MaximBady Posted August 7, 2017 Report Posted August 7, 2017 దుబాయ్‌లో తెలుగువ్యక్తికి భారీ లాటరీ బహుమతి రూ.8 కోట్ల పైచిలుకే దుబాయ్: ఉపాధి నిమిత్తం ఇక్కడకు వచ్చి... రకరకాల కారణాలతో అప్పుల్లో కూరుకుపోయి అవస్థపడుతున్న భారతీయుడు కృష్ణంరాజు తోకచిచు ఇటీవల వచ్చిన ఒక ఫోన్‌కాల్‌తో ఉబ్బితబ్బిబ్బై పోయారు. ఒకటీ...రెండూ కాదు...ఏకంగా రూ.8 కోట్ల పైచిలుకు మొత్తాన్ని లాటరీలో గెలుచుకున్నారంటూ నిర్వాహకులు ఫోన్‌చేసి చెప్పడంతో తెలుగువాడైన కృష్ణంరాజుకు నోటమాట రాలేదు. వెంటనే భారత్‌లో ఉన్న తన తల్లికి ఫోన్‌చేసి శుభవార్త వినిపించేశారు. ఆనందాన్ని అమ్మతో పంచుకున్నారు. దుబాయ్‌లో నిర్వహించే ‘బిగ్ 5 టికెట్ డే’’ లాటరీ తాజా డ్రాలో కృష్ణం రాజు విజేతగా నిలిచారు. ఎప్పుడో 2008లో యుఏఈకి వచ్చిన కృష్ణంరాజు భవన నిర్మాణ రంగంలో ఏదో చిరు ఉద్యోగం చేసుకుంటున్నారు. అంతంతమాత్రం సంపాదన కావడంతో అప్పులయ్యాయి. రుణదాతల ఒత్తిళ్లూ అధికమైనాయి. అయినా సరే, అతడు లాటరీ టిక్కెట్లను కొనడం మానలేదు. నెలనెలా కొంతమొత్తం దాచి ఓ లాటరీ టిక్కెట్ కొనేవాడు. మూడేళ్లుగా ఇతర స్నేహితులతో కలిసి కొంతకొంత డబ్బు వాటాల కింద వేసుకుని లాటరీ టిక్కెట్లు కొంటూనే ఉన్నట్లు చెప్పారు. అయితే, ఈ సారి మాత్రం ఎందుకో తాను ఒక్కడినే టిక్కెట్ కొనుక్కున్నాననీ....దానికే బహుమతి రావడం అసలు నమ్మశక్యం కాకుండా ఉందనీ కృష్ణంరాజు చెప్పారు. లాటరీ మొత్తంలో కొంతభాగాన్ని తన నాలుగేళ్ల కుమారుడి చదువుకు కేటాయించి...మిగతా మొత్తంలో అప్పులవీ తీర్చేసుకుంటానని చెప్పారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.