TampaChinnodu Posted July 22, 2017 Report Posted July 22, 2017 రాజధాని గ్రామాలు ఇరుకిరుకు..! సన్నటి దారుల్లోను పలు అంతస్తుల భవనాలు వాహనాల పార్కింగ్‌కూ చోటులేని పరిస్థితి భవిష్యత్తులో మౌలిక వసతుల కల్పనకు తీవ్ర ఇబ్బంది చోద్యం చూస్తున్న సీఆర్డీఏ ఈనాడు - అమరావతి అమరావతికి ప్రత్యేక ఆకర్షణగా నిలవాల్సిన రాజధాని గ్రామాలు మురికివాడల్లా మిగిలిపోతాయా? ప్రపంచస్థాయి నగరంగా నిర్మించాలనుకుంటున్న అమరావతికి అవి దిష్టిచుక్కలవుతాయా? ప్రస్తుతం రాజధాని గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాలను చూస్తుంటే అలాంటి ప్రమాదమే కనిపిస్తోంది. ప్రస్తుతం రాజధానిలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు ఇల్లు కట్టేస్తున్నారు. పాత డాబా ఉంటే పైన మరో రెండు మూడంతస్తులు వేస్తున్నారు. సన్నటి ఇరుకుదారుల్లో కూడా పలు అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో చిన్నాపెద్దా కలిపి 5,6 వేల ఇళ్లను నిర్మించారు. ఇంకా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. భూముల ధరలు పెరిగి ఆర్థిక పరిపుష్టి చేకూరడంతో స్థానికులు మంచి ఇళ్లు కట్టుకోవాలనుకుంటున్నారు. భవిష్యత్తులో అద్దెల ద్వారా నికరాదాయం వస్తుందన్న భావనతో వారున్నారు. నిబంధనలు పాటించకుండా ఇళ్లు కట్టుకుంటూ పోవడం వల్లే భవిష్యత్తులో సమస్యలు తలెత్తుతాయి. ఇరుకు వీధుల్లో భవనాలు కట్టడం వల్ల ఏదైనా జరగరాని సంఘటన జరిగి అంబులెన్సో, అగ్నిమాపక వాహనమో వెళ్లాలన్నా వీలుండదు. ఇంత జరుగుతున్నా రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) చోద్యం చూస్తోంది. రైతులు భవనాలు కట్టేటప్పుడే నచ్చజెప్పి నిబంధనలను పాటించేలా చేయాల్సిన బాధ్యత సీఆర్డీఏపై ఉంది. ఇళ్లు కట్టేశాక అభివృద్ధి, నిబంధనల ఉల్లంఘన పేరుతో వాటిపై చర్యలకు దిగితే రైతులు ఆర్థికంగా నష్టపోతారు. మానసిక వేదనా మిగులుతుంది. మొదటి పని ఇల్లు కట్టడమే...! రాజధాని ప్రకటన వెలువడ్డాక రాజధాని గ్రామాల్లో మెట్ట భూములు ఎకరం రూ.70 లక్షల నుంచి రూ.1.70 కోట్ల వరకు, జరీబు భూములు ఎకరం రూ.2.30 కోట్ల వరకు పలికాయి. రాజధాని రైతుల్లో చాలా మంది ఎకరమో, అరెకరమో విక్రయించి వచ్చిన డబ్బుతో మొదట అప్పులు తీర్చారు. భూములన్నీ రాజధాని నిర్మాణానికివ్వడంతో రైతులకు మరో ఆదాయమార్గం లేదు. ప్రభుత్వం ఇస్తున్న కౌలు పదేళ్లే వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇళ్ల నిర్మాణంపై దృష్టి చూపారు. విలువైన నిర్మాణ సామగ్రిని వాడుతూ ఒక్కో ఇంటికి రూ.50 లక్షల నుంచి రూ.రెండు కోట్లకుపైగా వెచ్చిస్తున్నారు. కొందరు లిఫ్ట్‌లు పెట్టుకుంటున్నారు. వ్యయప్రయాసలకోర్చి కట్టుకున్న భవనాల్లో కొంత భాగాన్ని భవిష్యత్తులో ఏ రహదారుల విస్తరణ కోసమో తొలగించాల్సి వస్తే యజమానుల మానసిక వేదన వర్ణనాతీతం అవుతుంది. నిబంధనలేం చెబుతున్నాయి..! * రాజధాని గ్రామాల్లో జీ+2 వరకే ఇళ్ల నిర్మాణానికి పంచాయతీలకు అధికారం ఉండేది. రాజధాని ప్రకటన తర్వాత సీఆర్డీఏనే అనుమతులిస్తోంది. * బృహత్ ప్రణాళికలో గ్రామాల్ని ఆర్1 జోన్‌గా గుర్తించారు. దీని పరిధిలో జీ+3 వరకు నిర్మాణాలకు అనుమతులివ్వాలని సూచించారు. * 40 అడుగుల వెడల్పున్న రహదారి ఉంటేనే జీ+3 ఇళ్లకు అనుమతిస్తామని సీఆర్డీఏ నిబంధన పెట్టింది. గ్రామాల్లో 40 అడుగుల రహదారులు తక్కువగా ఉంటాయని, ఈ నిబంధన వద్దని రైతులు కోరారు. * ప్రస్తుతం జీ+3 ఇళ్లకే సీఆర్డీఏ అనుమతులిస్తోంది. వారి పెట్టిన ఫ్లోర్‌స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ)తో పాటు సెట్‌బ్యాక్ నిబంధనలను చాలా చోట్ల ఉల్లంఘిస్తున్నారు. * అనుమతులతో నిమిత్తం లేకుండా ఆర్థిక వెసులుబాటును బట్టి అంతస్తులపై అంతస్తులు వేశారు. ప్రభుత్వమే అనధికార నిర్మాణాలను క్రమబద్ధీకరిస్తుందన్న భరోసాతో ఉన్నారు. రాజధానికి భూములిచ్చాం కాబట్టి ప్రభుత్వం తమ జోలికి రాదన్న ధీమా కొందరిలో ఉంది. ఇవీ సమస్యలు * తుళ్లూరులోని ఒక రైతు మూడంతస్తుల ఇల్లు కట్టుకున్నారు. ఆ రైతు కుమారుడు కారు కొన్నారు. ఇల్లు సందులో ఉండటంతో కారును బస్టాండ్‌లో పార్క్ చేస్తున్నారు. కార్లు కొనుక్కున్న వారిలో 90 శాతం మంది పరిస్థితి ఇదే. * పార్కింగ్ స్థలం లేకుండా ఇళ్లు కట్టినందుకు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారు. కొత్తగా కట్టిన ఇళ్లలో ఒక పోర్షన్ అద్దె నెలకు రూ.10-12 వేలు చెబుతున్నారు. కారు పెట్టుకోడానికి చోటు లేకపోవడంతో అద్దెకు దిగేందుకు ఎక్కువ మంది తటపటాయిస్తున్నారు. * జీ-3 భవనంలో అన్ని ఫ్లాట్లలో కలిపి కనీసం 32 మంది ఉంటారు. ఒక్కో వీధిలో ఐదారు ఇలాంటి భవనాలుంటే జనాభా అవసరాలకు తగ్గట్టు మౌలిక వసతులు కల్పించడం దుర్లభమే. ఇళ్లు పోతే ఎంతకష్టం భవిష్యత్తులో రాజధాని గ్రామాల్లో రోడ్లు నిర్మించాలి. తాగునీరు, భూగర్భ మురుగునీటి పారుదల, వర్షపునీటి పారుదల వ్యవస్థల కోసం పైప్లైన్లు, విద్యుత్, టెలికాం లైన్లు వేయాలి. రాజధానిలో వచ్చే ప్రధాన మౌలిక వసతులతో వీటిని అనుసంధానించాలి. దీని కోసం ఇళ్లు తొలగించాల్సి వస్తే ఎంత కష్టం..! ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశాం రాజధాని గ్రామాల్లో ఇళ్ల నిర్మాణానికి సగటున వారానికి పది వరకు అనుమతులిస్తున్నాం. భవిష్యత్తులో రహదారుల విస్తరణ, మౌలిక వసతుల కల్పనకు కొంత స్థలం విడిచిపెట్టాలని ముందే షరతు పెడుతున్నాం. ఇన్నాళ్లూ తగిన సిబ్బంది లేక అనధికార నిర్మాణాలను నియంత్రించలేకపోయాం. ఐదు రోజుల కిందటే ఐదుగురు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఒక డిప్యూటీ డైరెక్టర్, ఒక సీనియర్ ప్రణాళికాధికారితో రాజధాని గ్రామాల కోసమే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశాం. వారు ప్రస్తుతం కడుతున్న వాటిలో అనధికారిక నిర్మాణాలుంటే నిలిపివేస్తారు. ఇకపై నిబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్తులు కట్టడానికి అనుమతించబోం. - రాముడు, డైరెక్టర్, డెవలప్మెంట్ కంట్రోల్ (సీఆర్డీఏ). Quote
tables Posted July 22, 2017 Report Posted July 22, 2017 Uko nuvvu.... manhattan New York kuda alane untadi Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.