The Warrior Posted June 13, 2017 Report Posted June 13, 2017 Dick https://m.imgur.com/bgDtJ1T.gif Quote
DiscoKing Posted June 13, 2017 Author Report Posted June 13, 2017 17 hours ago, The Warrior said: Endi raa mee valla labam langas valle ekuva profits Quote
Annayya_fan Posted June 13, 2017 Report Posted June 13, 2017 ఊపిరి పీల్చుకో రాయలసీమ రైతన్నా ! నీళ్ళొస్తున్నాయి ! అక్టోబర్, 2016 - కర్నూలు జిల్లా అవుకు రిజర్వాయర్‌నుండి కడప జిల్లా గండికోట రిజర్వాయర్కి కృష్ణ నీళ్ళు డిసెంబర్ 2016 - హంద్రీనీవా కాలువ ద్వారా పెనుగొండ నియోజకవర్గం గొల్లపల్లి రిజర్వాయర్కి, రాప్తాడు నియోజకవర్గం చెరువులకి కృష్ణ నీళ్ళు జనవరి 2017 - గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము కింద పైడిపాలెంనుండి పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కి కృష్ణ నీళ్ళు ఫిబ్రవరి 2017 - గండికోటనుండి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి గండికోట- సిబిఆర్ లిఫ్ట్ స్కీం కింద నీళ్ళు ఎత్తిపోత. జూన్ 2017 - హంద్రీనీవా కాలువ ద్వారా పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం చెరువుకి, ధర్మవరం నియోజకవర్గం చెరువుకి కృష్ణ నీళ్ళు. Quote
Annayya_fan Posted June 13, 2017 Report Posted June 13, 2017 ఒరే బట్టెబాజ్ - నీళ్లు రావాలంటే చెయ్యాల్సింది యువత ఉద్యమించడమో, భుజాన గొంగళి వేసుకుని తిన్న మాంసం అరిగేదాకా గంతులెయ్యడమో కాదు. నీళ్లు రావాలంటే బాబు కావాలి. కాల్వలు తవ్వాలి. ప్రాజెక్టులు కట్టాలి. భూమిని బద్దలు కొట్టి నీళ్లకు దారి, వాలు చూపాలి. Quote
Annayya_fan Posted June 14, 2017 Report Posted June 14, 2017 ఇది ఒక పదునాలుగేళ్ళ దుర్భిక్షగీతం. ఎండిపోయిన గొంతుల్లో మూగబోయిన పాట. ఏలిననాటి శని ఏడేళ్ళే ఉంటుందిగానీ ఈ శని అనంతపూరు జిల్లాలో బ్యాక్-టు-బ్యాక్ పధ్నాలుగేళ్ళుగా నడుస్తోంది . పదునాలుగేళ్ళ కిందట కర్ణాటక రాష్ట్రప్రభుత్వం బాగేపల్లికి, గుదిబండకి మధ్యనున్న 88 కోలార్‌జిల్లా గ్రామాలకు (ఇప్పుడు 2007లో ఏర్పడిన చిక్బళ్ళాపూర్జిల్లాలోకి వచ్చాయి) తాగునీటి కోసమని మభ్యపెడ్తూ, మద్రాస్-మైసూరు రాష్ట్రాలమధ్య చిత్రావతి(పెన్నేరుకి ఉపనది) నదీజలాల పంపిణీని నిర్దేశించే 1892/1933 నాటి ఒప్పందాన్ని కాలరాసి, బాగేపల్లి దగ్గర 14 మీటర్ల ఎత్తులో, 250 ఎకరాల రిజర్వాయర్‌తో పరగోడు ప్రాజెక్టు కట్టింది. అప్పటి ఎస్.ఎం.కృష్ణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దారుణమైనదంటే బ్యారేజ్‌కి కనీసం బెడ్-లెవెల్ స్లూయిస్ గేట్లు కూడా పెట్టలేదు. చిత్రావతిలో పారే నీళ్ళు పూర్తిగా వర్షాధారం. పైన కర్ణాటక క్యాచ్మెంట్ ఏరియాలో కురిసే వాననీళ్ళన్నీ పరగోడు బ్యారేజ్కింద ఒడిసిపట్టుకుని, నీళ్ళు పొంగిపొర్లితే మాత్రమే కింద రాయలసీమకి నీళ్ళొస్తాయన్నమాట. కనీసం బెడ్-లెవెల్ స్లూయిస్ గేట్లు అమర్చి ఉంటే తాగునీటినయినా దిగువన రాయలసీమకి విడుదల చేయవచ్చు. కోలారు, చిక్‌బళ్ళాపూర్ జిల్లాల్లో భూగర్భజలాల్లో ఫ్లోరైడ్ ఉన్నమాట వాస్తవమే. పరగోడు దిగువన అనంతపూరుజిల్లాలో కూడా అదే దుర్భిక్షం, అదే ఫ్లోరైడ్ మరి ! పేరుకి తాగునీరు ప్రాజెక్టయినా పరగోడు కింద ఇప్పుడు కనీసం వెయ్యి ఎకరాలు సాగవుతున్నాయని అంచనా. అప్పటినుండీ సీమకి వచ్చే చిత్రావతి ఎండిపోయింది. బుక్కపట్నం, ధర్మవరం చెరువులు ఎండిపోయినయి. పుట్టపర్తి సత్యసాయి తాగునీటి పథకం ఒట్టిపోయింది. బాగేపల్లినుండి పదికిలోమీటర్లు వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపూరు జిల్లా. నందిహిల్స్‌లో పుట్టిన చిత్రావతి పరగోడు బ్యారేజ్ ఓవర్‌ఫ్లో అయితే గియితే బాగేపల్లికి దిగువన, అనంతపూరు జిల్లా గోరంట్ల మీదుగా పుట్టపర్తి పక్కన బుక్కపట్నం చెరువుకి చేరుకుంటుంది. లేదంటే బాగేపల్లికి, పుట్టపర్తికి మధ్య ఉన్న 50 కిలోమీటర్ల క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు పడితే మాత్రమే చిత్రావతిలోకి నీళ్ళొస్తాయి. అంత దారుణమైన పరిస్థితి. బుక్కపట్నం చెరువు నిండితే చిత్రావతి నీళ్ళు వెళ్ళి ధర్మవరం చెరువుని నింపుతాయి. అది కూడా నిండితే ముందుకెళ్ళి కడప జిల్లా పర్నపల్లి దగ్గర చిత్రావతి రిజర్వాయర్ని నింపి గండికోట రిజర్వాయర్కి ముందు చిత్రావతి పెన్నానదిలో కలిసిపోతుంది. ఐదువందల ఏళ్ళ చరిత్ర కలిగిన బుక్కపట్నం చెరువు విజయనగర సామ్రాజ్యపు వారసత్వ స్మృతిచిహ్నం. 8 వేల ఎకరాల ఆయకట్టు ఉండేది. ఇన్నాళ్ళకి మళ్ళీ నిండుతోందంటే ఎంత ఆనందం ! ధర్మవరం, పుట్తపర్తి, తాడిపత్రి, కదిరి నియోజకవర్గాల గ్రామాల దాహార్తిని తీర్చి, సాగుకి నీళ్ళిచ్చే చిత్రావతికి ఎగువ కర్ణాటకనుండి ఎప్పటికీ చుక్కనీళ్ళు కూడా రావు అనేది చేదునిజం. మహానేత దృష్టి పడలేదుగాబట్టి సరిపోయింది. లేకపోతే పరగోడుకి దిగువన ఏ శెట్టిపల్లి దగ్గరో "ప్రియాంకారాహుల్ సాగర్ డ్యాం" ఒకటి కట్టి కుడికాలువతో వెలిగల్లు రిజర్వాయర్కి, ఎడమకాలువతో బుక్కపట్నం చెరువుకీ నీళ్ళు తెప్పిస్తానని ధనయజ్ఞం మొదలెట్టేవాడు :-) చిత్రావతిలో ఒక్క నీటిబొట్టు లేకపోయినా అయ్యోరి అనుచర కాంట్రాక్టర్లు కాలువలు తవ్వేవాళ్ళు, ఒక వెయ్యికోట్ల మొబిలైజేషన్ అడ్వాన్సులు భోంచేసి హైదరాబాదులో భూములరేట్లు పెంచేవాళ్ళు. దార్శనికుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టే నిజంగా ఫలితాన్నిచ్చే పనులు జరుగుతున్నాయి. చిత్రావతి నీటితో నిమిత్తం లేకుండా హంద్రీనీవా కాలువ ద్వారా జీడిపల్లి రిజర్వాయర్‌నుండి కృష్ణ నీళ్ళు సరాసరి బుక్కపట్నం, ధర్మవరం చెరువులకి వస్తున్నాయి. అనంతపూరుని ఎడారిగా మారనివ్వను అని రైతన్నకి ధైర్యం చెప్పి, నీళ్ళిచ్చి తన చిత్తశుద్ధిని, కార్యదక్షతని ఋజువు చేస్తున్న చంద్రబాబుగారికీ, బుక్కపట్నానికి కృష్ణ నీళ్ళు రాకపోతే పుట్టపర్తినుండి మళ్ళీ పోటీ చేయనని శపథం చేసి మరీ నీళ్ళు సాధించుకున్న పల్లె రఘునాథరెడ్డిగారికి Palle Raghunath Reddy , ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణకి కూడా అభినందనలు. ధన యజ్ఞాల పడగలనుండి బయటపడిన ఈ జలయజ్ఞమన్నా అవిఘ్నంగా సీమ రూపు మారుస్తుందని ఆశిస్తూ ..... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.