Jump to content

Recommended Posts

Posted

అంచ‌నాల‌న్నీ త‌ల్ల‌కిందుల‌య్యాయి.. రాష్ట్ర రైత‌న్న మ‌రోసారి క‌ర‌వు ర‌క్క‌సి కోర‌ల్లో చిక్కుకుంటున్నాడు.. ఈ ఏడాదైనా నాలుగు వ‌ర్షాలు కురిసి పంట‌లు పండుతాయ‌ని ఆశించిన అన్న‌దాత‌ల‌ను కాన‌రాని చినుకు జాడ ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. గ‌తేడాది కంటే ఈసారి వ‌ర్షాలు మెండుగా కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ వేసిన ముంద‌స్తు అంచ‌నాలు త‌ల‌కిందుల‌య్యాయి.

వ‌ర్షాలు లేని కార‌ణంగా ఇప్ప‌టికే చాలా చోట్ల ఏరువాక‌లు, వ‌రినాట్లు ఆగిపోయాయి. జులై నెల‌లోనైనా వ‌రుణుడి క‌రుణ ఉంటుంద‌నుకుంటే అది కూడా లేద‌ని తాజా నివేదిక ఒక‌టి తేల్చిచెప్పింది. జులై మాసంలో మ‌హా అంటే ఒక వ‌ర్షం కుర‌వ‌చ్చ‌ని, లేక‌పోతే అదికూడా ఉండ‌క‌పోవ‌చ్చ‌ని నిర్ధారించింది. దీంతో రాష్ట్రంలో ఈ ఏడాది కూడా క‌రువు తాండ‌వించ‌నుంద‌ని రైతులు భ‌య‌ప‌డుతున్నారు. ఇది ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో ఆందోళ‌న పెంచుతోంది. 

రాష్ట్రంలో కీల‌క‌మైన కృష్ణా ప‌రివాహ‌క ప్రాంతంలో జులై నెల‌లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం లేద‌ని ఇస్రో, వ‌సార్ ల్యాబ్స్ క‌లిసి చేప‌ట్టిన అధ్య‌య‌నంలో తేలింది. ప‌రిస్థితులు అనుకూలిస్తే ప‌దిహేను రోజుల త‌ర‌వాత ఒక వ‌ర్షం కుర‌వ‌చ్చ‌ని, లేకుంటే అది కూడా ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ ఏడాది కూడా కృష్ణా డెల్టాలో క‌రువు త‌ప్ప‌ద‌నే నివేదిక చంద్ర‌బాబుకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది.

కృష్ణాన‌ది ప‌రివాహ‌క ప్రాంతాలు, ఉప‌న‌దుల క్యాచ్‌మెంట్ ఏరియాల్లో జులై నెల‌లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌మే క‌నిపించ‌డం లేద‌ని, శ్రీ‌శైలం, నాగార్జున సాగ‌ర్‌లోకి చుక్క‌నీరు కూడా అద‌నంగా చేరే ప‌రిస్థితి లేద‌ని నివేదిక నిజాలు క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. రాయ‌ల‌సీమ‌లో కూడా ప‌రిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ ఉండ‌బోద‌ని నివేదిక చెప్తోంది. 

ప‌ట్టిసీమ ద్వారా రాయ‌ల‌సీమ‌కు నీరు అంద‌జేస్తున్నామ‌ని గొప్ప‌లు చెప్పుకున్న బాబుకు ఇప్ప‌టి వ‌ర‌కూ ఆ ప‌ని చేసే అవ‌కాశం వ‌రుణుడు క‌ల్పించ‌లేదు. గోదావ‌రి మిగులు జ‌లాల‌ను ప్ర‌కాశం బ్యారేజీకి త‌ర‌లించి ఆ మేర కృష్ణా నీటిని రాయ‌లసీమ‌కు త‌ర‌లిస్తామ‌న్న‌ది చంద్ర‌బాబు వ‌ల్లెవేస్తున్న పాఠం. కానీ ప‌ట్టిసీమ నుంచి నీటిని ప్ర‌కాశం బ్యారేజీకి తెచ్చారు గానీ ఇంత వ‌ర‌కూ అద‌నంగా చుక్క‌నీరు కూడా కృష్ణాన‌ది నుంచి రాయ‌ల‌సీమ‌కు త‌ర‌లించ‌లేక‌పోయారు.

కారణం కృష్ణాన‌దిలో అస‌లు నీరు ఉంటే క‌దా. ఒకవేళ వ‌ర్షాలు కురిసి న‌దిలో నీరు చేరినా ముందు శ్రీ‌శైలం, నాగార్జున సాగ‌ర్ నిండిన త‌ర‌వాతే మిగులు జ‌లాల‌ను రాయ‌ల‌సీమ‌కు త‌ర‌లించాల‌న్న నిబంధ‌న‌లు ఉండ‌నే ఉన్నాయి. మ‌రి ప‌ట్టిసీమ నిర్మాణం రాయ‌లసీమ‌కు ఎలా ఉప‌యోగ‌క‌ర‌మో మాటల్లో త‌ప్ప చేత‌ల్లో చూపించ‌లేక‌పోయాడు సీఎం.

ఇప్పుడు మ‌ళ్లీ క‌ర‌వు ప‌రిస్థితులు నెల‌కొన్న దృష్ట్యా ప్ర‌త్యామ్నాయాల‌పై బాబు స‌ర్కారు దృష్టి సారించింది. పంట‌లు కాపాండేందుకు నీటిని ఎక్క‌డి నుంచి తీసుకురావ‌చ్చో వెత‌కాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. రెయిన్‌గ‌న్‌లు, క‌దిలే ఎత్తిపోత‌ల కార్య‌క్ర‌మాల‌కు మ‌ళ్లీ శ్రీ‌కారం చుట్ట‌నున్నారు.

అనంత‌పురం జిల్లాలోని 45 మండ‌లాల్లో ఈ ఏడాది క‌రువు ప్ర‌భావం తీవ్రంగా ఉంటుందని ప్ర‌భుత్వం అంచ‌నా వేస్తోంది. అక్క‌డ ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్ల‌పై ప్ర‌ధానంగా దృష్టి కేంద్రీకరించింది. కానీ తోడేందుకు ఎక్క‌డా భూగ‌ర్బ జ‌లాలు కూడా అనంత‌పురం జిల్లాలో క‌నిపించ‌డం లేదు. వ‌రుస‌గా మ‌రో క్షామం త‌ప్ప‌ద‌న్న భ‌యంతో రైత‌న్న‌ల‌కు కంటిమీద‌ కునుకు ప‌ట్ట‌డంలేదు.

Posted
Just now, Idassamed said:

Varshaalu baane kurusthunnayi no

That is what I thought too. India lo vunna vallu seppali ground status ento. 

This is not pake article. Saw similar news in multiple sources. 

Posted
2 minutes ago, TampaChinnodu said:

That is what I thought too. India lo vunna vallu seppali ground status ento. 

This is not pake article. Saw similar news in multiple sources. 

Yeah, waiting to hear from IST batch

Posted

Varshalu padakapothey cbn emi chesthadu ley.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...