 minute ago, Annayya_fan said:

Full details vunte veyye man. owners , companies names etc. So that people will benefit in future.

Posted

Wow. Both the states govts rocks anthey.

Idiots ruling the states. Another bunch of idiots dreaming to rule.

Posted
Just now, Vaampire said:

Wow. Both the states govts rocks anthey.

Idiots ruling the states. Another bunch of idiots dreaming to rule.

Yes. Real estate mafia at its best in both the states. 

Posted
1 minute ago, TampaChinnodu said:

Full details vunte veyye man. owners , companies names etc. So that people will benefit in future.

for full details contact madhapur police station

Posted
1 minute ago, DiscoKing said:

thank you sakshi

sakshi lo vachindi ante pachi nijam annattu %$#$%$#$ 

Posted
1 minute ago, DiscoKing said:

thank you sakshi

inko news paper em vundi man refort seyyataaniki. 

for profit university ki assalu govt land seap gaa enduku ivvali. not just in AP, Also applies to TG too.

Posted
1 minute ago, TampaChinnodu said:

inko news paper em vundi man refort seyyataaniki. 

for profit university ki assalu govt land seap gaa enduku ivvali. not just in AP, Also applies to TG too.

froofs eyamanu via mee sakshi vodini... image amaravati lo scam ani chinchukunadu proofs adigithe sound ledu @3$%  

Posted
4 minutes ago, DiscoKing said:

thank you sakshi

Just thanks seppe badulu , opposite argument news emina vunte post seyye.

Posted
Just now, TampaChinnodu said:

Just thanks seppe badulu , opposite argument news emina vunte post seyye.

sakshi news media disco @3$% 

Posted
1 minute ago, DiscoKing said:

sakshi news media disco @3$% 

From Hindu. This is the man who is asking for lands.

MLC M.V.V.S. Murthi on Sunday tendered an unconditional apology for his derogatory comments against the Andhra University, his alma mater.

His apology, terming it a slip of the tongue, came from the dais on the second day of the Mahanadu at the AU Engineering College grounds in the presence of Chief Minister N. Chandrababu Naidu.

His comment during the Mahanadu poster release that AU was a “ghost campus” and Mahanadu would spruce it up and bring international fame drew flak from the Opposition YSR Congress, the academic fraternity and members of the Executive Council of the University. “I studied in the university for eight years. It was not my intention to slight the university, which is like my mother, and I sincerely regret having made the comments,” Mr. Murthi, who is president of the GITAM University, said. He tendered an unconditional apology to the Vice-Chancellor, the professors, the students, the non-teaching staff and the citizens. Mr. Naidu, who praised the role of Mr. Murthi in working for the TDP and developing GITAM University, said a mere slip of the tongue could land anyone in trouble, and the only way out was to immediately apologise.

He vowed to make efforts and turn AU into the top 10 universities in the world.

He congratulated Mr. Murthi o getting a fine regional party office building that he visited in the morning.

nuvvu esina news enti... ee news enti nee desperation 10ngooo brahmam_buildup5.gif?1290348491

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...