kakatiya Posted August 5, 2017 Report Posted August 5, 2017 ప్రాణం తీసిన ఫోన్ సంభాషణం! సెల్ మాట్లాడుతూ వేరే బస్సులోకి ఎక్కిన సైనికోద్యోగి పొరపాటు గ్రహించి కదులుతున్న వాహనం నుంచి దూకే యత్నం వెనక చక్రాల కింద పడి దుర్మరణం ఎలమంచిలి: సెల్‌ఫోన్ సంభాషణ ఓ సైనికోద్యోగి నిండు ప్రాణాలను బలిగొంది. ఫోన్ మాట్లాడుతూనే కదులుతున్న బస్సులోంచి దిగే యత్నంలో ఆయన అదే వాహనం కింద పడి ప్రాణాలు కోల్పోయారు. ఎలమంచిలి పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నం జిల్లా కశింకోట మండలం జమాదులపాలేనికి చెందిన కొండ్ర అప్పారావు (20) రాజస్థాన్‌లో ఆర్మీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అమ్మవారి పండగలో పాల్గొనేందుకు సెలవు పెట్టుకుని గత ఆదివారం స్వగ్రామం వచ్చారు. తిరుగు ప్రయాణానికి రిజర్వేషన్ కోసం, అలాగే ఓ మిత్రుడిని కలిసేందుకు శుక్రవారం ఉదయం ఎలమంచిలి వచ్చారు. పనిపూర్తయ్యాక ఇంటికి వెళ్లేందుకు సాయంత్రం ఎలమంచిలి ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వచ్చారు. ఆ సమయంలో సెల్ఫోన్లో ఎవరితోనో సుదీర్ఘంగా సంభాషిస్తున్నారు. ఇంతలో అనకాపల్లి నుంచి పాయకరావుపేట వెళ్లే బస్సు వచ్చింది. అది వెళ్లిపోతుండగా అప్పారావు బస్సు వెనుక ఉన్న అనకాపల్లి బోర్డును చూసి పరుగెత్తుకుంటూ వెళ్లి అందులోకి ఎక్కారు. ఆ తర్వాత కూడా ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు. కొంతసేపయ్యాక పొరపాటున వేరేమార్గంలో వెళ్లే బస్సు ఎక్కిన విషయం గుర్తించారు. ఫోన్ మాట్లాడుతూనే వేగంగా వెళుతున్న బస్సులో నుంచి కిందికి దూకేశారు. ఈ క్రమంలో అప్పారావు అదుపు తప్పి రోడ్డుమీద పడటం.. ఆయనపై నుంచి బస్సు వెనుక చక్రాలు వెళ్లిపోవడం క్షణాల్లో జరిగిపోయాయి. దాంతో సంఘటన స్థలంలోనే అప్పారావు మృతిచెందారు. మృతదేహాన్ని ఎలమంచిలి శవాగారానికి తరలించారు. సరిగ్గా అదే రీతిలో.. అప్పారావు తల్లిదండ్రులు పార్వతి, నూకరాజు నిరుపేదలు. వీరికి అప్పారావుతోపాటు వివాహమైన కుమార్తె అమ్మాజీ కూడా ఉంది. 18 ఏళ్ల క్రితం నూకరాజు బస్సు దిగుతూ వెనుక చక్రాల కిందపడి మృతిచెందారు. అందివచ్చిన కొడుకు కూడా సరిగ్గా అదే రీతిలో దుర్మరణం పాలవ్వడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. Quote
NinduChandurudu Posted August 5, 2017 Report Posted August 5, 2017 naa frnd ki kuda okadiki legs poyayi ilaane Quote
kakatiya Posted August 6, 2017 Author Report Posted August 6, 2017 21 hours ago, NinduChandurudu said: naa frnd ki kuda okadiki legs poyayi ilaane This guy and his dad both passed away in same way Quote
NinduChandurudu Posted August 6, 2017 Report Posted August 6, 2017 44 minutes ago, kakatiya said: This guy and his dad both passed away in same way oh...past lifes valla avachu...kontha mandi lifes lo chala simillaties untai Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.