ARYA Posted June 23, 2017 Report Posted June 23, 2017 2 minutes ago, boeing747 said: 1 minute ago, boeing747 said: labor gallaki telsina language lo ne seppatam better ani copy sesa baa KATTAPPAs e ga cool.. Quote
boeing747 Posted June 23, 2017 Report Posted June 23, 2017 2 minutes ago, ARYA said: KATTAPPAs e ga cool.. enjoy baa Quote
ARYA Posted June 23, 2017 Report Posted June 23, 2017 5 minutes ago, boeing747 said: enjoy baa y quoting ycp edios man nee kattappa logic ento koddiga seppu Quote
boeing747 Posted June 23, 2017 Report Posted June 23, 2017 Just now, ARYA said: y quoting ycp edios man nee kattappa logic ento koddiga seppu oorike baa stress relief ki Quote
ARYA Posted June 23, 2017 Report Posted June 23, 2017 Just now, boeing747 said: oorike baa stress relief ki kattappa kovers Quote
Tadika Posted June 23, 2017 Author Report Posted June 23, 2017 కామెడీ, యాక్షన్ అంశాలను మేలవించి అగ్రిగోల్డ్ స్కామ్‌పై దర్శకుడు హరీశ్ శంకర్ సంధించిన సినీ అస్త్రమే దువ్వాడ జగన్నాథం.. రొటీన్ కథే అయినా భావోద్వేగాన్ని, హాస్యాన్ని, యాక్షన్, ఎంటర్‌టైన్ సమపాళ్లలో కలగలిపి డీజేను కొత్తగా చూపించడంలో సఫలమయ్యాడనేది టాక్. డీసెంట్ కామెడీని ఎంచుకోవడం ప్రధాన ఆకర్షణ. ప్రేక్షకుడిని ఆహ్లాదపరిచే విధంగా క్లైమాక్స్‌లో కామెడీ ఎంచుకోవడం గమనార్హం.విజయవాడ కేంద్రంగా జరిగిన అగ్రిగోల్డ్ కుంభకోణం లాంటి సీరియస్ సబ్జెక్ట్‌ను ఎంటర్‌టైన్‌మెంట్ పద్ధతిలో చెప్పడానికి దర్శకుడు ప్రయత్నించాడు. బాధితులను కాపాడేందుకు హీరో కంకణం కట్టుకోవడం ఈ కథలో ప్రధాన పాయింట్. తాజాగా ఏపీలో బ్రహ్మణ కమిషన్ చైర్మన్ ఐవీకే కృష్ణారావు ఘటన నేపథ్యం ఈ చిత్రానికి యాప్ట్‌గా మారే అవకాశం ఉంది. విజయవాడ కేంద్రంగా కొందరు నేతలు బ్రహ్మణ సంఘానికి చెందిన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు ఈ కథకు సూట్ అయ్యేలా ఉన్నాయనే వాదన వినిపిస్తున్నది. క్రిమినల్స్‌ను ఏరి వేసే పోలీస్ అధికారి పాత్రలో మురళీ శర్మ మరోసారి తనదైన శైలిలో నటనను ప్రదర్శించాడు. సుబ్బరాజు పాత్ర బాగా ఉంటుంది. అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.ఈ చిత్రంలో జరిగే భూ కుంభకోణానికి అగ్రో డైమండ్ అనే పేరుపెట్టారు. డిఫాల్టర్ల ఆగడాలు, బాధితుల కష్టాలను ఉద్వేగభరితంగా చిత్రీకరించారు. ఏపీ రాజధానిని కేంద్రంగా చేసుకొని సాగిన ఈ భూదందా సహజంగానే ప్రేక్షకుడిని కదలిస్తుంది. ఇప్పటివరకు పత్రికల్లోనే వచ్చిన కథనాలకు ఇది తెరరూపంగా నిలిచింది.హరీశ్ శంకర్ రాసిన డైలాగ్స్ తెరమీద తూటాల పేలాయి. ఓ సీన్లో ‘బెజవాడలో పైన అమ్మవారు.. కింద కమ్మవారు' అంటూ చెప్పే డైలాగ్స్‌కు ప్రేక్షకులకు మంచి స్పందన వచ్చింది. సభ్య సమాజానికి ఏం చెబుతామనుకొంటున్నావ్ లాంటి డైలాగ్స్ ఆకట్టుకొన్నాయి. ఇలాంటి డైలాగ్స్ ఏ సందర్భంలో వచ్చాయి.. ఎందుకు వచ్చాయి అనేది తెరమీద చూసి ఆనందించాల్సిందే. సీరియస్ సన్నివేశాల్లో అల్లు అర్జున్ చేత చెప్పించిన సంభాషణలు ఫ్యాన్స్ పండుగలా మారాయి. బ్రహ్మణ యాసపై స్టైలిష్ స్టార్ దృష్టిపెడితే మరింత బాగుండేదనే టాక్ వినిపిస్తున్నది.సినిమా ప్రారంభంలో వచ్చే ఫైట్, ఇంటర్వెల్ ఫైట్ బాగుంది. అల్లు అర్జున్ ఫోర్స్ తెరమీద బాగా పండింది. కీలక సన్నివేశాల్లో దేవీ శ్రీ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. వెన్నెల కిషోర్ కామెడీ మరోసారి పండింది.పూజా హెగ్డే గ్లామర్ ఈ చిత్రానికి మరో ఆకర్షణ. పూజా హెగ్డే పాత్ర కథను బట్టి పరిమితంగా ఉన్నా.. ప్రేక్షకుడికి ఎలాంటి గ్లామర్ లోటు కనిపించదు. ఈ సినిమా టాలీవుడ్‌లో స్థిరపడేందుకు ఆమెకు దోహదపడుతుంది. Quote
Kontekurradu Posted June 23, 2017 Report Posted June 23, 2017 intaki movie hit aa futt aa? movie, rodd ani @puli raaja decie chesadu neeku super hit anipinchiddile Quote
Tadika Posted June 23, 2017 Author Report Posted June 23, 2017 3 hours ago, Kontekurradu said: intaki movie hit aa futt aa? movie, rodd ani @puli raaja decie chesadu neeku super hit anipinchiddile HIT avvuddhi ba commercial movie like Sarrainodu Quote
Tadika Posted June 23, 2017 Author Report Posted June 23, 2017 బెజవాడకు సమీపంలోని సత్యనారాయణపురం అనే అగ్రహారానికి చెందిన బ్రహ్మణ కుటుంబానికి చెందిన వాడు దువ్వాడ జగన్నాథం (అల్లు అర్జున్) తండ్రికి అన్నపూర్ణ క్యాటరింగ్‌ను నడుపుతుంటాడు. పెళ్లిళ్లకు, శుభకార్యాలకు వంటలు చేస్తుంటారు. తండ్రికి దువ్వాడ సహకరిస్తుంటాడు. కానీ దువ్వాడకు అన్యాయమంటే సహించదు. చిన్నతనం నుంచే అన్యాయాలను, అక్రమాలను, చెడును ఎదురిస్తుంటాడు. ఆవేశం ఎక్కువ. బ్రహ్మణ కుటుంబంలో పుట్టిన వాడికి ఆవేశం ఉండకూడదు అనే నెపంతో దువ్వాడ జగన్నాథానికి మెడలో రుద్రాక్షతో కూడిన మాలను వేస్తాడు. దానిని తన చేతులతో తీయకూడదని ఒట్టు వేయించుకొంటాడు తండ్రి (తనికెళ్ల భరణి). Quote
Tadika Posted June 23, 2017 Author Report Posted June 23, 2017 ఓ పెళ్లి కార్యక్రమంలో పూజా హెగ్డేను కలుస్తాడు. మొదటి చూపులోనే ప్రేమలో పడుతాడు. అయితే పెళ్లిలో ఆటపట్టించడానికే చనువుగా ఉన్నానని, పెళ్లి, ప్రేమ వ్యవహారాలు తనకు తగవని దువ్వాడ జగన్నాథానికి స్పష్టం చేస్తుంది. కానీ కొన్ని పరిస్థితుల్లో జగన్నాథం ప్రేమలో ఉన్న స్వచ్ఛతను తెలుసుకొంటుంది.ఇదిలా ఉండగ ఇలాంటి ఆవేశమున్న జగన్నాథం చిన్నతనంలోనే పోలీస్ అధికారి దృష్టిలో పడుతాడు. డీజే పేరుతో అండర్ కవర్ ఆఫీసర్‌గా పనిచేస్తూ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో మాఫియా, సంఘ విద్రోహశక్తుల పనిపడుతుంటాడు. తనకు బాబాయి (చంద్రమోహన్) లాంటి వ్యక్తి అనుకోకుండా ఆత్మహత్య చేసుకొంటాడు. ఆత్మహత్యకు అగ్రి డైమండ్ అనే సంస్థ కారణమని తెలుస్తుంది. Quote
Tadika Posted June 23, 2017 Author Report Posted June 23, 2017 అగ్రి డైమండ్ ఉన్న వ్యక్తులు ఎవరూ అనే పనిలో పడుతాడు. అగ్రి డైమండ్ వ్యవహారాలను రొయ్యల నాయుడు (రావు రమేశ్) గుట్టు చప్పుడు కాకుండా బినామీల పేరు మీద నడుపుతాడు. 9 వేల కోట్ల అక్రమాలకు తెర తీసిన అగ్రి డైమండ్ వెనుక దుష్ట శక్తుల పనిపట్టడానికి కంకణం కట్టుకొంటాడు. ఈ క్రమంలో దువ్వాడ జగన్నాథం అలియాస్ డీజే ఎదుర్కొన్న సమస్యలేంటి.? రొయ్యల నాయుడు గుట్టు ఎలా రట్టు చేశాడు. అగ్రి డైమండ్ బాధితులను ఎలా ఆదుకొన్నాడు. బాధితులకు ఎలా డబ్బు తిరిగి వచ్చేలా చేశాడు. వంటమనిషి అని గేలి చేసిన జగన్నాథాన్ని ఇష్టపడటానికి కారణం ఏమిటి? ఇలా ప్రశ్నలకు సమాధానమే దువ్వాడ జగన్నాథం సినిమా. Quote
Tadika Posted June 23, 2017 Author Report Posted June 23, 2017 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అగ్రి గోల్డ్ కుంభకోణాన్ని పోలిన నేపథ్యాన్ని అగ్రి డైమండ్ పేరుతో కథను అల్లుకున్నాడు. చాలా సీరియస్ సమస్యకు దర్శకుడు హరీశ్ శంకర్ బ్రహ్మణ నేపథ్యాన్ని జోడించాడు. స్వతహాగా హరీశ్ బ్రహ్మణుడు కావడంతో కథలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా, గ్రౌండ్ వర్క్ బాగా చేయడానికి అవకాశం లేకుండా వెసలుబాటు కలిగింది. అల్లు అర్జున్‌లో ఉండే ఎనర్జీని, సానుకూల అంశాలను దృష్టిలో పెట్టుకొని కథను చెప్పే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంటు ఎక్కువగా మేలవించి, కొంత యాక్షన్ జతచేసి ప్రేక్షకుడిలో ఆసక్తిని రేకెత్తించే ప్రయత్నం చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. పూజా హెగ్డే గ్లామర్, అల్లు అర్జున్ స్టయిల్‌ను మిక్స్ చేసి ఫస్టాఫ్‌ను పరుగు పెట్టించాడు. Quote
Tadika Posted June 23, 2017 Author Report Posted June 23, 2017 ఇక రెండో భాగంలో విలన్‌తో వైరం ప్రధాన అంశంగా మారింది. దీంతో క్లైమాక్స్ ఏంటో ప్రేక్షకుడికి ముందే అర్థమైపోతుంది అయితే కథను ఎలా ముందుకు తీసుకు వెళ్తాడనే ఆసక్తి కరమైన పాయింట్ ప్రేక్షకుడికి ఇంటర్వెల్ కలిగుతుంది. క్లైమాక్స్‌ను చేరుకోవడానికి దర్శకుడు అనుసరించిన పద్ధతి, కమర్షియల్ ఎలిమెంట్లను వాడుకొన్న విధానం రొటీన్‌గా ఉన్నప్పటికీ.. కొత్తగా చూపడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. రొటీన్ భిన్నంగా క్లైమాక్స్‌ను కామెడీతో ముగించడంతో ప్రేక్షకుడు నవ్వుతూ ఓ సంతృప్తితో బయటకు వచ్చే అవకాశాన్ని కల్పించాడు. అయితే ఫైట్స్, భారీ హంగామా లాంటి రెగ్యులర్ క్లైమాక్స్‌ను కోరుకొనే సాధారణ ప్రేక్షకుడికి కొంత ఇబ్బందే ఉంటుంది. జులాయి, రేసుగుర్రం, అదుర్స్ లాంటి ఛాయలు ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తాయి. Quote
Tadika Posted June 23, 2017 Author Report Posted June 23, 2017 దువ్వాడ జగన్నాథం చిత్రం అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజికి కరెక్ట్‌గా సరిపోయే చిత్రం. తన ఫార్మాట్‌లో పాటలు, డాన్సులు, ఫైట్లు, నాలుగు సెంటిమెంటు సీన్లు కలిపి వినోదాత్మకంగా సాగిపోయే కథ, పాత్రలో అల్లు అర్జున్ ఒదిగిపోయాడు. సహజంగానే స్టైలిష్ స్టార్ డాన్సులను ఇరగదీస్తాడు. అలాంటి అల్లు వారసుడికి మంచి పాటలు, పక్కన పూజా హెగ్డే లాంటి గ్లామర్ స్టార్ ఉంటే చెలరేగిపోవడం ఖాయం. ఫైట్స్, సెంటిమెంట్ సన్నివేశాల్లో మంచి అల్లు అర్జున్ మంచి నటనను కనబరిచాడు. చంద్రమోహన్ చనిపోయే సీన్‌లో, వెన్నెల కిషోర్ కుటుంబంలో తలెత్తే సెంటిమెంట్‌తో కూడిన సన్నివేశాలను అద్భుతంగా పండించాడు. టోటల్‌గా దువ్వాడ జగన్నాథం సినిమా అల్లు అర్జున్‌కు టైలర్ మేడ్ చిత్రం. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.