prakashdrs007 Posted August 5, 2017 Report Share Posted August 5, 2017 షోకాజ్ నోటీసులపై ఎన్టీఆర్ క్లారిటీ! Quote Link to comment Share on other sites More sharing options...
tsapupdates Posted August 5, 2017 Report Share Posted August 5, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
Tadika Posted August 5, 2017 Report Share Posted August 5, 2017 Junior NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాగ్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నాన్నకు ప్రేమతో సినిమా రెమ్యున్ రేషన్ విషయంలో ఎన్టీఆర్ రూల్స్ కు వ్యతిరేకంగా పన్ను మినహాయింపు పొందినట్లుగా ఆరోపణలు రావడంతో కాగ్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఎన్టీఆర్కు ఇచ్చిన పన్ను మినహాయింపును కాగ్ తప్పు పట్టింది. దీంతో ఎన్టీఆర్ కు నోటీసులు జారీ చేస్తున్నట్టుగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటించిన ఆయే దిల్ హై ముష్కిల్ సినిమా విషయంలో ఈ తరహా మినహాయింపు పొందడంతో ఆయనకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. నాన్నకు ప్రేమతో సినిమాకు గానూ ఎన్టీఆర్ 7.33 కోట్ల రూపాయల పారితోషకాన్ని తీసుకున్నాడట. అందులో కోటీ పది లక్షల రూపాయల పన్ను కట్టాల్సి ఉండగా, ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ కింద ఎన్టీఆర్ పన్ను మినహాయింపును పొందినట్టుగా తెలుస్తోంది. సినిమా షూటింగ్ ఎక్కువగా లండన్ లో జరగడంతో సేవలు ఎగుమతి చేస్తున్నామన్న కారణం చూపి 1.10 కోట్ల ట్యాక్స్ మినహాయింపు పొందినట్లు తెలిసింది. దీంతో వారిద్దరికీ షోకాజ్ కం డిమాండ్ నోటీసులు ఇవ్వటంతో పాటు మిగిలిన అంశాలను కూడా పరిశీలించమని కాగ్ అధికారులను కోరింది. మరోవైపు ఈ నోటీసుల వ్యవహారంపై జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించాడు. ఆ ట్యాక్స్ మినహాయింపు పొందడంపై వివరణ ఇచ్చాడు. 2015లో లండన్ లో నిర్మించిన నాన్నకు ప్రేమతో చిత్రానికి భారత్ లో పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని తన లీగల్ అడ్వైజర్స్ చెప్పారని ఎన్టీఆర్ అన్నాడు. అందువల్లే తాను నిర్మాతల నుంచి కూడా సర్వీస్ ట్యాక్స్ వసూలు చేయలేదని తెలిపాడు. ఈ ట్యాక్స్ మినహాయింపుపై 2016లో కాగ్ విచారణ జరిపిందని చెప్పాడు. ఆ మినహాయింపు ఏ విధంగా పొందామో అన్న విషయాన్ని లిఖితపూర్వకంగా తన ఆడిటర్లు….కాగ్ కు తెలియజేశారన్నాడు. 2016 తర్వాత ఈ విషయానికి సంబంధించి అధికారుల నుంచి ఎటువంటి నోటీసులు తనకు అందలేదని స్పష్టం చేశాడు. చాలా సంవత్సరాలుగా పన్నులు, సర్వీస్ ట్యాక్సులు ప్రతి ఏటా తప్పనిసరిగా తాను చెల్లిస్తున్నానని ఎన్టీఆర్ వివరణ ఇచ్చాడు. బాధ్యతగల భారత పౌరుడిగా చట్టపరమైన బాధ్యతలను, పన్ను చెల్లింపులను ఎప్పుడూ విస్మరించలేదని ఎన్టీఆర్ చెప్పాడు. ఆ పన్ను మినహాయింపు విషయంలో సంబంధిత అధికారుల నుంచి తనకు నోటీసులు ఇంకా అందలేదని తెలిపాడు. నోటీసులు వస్తే అధికారులు తెలిపిన దాని ప్రకారం అణాపైసలతో సహా పన్ను చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. భారతీయ చట్టాలకు తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని, పన్ను చెల్లింపుల విషయంలో కూడా రూల్స్ కు లోబడి ఉంటానని ఎన్టీఆర్ స్పష్టం చేశాడు. ఈ పన్ను మినహాయింపుల వ్యవహారంలో గతంలో ఏం జరిగిందో తెలియచెప్పాలనే ఉద్దేశంతోనే తాను ఈ వివరణ ఇస్తున్నానని తెలిపాడు. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.