BaabuBangaram Posted June 12, 2017 Report Posted June 12, 2017 శంషాబాద్: హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌లో పరమేశ్వర్‌రెడ్డి అనే యువకుడి మృతిలో ఆలస్యంగా అనూహ్య కోణం వెలుగు చూసింది. తొలుత ఆత్మహత్యగా భావించిన పోలీసులు పోస్టుమార్టం నివేదిక రాగానే ఆశ్చర్యపోయారు. తలకు బలమైన గాయాలు తగలడంవల్లే చనిపోయాడంటూ ఫోరెన్సిక్ విభాగం వైద్యనిపుణులు వెల్లడించారు. దీంతో ఆత్మహత్య కేసును హత్య కేసుగా మార్చారు. అనంతరం తీగ లాగితే డొంక కదిలింది. పరువు కోసం కన్నతండ్రి, సోదరులే ఈ హత్యచేశారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. వీరిని విచారించాక పూర్తి వివరాలు తెలుస్తాయని ఆర్.జి.ఐ.ఎ.ఠాణా ఇన్స్పెక్టర్ మహేష్ తెలిపారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం శంషాబాద్‌లోని ఆర్బీనగర్లో రైతు సోమేశ్వర్‌రెడ్డి నివాసముంటున్నాడు. కొడుకు పరమేశ్వర్‌రెడ్డి(21) ఇంటర్మీడియట్ చదివి తండ్రి, సోదరులకు వ్యవసాయ పనుల్లో సాయపడుతున్నాడు. పరమేశ్వర్‌రెడ్డి శంషాబాద్‌లో నివాసముంటున్న ఒక యువతిని ప్రేమించాడని, ఆమెనే పెళ్లిచేసుకుంటానంటూ తండ్రికి చెప్పగా తండ్రితోపాటు సోదరులు కూడా వ్యతిరేకించారు. కుటుంబసభ్యుల మాట వినకుండా పెళ్లికి సిద్ధపడిన పరమేశ్వర్‌రెడ్డి మార్చి 27న అకస్మాత్తుగా మృతి చెందాడు. సోదరులతో గొడవ పడ్డంతో పాటు తనకు ఉద్యోగం లేదన్న మనస్తాపంతో చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. పోలీసులకు ఈ సమాచారం తెలిసి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పరమేశ్వర్‌రెడ్డి మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇటీవల పోస్టుమార్టం నివేదిక పోలీసులకు అందడంతో తొలిసారిగా పరమేశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యులపై అనుమానం వచ్చింది. దీంతో దర్యాప్తు వేగవంతం చేసి, సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు. హత్యకేసు నమోదు చేసిన నేపథ్యంలో నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని ఇన్స్పెక్టర్ మహేష్ తెలిపారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.