Jump to content

TDP - PPT - EastGodzilla ki Parisramika siri..Upadi pempu pai zilla yentrangam guri...


Recommended Posts

Posted

Image may contain: 1 person, smiling, text

 

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీ స్థాయిలో నిర్వహిస్తున్న పారిశ్రామిక సదస్సుల ఫలాలు తూర్పు గోదావరి జిల్లాలో అపారమైన ఉపాధి అవకాశాలను అందించనున్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విశాఖపట్నంలో జరిగిన సదస్సులో తూర్పు గోదావరి జిల్లాలో రూ.815 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టేందుకు 23 సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించే నాటికి 12,228 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరిగిన 23 పారిశ్రామిక ఒప్పందాలకు సంబంధించి ఇప్పటికే మూడు ఉత్పత్తి ప్రారంభించాయి. మరో మూడు నెలల్లో ఒక సంస్థ తన ఉత్పతిని బయటకు పంపనుంది. మరో 12 సంస్థల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. మార్చి నాటికి ఇవన్నీ తమ ఉత్పత్తులు మార్కెట్‌కు పంపించే విధంగా చర్యలు తీసుకుంటోంది జిల్లా యంత్రాంగం. అనుమతుల విషయంలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రతి సంస్థకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించారు. 

జగ్గంపేట మండలంలో రూ.200 కోట్లతో మెగాఫుడ్‌ పార్కు ఏర్పాటుకు ఓ సంస్థ ముందుకొచ్చింది. ఇది పూర్తయితే దాదాపు 2000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 

వివిధ ఆహార ఉత్పత్తులు, పండ్ల, రొయ్యల నిర్వహణకు సంబంధించి తొండంగి, తాళ్లరేవు, జగ్గంపేట, సామర్లకోట మండలాల పరిధిలో ఆరు పరిశ్రమలు రూ.129.5 కోట్లు పెట్టుబడులుగా పెడుతున్నాయి. ఇప్పటికే యంత్రాలను అమర్చుకున్న ఈ పరిశ్రమలు మూడు, నాలుగు నెలల్లో ఉత్పత్తిని ప్రారంభించనున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయితే వీటి ద్వారా 1,490 మందికి ఉపాధి లభించనుంది. 

పండ్లు, జీడిపిక్కలు, పాలు, బేకరీ, రొయ్యల ఉత్పత్తి, ప్రాసెసింగ్‌కు సంబంధించి గొల్లప్రోలు మండలంలో నాలుగు, గండేపల్లిలో ఒకటి, అయినవిల్లిలో ఒక పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ఆరు సంస్థలు రూ.87.25 కోట్లు మేర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. వీటికి సంబంధించి గొల్లప్రోలులో మూడు చోట్ల నిర్మాణాలు పూర్తవగా రొయ్యల పరిశ్రమకు సంబంధించి అయినవిల్లిలో 50 శాతం మేర నిర్మాణాలు చేపట్టారు. ఇతర చోట్ల వివిధ దశల్లో ఉన్నాయి. ఈ పరిశ్రమలన్నిటినీ ఒక కొలిక్కి తెచ్చి ఉత్పత్తి ప్రారంభించేలా చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. తద్వారా తూర్పుగోదావరి జిల్లాలో వేలకొద్దీ ఉద్యోగాలు కల్పించనుంది.

 

Posted

100s of templates for all your Powerpoint presentation needs!

Handmade by a TDP community of designers to ensure quality and a professional finish for all your future projects.

Note: Please Contact your nearest TDP office

Caution: TDP is not responsible for any PPT presentation projects.

Posted
Just now, LordOfMud said:

100s of templates for all your Powerpoint presentation needs!

Handmade by a TDP community of designers to ensure quality and a professional finish for all your future projects.

Note: Please Contact your nearest TDP office

@~`

Posted
21 minutes ago, psykoNTR said:

bro looks like you logged in with ur original ID log back in with fake id :) 

Annayya_fan

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...