ARYA Posted August 16, 2017 Report Posted August 16, 2017 తూర్పుగోదావరి జిల్లాలో మెట్ట ప్రాంత రైతుల నాలుగు దశాబ్దాల కల... గోదావరి నదిని ఏలేరుతో అనుసంధానించే పురుషోత్తపట్నం ఎత్తిపోతల తొలిదశ సాకారమైంది. గోదావరికి కుడి వైపున పట్టిసీమ ఎత్తిపోతల నిర్మించి ఆ నీటిని కృష్ణా నదికి చేర్చి కృష్ణా డెల్టా ఆయకట్టుకు సాకారం చేసినట్లే ఎడమ వైపున పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ప్రస్తుతానికి రెండు పంపుల ద్వారా 700 క్యూసెక్కుల నీటిని పోలవరం ఎడమ కాలువ ద్వారా ఏలేరు ఆయకట్టుకు ఎత్తిపోయనున్నారు. మిగిలిన పంపులను కూడా యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు. రెండో దశ కింద చేపట్టిన ఎత్తిపోతల పనులు కూడా పూర్తికావచ్చాయి. క్రమేణా సెప్టెంబరు నాటికి ఈ రెండు దశల ద్వారా నీరు ఏలేరుకు పరవళ్లు తొక్కనుంది. ఈ పథకంలో పోలవరం ఎడమ కాలువ 58 కిలోమీటరు వరకు ఉన్న ఆయకట్టుతో పాటు ఏలేరు కుడి కాలువ ఆయకట్టు, పిఠాపురం బ్రాంచి కాలువ చివరి ఆయకట్టుకు ప్రయోజనం కలుగుతుంది. దాదాపు 2.15 లక్షల ఎకరాలకు ఈపథకంవల్ల లబ్ధిచేకూరుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఏటా ఆగష్టు 15న ఒక ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు. పురుషోత్తపట్నం వల్ల ఏలేరు రిజర్వాయర్‌కు 24 టీఎంసీల నీటి నిల్వ చేరడంతో పాటు మెట్ట, విశాఖ జిల్లాలోని సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు నీరు పుష్కలంగా అందుతుందన్నారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం వల్ల నేరుగా ఆరు జిల్లాలు, పరక్షంగా 11 జిల్లాలకు నీళ్లందుతాయని, రాష్ట్రంలో 28 ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేస్తామని అన్నారు. Quote
ARYA Posted August 16, 2017 Author Report Posted August 16, 2017 1 minute ago, alpachinao said: Visionary leader Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.