TampaChinnodu Posted June 11, 2017 Report Posted June 11, 2017 వికసించిన విద్యాసౌధం! గజ్వేల్ విద్యాలయాల సముదాయం మొదటి దశ పనులు పూర్తి గజ్వేల్ - న్యూస్‌టుడే ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అయిన కేజీ టు పీజీ ఉచిత విద్య పథకం తొలి ఫలం సాకారమవుతోంది. పేద విద్యార్థులకు కార్పొరేట్ తరహాలో ఉచిత విద్య అందిస్తామన్న ఆయన హామీలో తొలి అడుగుకు అంతా సిద్ధమైంది. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో విద్యాలయాల సముదాయం (ఎడ్యుకేషన్ హబ్) మొదటి దశ పనులు పూర్తయ్యాయి. విద్యా సంవత్సరం తొలిరోజు సోమవారం నుంచే ఇక్కడ తరగతులు ప్రారంభం కానున్నాయి. రూ.146.28 కోట్ల వ్యయంతో 60 ఎకరాల విస్తీర్ణంలో (20 ఎకరాల్లో బాలికల విద్యాలయం, 40 ఎకరాల్లో బాలుర విద్యాలయం) ఈ హబ్ రూపుదిద్దుకుంది. పాఠశాలలు, వసతిగృహాలు ఒకే ఆవరణలో ఉండేలా గురుకులం తరహాలో నిర్మించడం విశేషం. ఆరో తరగతి నుంచి పీజీ వరకు ఈ సారికి అందుబాటులోకి తెస్తున్నారు. ఈ విద్యాలయాల్లో చేరేందుకు నలుమూలల నుంచి దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. విశేషాల సమాహారం.. * ఈ హబ్‌లో బాలబాలికలకు వేర్వేరుగా సమీకృత వసతి గృహాలను అధునాతన హంగులతో నిర్మించారు. కళాశాల, ఉన్నత పాఠశాలలు, వసతికి వేర్వేరుగా నాలుగు అంతస్థుల్లో మూడు బ్లాకులు ఏర్పాటుచేశారు. * సమీకృత వసతికి వేర్వేరుగా రెండు బ్లాకులు నిర్మించారు. ఈ రెండు బ్లాకుల్లో మొత్తం 190 గదులున్నాయి. 760 మంది విద్యార్థులు ఉండేలా ఏర్పాట్లు చేశారు. * ఆరు నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు నిర్మించిన రెండు బ్లాకుల్లో మొత్తం 244 గదులున్నాయి. ఇక్కడ 976 మందికి వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. * ఒకేసారి 500 మంది కూర్చొని భోజనం చేసేందుకు భారీ స్థాయిలో డైనింగ్ హాల్ నిర్మించారు. * బాలికల విద్యాలయానికి సమీపంలోనే ఆడిటోరియం నిర్మిస్తున్నారు. బాలికలకు విద్యాబోధన చేసేందుకు సముదాయాలు నిర్మించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ పునాది నుంచి మొదలుకొని విద్యార్థులు చదువు కునేందుకు డెస్కులు, పడుకునే మంచాలను ఏర్పాటుచేసే వరకు అన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల్లోంచి పుట్టినవే కావడం విశేషం. వసతి గదుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే బాగుంటుందని అధికారులు ప్రతిపాదించగా.. సీఎం మాత్రం ఒక్కో గదికి నలుగురినే ఖాయం చేశారని సమాచారం. విద్యార్థులకు ముందుగా బంకర్ (ఒకదానిపై ఒకటి) మంచాలను అధికారులు నిర్ణయించారు. అయితే, పెద్ద పిల్లలు పైకి ఎక్కే సమయంలో తలకు ఫ్యాన్‌లు తగులుతాయి కదా..? పెద్దవారికి బంకర్ మంచాలు వద్దని సీఎం వారించడంతో సాధారణ మంచాలు ఏర్పాటు చేశారంటే ముఖ్యమంత్రి ఎంత శ్రద్ధ తీసుకున్నారో ఇట్టే అర్థమవుతుంది. సొంతిళ్లను తలపించేలా ఉండాలని.. గదుల్లో రకరకాల రంగులు వేయాలని కూడా సీఎం సూచన చేయగా అధికారులు అమలు చేస్తున్నారు. పేదలకు పైసా ఖర్చు లేకుండా ప్రాథమిక విద్య నుంచి పీజీ వరకు చదువుకునేందుకు వీలుగా ఆధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకున్న విద్యాలయాలు దేశంలోనే ఎక్కడా లేవని అధికారులు చెబుతున్నారు. భారీ స్థాయిలో నిర్మించిన ఎడ్యుకేషన్ హబ్ విశ్వవిద్యాలయాన్ని తలపించేలా ఉండటం విశేషం. మిగిలిన కొన్ని పనులు పూర్తి చేసి ఆగస్టులో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ప్రయత్నిస్తున్నామని గజ్వేల్ ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(గడా) ప్రత్యేకాధికారి హనుమంతరావు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. Quote
TampaChinnodu Posted June 11, 2017 Author Report Posted June 11, 2017 How are they going to select students for admissions ? Quote
Kontekurradu Posted June 11, 2017 Report Posted June 11, 2017 29 minutes ago, TampaChinnodu said: How are they going to select students for admissions ? only god knows Quote
r2d2 Posted June 11, 2017 Report Posted June 11, 2017 క్షమించాలి నాకెందుకో 'వికటించిన' అని కనపడింది ! jaundiced eye .. Quote
SANANTONIO Posted June 11, 2017 Report Posted June 11, 2017 గజ్వేల్ ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(గడా) ప్రత్యేకాధికారి హనుమంతరావు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. masth undi peru Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.