Ara_Tenkai Posted August 18, 2017 Report Posted August 18, 2017 రక్తపు మడుగులోనే 12 గంటలు.. దిల్లీ: రక్తపు మడుగులో ఓ వ్యక్తి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే.. చూసి చూడనట్టు ఉండిపోయారే తప్ప అతడిని కాపాడదామని ప్రయత్నించలేదు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆయన దాదాపు 12 గంటల పాటు అలాగే రోడ్డు పక్కన పడి ఉన్నాడు. అటువైపుగా వెళ్లే కొందరు క్షతగాత్రుడి దగ్గర ఉన్న బ్యాగు, సెల్‌ఫోన్ చోరీ చేశారు. అంతటితో ఆగకుండా మరొకరు అయితే.. అతడి జేబులో ఉన్న రూ.12 కూడా దొంగిలించారు. దేశరాజధాని దిల్లీలో జరిగిన ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 35ఏళ్ల నరేంద్రకుమార్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి కుమార్ రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వస్తున్న కారు ఢీ కొట్టింది. దాంతో కుమార్ ఫుట్‌పాత్ మీద గాయాలతో రక్తం కారుతూ పడిపోయాడు. చేతులు, కాళ్లకు తీవ్రంగా గాయాలు కావడంతో కదల్లేని స్థితిలో ఉండిపోయాడు. అటువైపుగా వెళ్తున్న పాదచారులు కుమార్‌ను చూసి కూడా చూడనట్టు సహాయం చేయకుండా వెళ్లిపోయారు. నిస్సహాయ స్థితిలో ఉన్న కుమార్ అలా దాదాపు పన్నెండు గంటల పాటు రోడ్డు పక్కనే పడి ఉన్నాడు. రాత్రివేళలో అతడి దగ్గర ఉన్న బ్యాగు, మొబైల్ ఫోన్, జేబులో ఉన్న రూ.12లను దోచుకున్నారు. చివరికి బుధవారం ఉదయం పోలీసులకు సమాచారం అందడంతో.. వాళ్లు వచ్చి కుమార్‌ను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.