TampaChinnodu Posted June 21, 2017 Report Posted June 21, 2017 25 వేల కోట్ల సంపద సృష్టిస్తాం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం దిశగా అడుగులు సంపన్న యాదవులున్న రాష్ట్రంగా తెలంగాణ నియోజకవర్గానికో సంచార పశు వైద్యశాల ‘1962’కు సమాచారమిస్తే మంద దగ్గరకే వైద్యసేవలు తెలంగాణ రైతు ప్రపంచానికే ఆదర్శం కాబోతున్నాడు గొర్రెల అభివృద్ధి పథకం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అర్థంకాని గొర్రెలకేం చెబుతాం... అంటూ విమర్శకులకు చురకలు అన్నదాతలారా... మీకు ఏమైనా సమస్యలుంటే మాతో చెప్పండి. మీకు మంచి రోజులు రాబోతున్నాయి. చాలా ఆశావహంగా ముందుకు పోతున్నాం. ఆత్మహత్యలు మాత్రం చేసుకోవద్దు. కోటి ఎకరాలు పచ్చబడాలి... నాకళ్లతో ఆ తెలంగాణను చూడాలి ఏదో ఇంగ్లీషు మాట్లాడితే అది అభివృద్ధి కాదు. వట్టిగ డైలాగులు కొడితే అభివృద్ధి కాదు. గ్రామాలు బలంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది గొర్రెల అభివృద్ధి పథకం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా 1.50 కోట్ల గొర్రెల్ని పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇలా చేసుకుంటామని కలలోనైనా వూహించామా? రానున్న రోజుల్లో రూ.25 వేల కోట్ల సంపదను మన గొల్లకుర్మలు సృష్టించబోతున్నారు. దేశంలోనే సంపన్నులైన యాదవులున్న రాష్ట్రంగా తెలంగాణ మారబోతోంది ఈనాడు, సిద్దిపేట: తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించారు. ఇందులో భాగంగా వ్యవసాయం, కులవృత్తులను బలోపేతం చేస్తున్నామన్నారు. ‘‘మన రాష్ట్రంలో కోటి గొర్రెలున్నాయంటున్నారు. ఇప్పుడు పంపిణీ చేసే వాటితో కలిపి ఆ సంఖ్య రెండున్నర కోట్లకు చేరుతుంది. ఒక గొర్రె రెండున్నరేళ్లలో మూడు ఈతలు వేస్తుంది. అంటే రాష్ట్రంలో ఏడున్నర కోట్ల గొర్రెలుంటాయి. ఇందులో రెండున్నర కోట్ల గొర్రెలను పక్కనపెట్టినా... మిగతా వాటిని ఒక్కోటి రూ.5 వేల చొప్పున విక్రయించినా రానున్న మూడేళ్లకాలంలో రూ.25 వేల కోట్ల సంపదను సృష్టించొచ్చు. ఇది చాలా మందికి అర్థంకాదు. అర్థంకాని గొర్రెలకేం చెబుతాం’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లా కొండపాకలో మంగళవారం ఆయన డోలు వాయించి గొర్రెల అభివృద్ధి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ముగ్గురు లబ్ధిదారులకు బీమా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా గొల్లకుర్మలు ఆయనకు తలపాగా, గొంగడితో తమ కృతజ్ఞతలు చాటుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ... దేశంలో ఎక్కడా లేని విధంగా తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఆరునూరైనా బంగారు తెలంగాణగా రాష్ట్రాన్ని మారుస్తామని ఆయన పునరుద్ఘాటించారు. ‘ఆరంభించరు నీచమానవులు...’ అనే పద్యంతో ప్రసంగాన్ని ప్రారంభించారు. మంచి పనిచేయడానికి భయపడతారు... ‘‘చాలామంది మంచి పనిని ప్రారంభించరు. చేయడానికి భయపడతారు. 2001లో తెలంగాణ కోసం బయల్దేరినప్పుడు చాలా మంది అపహాస్యం చేశారు. కానీ తెలంగాణ ఎందుకు కోరుకున్నామన్న దానికి కొండపాక నుంచి ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా బలమైన పునాది పడుతోంది. ఈ రోజు బస్సులో వస్తుంటే ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి నాకు చెప్పారు. నిజాం హయాంలో కట్టిన ఘనపూర్ ఆనకట్ట ఒకప్పుడు 40 వేల ఎకరాలకు నీళ్లందించేది కాస్తా 4 వేల ఎకరాలకు పడిపోయింది. గతేడాది మళ్లీ 40 వేల ఎకరాలకు నీళ్లు అందాయి. మంచి పంట పండింది. ఈసారి రెండు పంటలు పండించేందుకు సిద్ధమవుతున్నారు. దీనికోసమే తెలంగాణ కావాలనుకున్నాం. నా చిన్నతనంలో వడ్లు పండగానే గంగిరెద్దులోళ్లు, ఇంకా చాలామంది వరుస కట్టేవాళ్లు. అందరికీ ధైర్యంగా వడ్లు పెట్టేవారు రైతులు. అలాంటి రైతులు పరిస్థితి అధ్వాన్నంగా మారింది. సమైక్య రాష్ట్రంలో భయంకరమైన నష్టం జరిగి అన్నదాతలంతా హైదరాబాద్, ముంబాయి, దుబాయి వలసవెళ్లే పరిస్థితులు దాపురించాయి. దానిని అధిగమించి ఈ రోజున ముందుకు పోతున్నాం. ఆంధ్ర పాలన దరిద్రంగా ఉండేది ఆంధ్రప్రదేశ్‌లో పాలన దరిద్రంగా ఉండేది. దేనికీ లెక్కలేదు. తెలంగాణలో ఎన్ని గొల్లకుర్మల కుటుంబాలు ఉన్నాయని అడిగినా లెక్కలు లేవు. 25-30 లక్షల జనాభా ఉంటుందనుకున్నాం. 4 లక్షల కుటుంబాలకు గొర్రెలు ఇస్తే సరిపోతుందనుకున్నాం. కానీ 7.61 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 7.18 లక్షల యూనిట్లు మంజూరు చేశాం. ఇందుకుగాను 1.50 కోట్ల గొర్రెలను దిగుమతి చేసుకోనున్నాం. శాసనసభలో ఒక కాంగ్రెసాయన ఈ విషయంలో అవమానం చేశాడు. కేసీఆర్ ఏం చేప్పినా అది జరిగి తీరుతుందని ఆ రోజే చెప్పా. శాసనసభ సాక్షిగా దేశంలో అత్యంత ధనవంతులైన యాదవులు తెలంగాణలో ఉన్నారనే మాట వస్తుందని చెప్పా. రాష్ట్రంలో 30 లక్షల వరకు యాదవులున్నారు. రోజూ మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రల నుంచి హైదరాబాద్‌కు 350 లారీల్లో గొర్రెలు వస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి మరో 300 లారీల వస్తున్నాయి. సమైక్య రాష్ట్రంలో దేన్నీ పట్టించుకోలేదు. 30 లక్షల జనాభా ఉన్న చోట నిత్యం 650 లారీల్లో గొర్రెలు దిగుమతి చేసుకోవడానికి సిగ్గుపడాలి కదా! మంద వద్దకే వైద్య సేవలు నియోజకవర్గానికి ఒక సంచార పశు వైద్యశాలను అందుబాటులోకి తేనున్నాం. ఆ మేరకు బడ్జెట్ పెంచాం. ఇందుకోసం 100 బస్సులు జులై నెలలో రాబోతున్నాయి. 104 సర్వీసులాగా పశువుల మంద వద్దకే వైద్యులు వచ్చి సేవలందిస్తారు. గొర్రెలకు ఏదైనా ఇబ్బంది వస్తే ‘1962’కు సమాచారమిస్తే... ఇచ్చిన అరగంట లోపు మీ వద్దకు వాహనం వస్తుంది. ఆత్మహత్యలొద్దు.. రైతులు ఆత్మహత్యలు మాత్రం చేసుకోవద్దు. పండించిన పంటకు మంచిధర దక్కాలి. ఇప్పటి వరకు రైతులు సంఘటితంగా లేరు. అందుకే మోసపోతున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వం పూనుకొని రైతాంగాన్ని సంఘాలుగా ఏర్పాటుచేసేలా ముందుకుపోతున్నాం. రైతులు దరఖాస్తు చేసి, దండాలు పెట్టి, లంచాలు ఇచ్చి పనులు చేయించుకునే పరిస్థితి పోయింది. నేరుగా మీ ఖాతాలోకే డబ్బులు వచ్చే ఏడాది నుంచి వస్తాయి. వీటిని పెట్టుబడుల కోసం ఉపయోగించుకోవాలి. వచ్చే ఏడాది నుంచి రైతు సంఘాల ద్వారానే మంచి ధరకే ధాన్యం కొనుగోళ్లు జరిగేలా చూస్తాం. సంఘాల బలోపేతం కోసం రూ.500 కోట్లతో మూలధనం ఇస్తాం. అవసరమైతే మరో 5 వేల కోట్లు రుణం తీసుకునే వెసులుబాటు కల్పిస్తాం. రైతులు నిజాయతీగా, ఆదర్శంగా ఉండాలి. ప్రస్తుతం సర్వే చేసిన వివరాలన్నింటినీ గ్రామంలో ప్రదర్శిస్తాం. అందులో ఏవైనా తప్పులుంటే మీరే వాటిని తీసేయాలి. ఈ పథకం దుర్వినియోగం కాకుండా రైతాంగమే ఒక కన్నేసి కాపాడుకోవాలి. ఒకవేళ గ్రామంలో ఎవరైనా రైతు భూమి అమ్మితే ఆ వివరాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి గ్రామరైతు సమాఖ్యకు అందేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇలా ప్రపంచానికే తెలంగాణ రైతులు ఆదర్శం కాబోతున్నారు.ఈ యాసంగి నుంచి సాగుకు 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇందులో విజయం సాధిస్తాం. కలెక్టర్లు దృష్టిసారించాలి అటవీ భూముల్లోకి మేకలను అనుమతించరు. గొర్రెలను మేపుకోవచ్చు. అటవీ భూములతో పాటు పండ్లతోటల్లోనూ స్టెలో గ్రాస్ పెంచేలా కలెక్టర్లు దృష్టిసారించాలి. సాగుకు అనువుగా లేని భూముల్లో తుమ్మచెట్లు పెంచాలి. వేసవిలో గొర్రెల కోసం నీటి వసతి కల్పించాలి. మత్స్యకారులు దాదాపు రూ.5 వేల కోట్ల సంపదను సృష్టించబోతున్నారు. నాయీ బ్రాహ్మణులకూ పట్టణాల్లో మాదిరిగా గ్రామాల్లో 25 వేల కుటుంబాలకు నవీన క్షౌరశాలలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. రజకులకు అధునాతన దోబీఘాట్లను నిర్మించి ఇవ్వనున్నాం’’ అని కేసీఆర్ వివరించారు. మంత్రి హరీశ్‌పై ప్రశంసలు కేసీఆర్ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావుపై ప్రశంసలు కురిపించారు. ‘‘ఉత్సాహవంతుడు, యువకుడు, పట్టుదల ఉన్న మంత్రి ఇక్కడే ఉన్నారు. ఆయన నాయకత్వంలో నీటిపారుదల రంగంలో అద్భుతాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులను పూర్తిచేసి అన్ని జిల్లాల్లో కలిపి ఈ సంవత్సరం నుంచే ఉన్న ఆయకట్టుకు అదనంగా మరో 10లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం’ అన్నారు. ఉద్యమం సమయంలో హెలికాప్టర్‌లో తిరుగుతూ తెలంగాణను చూస్తుంటే చాలాసార్లు కన్నీళ్లు వచ్చాయన్నారు. కోటి ఎకరాలకు నీళ్లిచ్చే బాధ్యత నాది అని స్పష్టంచేశారు. తమకు దిల్లీలో బాసులు ఎవరూ లేరని, ప్రజలే తమ బాసులని అన్నారు. మానవ వనరుల్ని గుర్తించడంలో తెలంగాణలో సరికొత్త పోకడలు సాగుతున్నాయని ‘ఇండియాటుడే’ ఎడిటర్ తనతో అన్నారని చెప్పారు. కన్నీరుపోయి పన్నీరొలికే రోజులు: హరీశ్ గాంధీ చెప్పిన గ్రామ స్వరాజాన్ని సాధించాలంటే కులవృత్తులు, వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో సీఎం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పల్లెల్లో ఆర్థిక బలోపేతం అతి ముఖ్యమని గుర్తించి ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను తమ వద్దా ప్రారంభిస్తామని చెప్పి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఇంజినీర్లు ఇక్కడి వచ్చి పనులను పరిశీలించి వెళుతున్నారని ఆయన తెలిపారు. ఉద్యమం సమయంలో ‘పల్లె కన్నీరు పెడుతుందనే’ పాటలు రాసుకున్నాం... కానీ రానున్న రోజుల్లో పల్లె పన్నీరు ఒలికొస్తుందనే పాట రాసుకోవడం త్వరలోనే జరుగుతుందనిపిస్తోందన్నారు. ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, మండలిలో ప్రభుత్వచీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వెంకటేశ్వరరావు, ఎంపీలు కె.కేశవరావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. Quote
TampaChinnodu Posted June 21, 2017 Author Report Posted June 21, 2017 Sincere question. Gorrelu tho what all uses ? Quote
Sreeven Posted June 21, 2017 Report Posted June 21, 2017 16 minutes ago, TampaChinnodu said: Sincere question. Gorrelu tho what all uses ? Eruvulu and meat...i know these two... Quote
icecreamZ Posted June 21, 2017 Report Posted June 21, 2017 sheep sheep antey....edho anukunna....mari inthati paa paa pink sheep anukoledhu Quote
vonkay Posted June 21, 2017 Report Posted June 21, 2017 Lots of rural places in TS state - say mehbubnagar, ii community vallaki goats breeding ae main profession vuntayi.. mostly meat, milk Quote
tables Posted June 21, 2017 Report Posted June 21, 2017 Meat prices tagge chance untadi and if possible we can export to other states too, I am being too optimistic but a possibility Quote
tables Posted June 21, 2017 Report Posted June 21, 2017 2 hours ago, reality said: manodiki kuda okati ichara?? symbolic ga untadi ani pacha gorre ichara? Quote
kingcasanova Posted June 21, 2017 Report Posted June 21, 2017 6 hours ago, TampaChinnodu said: Sincere question. Gorrelu tho what all uses ? ramjan pandaga vasthondi kadaa, full use Quote
tom bhayya Posted June 21, 2017 Report Posted June 21, 2017 Thank you kcr kula vyavastha ki purva vaibhavam theesukosthunnavu, yadav caste certificate vallakey gorrelu isthunnara? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.