ARYA Posted August 16, 2017 Report Posted August 16, 2017 Good Morning Yellow Army ఎన్టీఆర్ స్వీయ నిర్మాణంలో ఏడు చారిత్రాత్మక కథా చిత్రాలు వచ్చాయి. వాటిల్లో ఒకటి శ్రీనాధ కవిసార్వభౌమ. శ్రీమతి మూవీ కంబైన్స్ పతాకంపై నందమూరి రామకృష్ణ నిర్మాతగా, నందమూరి మోహనకృష్ణ ఛాయాగ్రహణంలో నోరి నరసింహ శాస్త్రిగారి రచనల ఆధారంగా తెరకెక్కింది శ్రీనాధ చరితం. శ్రీనాధ కవిసార్వభౌమ చిత్రానికి స్క్రీన్ - ప్లే, దర్శకత్వ బాద్యతలను బాపు - రమణల ద్వయానికి అప్పచెప్పారు ఎన్టీఆర్. వారికి ఈ విషయం చెప్పగానే 'ఇది వ్యాపారపరంగా నష్టపరుస్తుంద'ని చెప్పేశారంట. దానికి ఎన్టీఆర్ నవ్వి 'ఆ విషయం నాకు ముందే తెలుసు. కానీ అన్నిటినీ డబ్బుతో చూడకూడదు కదా. అంతటి మహాకవి జీవిత చరిత్రను కొద్దిమందికైనా పరిచయం చేద్దాం. మీరు మీ శైలిలో కళాఖండంగా తీర్చిదిద్దండి. మన చేయాల్సింది చేద్దాం.' అన్నారట. వారు అనుకున్నట్టుగా ఈ చిత్రం వ్యాపారపరంగా విజయం సాధించనప్పటికీ, ఎన్టీఆర్ చిత్రాలలో ఒక ఆణిముత్యంలా మిగిలిపోయింది. కవి సార్వభౌమునిగా నట సార్వభౌముని నటన అద్వితీయం. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.