Jump to content

Recommended Posts

Posted
మంగళగిరి టు అమెరికా.. 
ఆసుపత్రులకు అన్ని రకాల సాఫ్ట్‌వేర్‌ల తయారీ 
ఆరోగ్య బీమా సేవల్లో చేయి తిరిగిన ‘పైకేర్‌’ 
500 మంది ఉద్యోగులతో ఐటీ సేవలకు శ్రీకారం 
amr-sty2a.jpg

మంగళగిరి పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చేది చేనేత చీరలు.. లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం.. పానకాల స్వామి గుడి.. కానీ అదిప్పుడు ఐటీ హబ్‌కు నిలయంగా కూడా మారనుంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి పక్కనే మంగళగిరి ఉంది. దీంతో రవాణాపరంగా మంచి సౌకర్యాలు ఉండటంతో ఇక్కడ ఐటీ కంపెనీల ప్రారంభానికి నిర్వాహకులు ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైబరాబాద్‌ను ఐటీకి ఎలా నిలయంగా మార్చామో నవ్యాంద్ర రాజధాని ప్రాంతంలో మంగళగిరిని ఐటీకి అలా కేంద్రబిందువు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తహతహలాడుతోంది. అందులో భాగంగానే స్థానికంగా ఐటీ పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే కంపెనీలకు భూమి, విద్యుత్తు తదితరాలు రాయితీ ధరలకు కేటాయిస్తోంది. ఈ కంపెనీల రాకతో యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

- ఈనాడు, గుంటూరు

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో ఇప్పటి దాకా న్యూయార్క్‌, హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన ‘పైకేర్‌’ (ఫిజియోకేర్‌) ఐటీ సంస్థ తొలిసారిగా మంగళగిరిలో తన కార్యకలాపాలను విస్తరించింది. ప్రస్తుతం 500 మంది ఉద్యోగులతో ఈ ఐటీ సంస్థ తన కార్యకలాపాలకు మంగళగిరి నుంచి తాజాగా శ్రీకారం చుట్టింది. ఒకే ప్రాంగణంలో 500 మంది ఉద్యోగులు పనిచేస్తుండటంతో మంగళగిరి ప్రాంతంలో ఐటీ ఉద్యోగుల సందడి నెలకొంది. ఈ సంస్థ కార్యకలాపాలు.. అందించనున్న సేవలు.. స్థానిక యువతకు లభించే ఉద్యోగావకాశాలపై ‘ఈనాడు’ ప్రత్యేక కథనం.

మంగళగిరిలోనే సాఫ్ట్‌వేర్‌ తయారీ.. 
అమెరికాలోని ఆసుపత్రులకు అవసరమైన అన్ని రకాల సేవలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను మంగళగిరి కేంద్రంగా ప్రారంభించిన ‘పైకేర్‌’ ఐటీ సంస్థ తయారుచేస్తుంది. ఒక్క ఆసుపత్రులకే కాదు.. ఆ దేశంలో ఆరోగ్య బీమా కంపెనీల పాలసీ అప్లికేషన్లను ఈ సంస్థ ఇక్కడే డిజైన్‌ చేసి పంపుతుంది. ఇలా దీని సేవలు విశ్వవ్యాప్తమవుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో ఆసుపత్రులకు-ఆరోగ్య బీమా కంపెనీలకు మధ్య పైకేర్‌ సంస్థ సంధానకర్తగా వ్యవహరిస్తుంది. సంధానకర్త అంటే నిత్యం ఆసుపత్రులు, బీమా కంపెనీల ముంగిటకు వెళ్లేది ఉండదు. అంతా ఆన్‌లైన్‌లోనే సేవలు ఉంటాయి. ఆరోగ్య బీమా కలిగిన వ్యక్తి ఎవరైనా వైద్యసేవలు పొందితే అతనికి బీమా సౌకర్యం ఏమేరకు ఉంది? ఆసుపత్రికి ఎంత జమ చేయాలి? నేరుగా బీమా కంపెనీలకే తగు సమాచారంతో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఏ ఒక్కరు కాలు కదపకుండా ప్రతిదీ కంప్యూటర్‌ ద్వారానే సేవలు అందిస్తారు. సందేహాల నివృత్తికి కేవలం ఫోన్‌ మాత్రమే వినియోగిస్తారు. ఆసుపత్రులు, ఆరోగ్య బీమా కంపెనీల సేవలకు సంబంధించిన అన్ని రకాల సాఫ్ట్‌వేర్‌లు, అప్లికేషన్లను ఈ ఐటీ సంస్థ అభివృద్ధి చేస్తుంది. అమెరికాలో నూటికి 90 శాతం మందికి ఆరోగ్య బీమా ఉంటుంది. అదే భారత్‌లో పరిశీలిస్తే కనీసం వందలో పది శాతం మంది లేరు. అందుకే అమెరికా కేంద్రంగా ఈ సంస్థ కార్యకలాపాలను తొలుత ప్రారంభించింది. అయితే ఈ సేవలను అక్కడి ఉండి చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచైనా చేయొచ్చు. స్వరాష్ట్రంలోని వారికి ఉపాధి చూపినట్లు అవుతుందని ఈ సంస్థ తన కార్యకలాపాలను మెల్లగా సొంతగడ్డకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 1100 మంది, న్యూయార్క్‌లో 100 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మంగళగిరిలో 500 మంది పనిచేసేలా అత్యాధునికమైన భవనాన్ని సిద్ధం చేశారు. అక్కడ ఉద్యోగులకు పనిచేసే ప్రదేశంలో మంచి వాతావరణం కల్పించారు. చక్కటి క్యాబిన్లు.. ఎటు చూసినా ఎక్కడిక్కడ సెంట్రలైజ్డు ఏసీ సౌకర్యం కల్పించారు. ఆటవిడుపుగా అర ఎకరం విస్తీర్ణంలో మంచి గార్డెన్‌ను పెంచుతున్నారు. ఉద్యోగులకు రాయితీ ధరలకే భోజనం వంటివి కల్పిస్తున్నారు. ఇక్కడ పనిచేసే ఉద్యోగులు విజయవాడ, గుంటూరు వైపు నుంచి నేరుగా సంస్థ వద్దకు చేరుకునేందుకు ప్రత్యేకంగా ఐటీ మంత్రిత్వ శాఖ ఒక బస్సును నడపటానికి కూడా అంగీకరించింది. ఈమేరకు మంత్రి లోకేష్‌ దీనికి సంబంధించి హామీని ఇవ్వటంతో ఉద్యోగులకు సంతోషం వ్యక్తమైంది.

స్థానికులకే ఉపాధి.. 
ఇక్కడ పనిచేసే 500 మంది ఉద్యోగుల్లో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వారే అత్యధికంగా ఉన్నారు. మిగిలిన జిల్లాల నుంచి కూడా కొందరిని తీసుకున్నారు. ఆరోగ్య రంగానికి సంబంధించిన సేవలు కావటంతో వైద్య విద్య నేపథ్యం, నర్సింగ్‌ విద్య, ఎంకాం, బీకాం పట్టభద్రులు, ఎమ్మెస్సీ, బీఎస్సీ కంప్యూటర్స్‌ చదివిన వారిని తీసుకుంటున్నారు. వీరికి ప్రారంభ జీతం రూ.10 వేలు ఉంటుంది. ఆర్నెల్ల శిక్షణ అనంతరం దానిపై 30 శాతం పెంచి ఇస్తారు. ఆ తర్వాత మరో 30 శాతం పెంచుతారు. ఏటా వారి ప్రతిభను సమీక్షించి జీతాల పెంపుదల వర్తింపజేస్తారు. రాత్రి షిప్టులో అంతా పురుషులే ఉంటారు. పగలు పనిచేసేవారిలో అత్యధికులు అమ్మాయిలే. అమెరికాలో ఉన్నవారితో సంప్రదించాలి కాబట్టి ఆంగ్లంపై పట్టు ఉన్నవారికి ఉద్యోగంలో తొలిప్రాధన్యమిస్తారు. వారానికి ఐదు రోజులే వీరికి పని దినాలు.

సొంతగడ్డపై మమకారంతోనే.. 
గుంటూరు బ్రాడీపేటకు చెందిన పెండ్యాల శ్రీకాంత్‌ తన ప్రాథమిక, కళాశాల విద్యను గుంటూరులోనే పూర్తి చేశారు. గుంటూరు వైద్య కళాశాలలో వైద్యవిద్య పూర్తి చేసిన ఆయన వైద్యునిగా కాకుండా ఐటీ రంగంలో కాలుమోపారు. దశాబ్దం కిందట ఆయన అమెరికాలోని న్యూయార్క్‌ కేంద్రంగా ‘పైకేర్‌’ పేరుతో సంస్థను ప్రారంభించారు. అమెరికాలో ఆసుపత్రుల మెడికల్‌ రికార్డ్సు నిర్వహణ, ప్రజలకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించటం వంటి సేవలను ఇది అందిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ అమెరికాలో అనేక ఆసుపత్రులకు ఆరోగ్య బీమా పాలసీలు సకాలంలో వచ్చేలా చూస్తుంది. ఆయా సేవలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లను కూడా తయారుచేసి విక్రయిస్తోంది. ఆసుపత్రులకు అవసరమైన ఐటీ సేవలు, వారి రికార్డులు, డేటా కంప్యూటరీకరణ పనులు చేస్తుంది. ఐటీ రంగంలో బాగా పురోగతి సాధించిన పైకేర్‌ సంస్థ సొంతగడ్డపై మమకారంతో తన బ్రాంచిని నవ్యాంధ్రప్రదేశ్‌కు విస్తరించి ఇక్కడి నుంచే అమెరికా, హైదరాబాద్‌కు సేవలను అందించాలని నిర్ణయించామని ఆ సంస్థ ఎండీ పెంట్యాల శ్రీకాంత్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆసుపత్రులు, ఆరోగ్య బీమా కంపెనీలు సైతం తమ సేవలకు మెచ్చి ముందుకు వస్తే వారికి కూడా సేవలు అందిస్తామని చెప్పారు.

  • Replies 37
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TampaChinnodu

    10

  • Android_Halwa

    10

  • mahesh1

    5

  • NinduChandurudu

    4

Popular Days

Top Posters In This Topic

Posted

వీరికి ప్రారంభ జీతం రూ.10 వేలు ఉంటుంది. ఆర్నెల్ల శిక్షణ అనంతరం దానిపై 30 శాతం పెంచి ఇస్తారు. ఆ తర్వాత మరో 30 శాతం పెంచుతారు.

bl@st

Posted

Thread header chusi...amaravati to DFW direct flight by turbo Megha airlines bandi start chesinaremo anukunna...

source eenadu kaka...idisey..adi paper ki takuva PPT ki ekuva

Posted
1 minute ago, Android_Halwa said:

Thread header chusi...amaravati to DFW direct flight by turbo Megha airlines bandi start chesinaremo anukunna...

source eenadu kaka...idisey..adi paper ki takuva PPT ki ekuva

Flight lo pilot tappa evaddu undadu

Posted

Already kuppal Kuppal unnai india lo...

Health data US lone unchi  offshoring chestharu... all major EMR companies have branches in India

Posted
2 minutes ago, Android_Halwa said:

Thread header chusi...amaravati to DFW direct flight by turbo Megha airlines bandi start chesinaremo anukunna...

source eenadu kaka...idisey..adi paper ki takuva PPT ki ekuva

10 velu jeetham anta. car driver ki ekkuva vasthadi inka hyderabad lo. malli hyderabad tho comparison.

owner evaro gaani manchiga plan sesadu

Posted
Just now, NinduChandurudu said:

Flight lo pilot tappa evaddu undadu

Flight lo mana chinababu garu vuntaru...IT companies ni attract cheyadaniki vastadu

Posted
Just now, Android_Halwa said:

Flight lo mana chinababu garu vuntaru...IT companies ni attract cheyadaniki vastadu

Lol @3$%

Posted
1 minute ago, Android_Halwa said:

Flight lo mana chinababu garu vuntaru...IT companies ni attract cheyadaniki vastadu

airhostess aa..food mottam vaade tinestadu emo

Posted
Just now, TampaChinnodu said:

10 velu jeetham anta. car driver ki ekkuva vasthadi inka hyderabad lo. malli hyderabad tho comparison.

owner evaro gaani manchiga plan sesadu

Antha ledu bhai, ivanni scams..land istunaru ..tax incentives istunaru...best way to ship money from abroad and convert everything to white...few years tarvata dukan bandh and land tho real estate dandha...ichata anni rakamula bhumulu konabadunu/ammabadunu

Posted
Just now, NinduChandurudu said:

airhostess aa..food mottam vaade tinestadu emo

Direct flight name sake ae...amaravati-hyderabad-Mumbai-Dubai-Istanbul-Paris-London-Madhyalo mid air food refueling over the Atlantic-DFW...inni stops vuntayi..food ki..waist pedda di kada..panic eating,thapa di.

Posted

BPO ani seppi saavochu kada. software thokka tholu ani buildup okati.

Posted
4 minutes ago, TampaChinnodu said:

10 velu jeetham anta. car driver ki ekkuva vasthadi inka hyderabad lo. malli hyderabad tho comparison.

owner evaro gaani manchiga plan sesadu

Hyd lo Uber driver salary ( without own car) = 18K

Posted

Avi mostly data entry data cleansing jobs untai... degree passout ayithe chalu... 

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...