TampaChinnodu Posted June 17, 2017 Report Posted June 17, 2017 విశాఖ మెట్రోకు పచ్చజెండా మూడు కారిడార్లలో ప్రాజెక్టు నిర్వహణ ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం నాడు - అమరావతి విశాఖపట్నంలో 42.55 కిలో మీటర్ల పొడవునా మూడు కారిడార్లలో నిర్మించే మెట్రో రైలు ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆమోదం తెలిపింది. దీనిపై మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) తదుపరి చర్యలు తీసుకోనుంది. రాష్ట్రవిభజన అనంతరం ఏపీలోని విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా వూపింది. విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణంపై మొదటి నుంచి నెలకొన్న గందరగోళం ప్రభుత్వ ప్రకటనతో ప్రస్తుతం తొలగిపోయింది. తొలుత రెండు కారిడార్లలో మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రతిపాదనలు రూపొందించగా.. పారిశ్రామిక ప్రాంతమైన గాజువాక వరకు విస్తరించాలని స్థానిక ప్రజాప్రతినిధులు పట్టుబట్టడంతో తాజా ప్రతిపాదనల్లో సవరణలు చేశారు. దీంతో కారిడార్ల సంఖ్య మూడుకు పెరిగింది. దీనిపై ప్రభుత్వ తదుపరి ఆమోదం కోసం జీవీఎంసీ కమిషనర్ పంపిన సమగ్ర నివేదికపై సర్కారు అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో మెట్రో రైలు ప్రాజెక్టు కోసం నిధుల లభ్యత మేరకు జీవీఎంసీ పనులు చేపట్టే వీలుంది. మూడు కారిడార్ల ప్రతిపాదనలతో విశాఖలోని ముఖ్యమైన అన్ని ప్రాంతాలకూ మెట్రోరైలు సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. మూడు కారిడార్ల వివరాలు.. * గాజువాక నుంచి జాతీయ రహదారి మీదుగా కొమ్మాది కూడలి (మధురవాడ) వరకు 30.381 కిలో మీటర్ల పొడవునా మొదటి కారిడారును ప్రతిపాదించారు. జాతీయ రహదారిపై ఎన్‌ఏడీ కూడలి, గురుద్వార, మద్దిలపాలెం, హనుమంతువాక ప్రాంతాలను కలుపుతూ ఈ కారిడారును రూపొందించారు. * జాతీయ రహదారిపై ఉన్న గురుద్వార నుంచి పాత పోస్టాఫీసు వరకు 5.255 కిలో మీటర్ల పొడవునా రెండో కారిడారును ప్రతిపాదించారు. ఇది నగర మధ్యలోని డాబాగార్డెన్స్, సూర్యాబాగ్ పోలీస్ బేరక్స్ మీదుగా పూర్ణామార్కెట్ వరకు వెళుతుంది. విశాఖలోని వాణిజ్య ప్రాంతాన్ని కలుపుతూ దీన్ని ప్రతిపాదించారు. * తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు (ఈస్ట్ పాయింట్‌గెస్ట్‌హౌస్) వరకు 6.914 కిలో మీటర్ల పొడవునా మూడో కారిడారును ప్రతిపాదించారు. జాతీయ రహదారినుంచి తాటిచెట్లపాలెం మీదుగా రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్సు, సంపత్ వినాయకుని గుడి, సిరిపురం, ఏయూ ఔట్‌గేట్ మీదుగా చినవాల్తేరు వరకు ఇది వెళుతుంది. పీపీపీ విధానంలో రూ.9,500 కోట్లతో విశాఖ మెట్రో రైలు తాజా పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి ఈనాడు అమరావతి: విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టును రూ.9,500 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యం(పీపీపీ)తో చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంలో ప్రధానంగా విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రస్తావనకు వచ్చింది. మూడు కారిడార్లతో చేపట్టే మెట్రో రైలు పరిధిపై శుక్రవారమే ప్రభుత్వం అనుమతించిన విషయాన్ని అధికారులు ప్రస్తావించారు. పీపీపీ విధానంలో ప్రాజెక్టు ఏర్పాటుకోసం చేపట్టాల్సిన ముందస్థు పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుల్లో తాజా పరిస్థితిని అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టు సంస్థ మేనేజింగ్ డైరక్టర్ రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. పీపీపీ విధాన అమలు కోసం ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్ నారాయణ ఈ సందర్భంగా ప్రస్తావించారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.