Jump to content

Did Dalits get their Independence just as the rest ???


Recommended Posts

Posted

ఎందయ్యా ...నీ స్వాతంత్రం
ఎక్కడిదయ్యా.... మాకు స్వతంత్రం◀

దళితుల తిండి మీద ఆంక్షలు
ప్రశ్నిస్తే శిక్షలు
అసహనం పడితే హత్యలు
బాబాసాహెబ్ ని మాయం చేసే కుట్రలు
రిజర్వేషన్ల మీద కుయుక్తులు
దళితాబివృధ్దికి రిక్తహస్తాలు
హస్టల్ల మూసివేతలు
థళిత ఉథ్యోగుల మీద వేదింపులు

ఎందయ్యా ....నీ స్వాతంత్రం
ఎక్కడిదయ్యా ...మాకు స్వతంత్రం

70 సం"ల స్వేచ్చావాయువులు
పీల్చుకుంటునామని విర్రవీగే
దేశ భత్తుల్లారా...,

ముండమోపి ,బోడి గుండు 
యోగి ఇలకాలో అదే వాయువు లేక 
73 మంది పసోళ్ళు చచ్చిపోతే
సిగ్గుపడని ఈ రాజ్యంలో..,

ఎందయ్యా .....నీ స్వాతంత్రం
ఎక్కడిదయ్యా .....మాకు స్వతంత్రం

వెలమోళ్ళ అమ్మాయిని ప్రేమించాడని
మా మాదిగ మథుకర్ ని
మంథనిలో క్రూరంగా చంపేస్తే,

అగ్రకుల అహంకారాన్ని ఎది‌రించినందుకు
వయస్సుతో పనిలేకుండా
కనబడినోడిమీదెల్లా ఆగిరపల్లిలో
రౌడిషీటర్ల ముద్రవేసి హింసిస్తుంటే,

దళిత ఆత్మగౌరవ విగ్రహన్ని
చెరవుగట్టు మీద కూడా
గరగపర్రులో పెట్టుకోనివ్వకపోతుంటే,

ఎందయ్యా .....నీ స్వాతంత్రం
ఎక్కడిదయ్యా .....మాకు స్వతంత్రం

మా దళితుల గోడు వినేదెవ్వడు
మాకు న్యాయం చేసేదెవ్వడు?
మీరంతా ఆగష్టు15 అంటూంటే
నాకేంటో గానీ
ఆగష్టు6,జూలై 17 గుర్తొస్తుంది..,

మమ్మల్ని ముక్కలుగా నరికి
గోనేసంచుల్లో కుక్కి తూటాకులో దాచిన 
తుంగబద్ర ఎండిపోతున్నా
చుండూరు దోషులు ఈ దేశ చట్టాలకు 
కనిపించటంలేదు
కారంచేడు చెరువు పూడిపోతున్నా
భూస్వాముల గుండెలదరటంలేదు
ఎందయ్యా ...నీ స్వాతంత్రం
ఎక్కడిదయ్యా.... మాకు స్వతంత్రం

పోద్దున లేచిన దగ్గర నుండి
మాల-మాదిగోళ్ళ రిజర్వేషన్ల మీద
ఏడుపు ముఖాలతో మాట్లాడుకనే 
ఈ స్వేచ్చా దేశంలో
ఎందయ్యా ...నీ స్వాతంత్రం
ఎక్కడిదయ్యా.... మాకు స్వతంత్రం

సరేలే గానీ
ఓ స్వతంత్ర దేశబత్తుడా
వీటికి సమాదానాలు చెప్పు...

నూలు పోగులేకుండా నగ్గ్నంగా 
నడిబజారులో నిలబడి 
అవమానాలు పొందుతున్న
ఒక అగ్రకుల అమ్మాయిని చూపించు..

దళితులచేతల్లో
దెబ్బలూ తిని చచ్చిన 
ఒక్క అగ్రకులపోడిని చూపించు..

బాబాసాహెబ్ దయవల్ల మాకు దక్కిన
రిజర్వేషన్ల మీద పడిఏడ్వని 
ఒక్క నాకొడుకుని చూపించు..

మాల-మాదిగోళ్ళకు మాత్రమే
అద్దెకివ్వబడుననే
ఒక్క కొంపను చూపించు..

ఎంత ప్రతిభ,కష్టించేతత్వం ఉన్నా
Sc/St లు అనగానే వీళ్ళింతే అని
అదోరకంగా మాట్లాడని
ఒక్క వెదవనైనా చూపించు..

నా జాతి గుండె గాయాల 
నెత్తుటి మరకలతో
భరతమాత కట్టుకున్న మువ్వన్నెల కోక
తడిసిపొయిందని మర్చిపోతే
ఎట్టాగా..

ఎందయ్యా ...నీ స్వాతంత్రం
ఎక్కడిదయ్యా.... మాకు స్వతంత్రం

( బాబాసాహెబ్ కలలుకన్న స్వతంత్రమే ఈ దేశంలో దళితులకు రక్ష అని నమ్ముతూ.

Posted

Evadikayethe self respect leedo....victimhood mentality be addam petukune benefits kosam choostaaro....Caste vundakoodadu ane antoone,ee edava pani chesina mem adhe kabatti mamalini tokestunaaru ane nithyam edeche kukkalu evarayethe vunaaro....valle -------- (please fill in the blanks)

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...