SonyKongara Posted August 30, 2017 Report Posted August 30, 2017 మేము సైతం... అజరామర అమరావతి నిర్మాణానికి పదుల సంఖ్యలో దేశాలు అవకాశాలు అందిపుచ్చుకునేందుకు పోటీ పెట్టుబడులు, సాంకేతిక సహకారానికి ఆసక్తి కార్యాచరణ ప్రారంభించిన పలు సంస్థలు పౌరాణిక, చారిత్రక ప్రాధాన్యం ఉన్న ‘అమరావతి’ పేరు పెట్టుకుని.. ఆ కీర్తిని మరో వెయ్యేళ్లు అజరామరంగా నిలిపే స్థాయిలో భవ్యమైన ఆధునిక రాజధాని నిర్మాణానికి సిద్ధమవుతున్న వేళ.. సహకారం అందించడానికి మేము సైతం అంటూ పదులకొద్దీ ప్రముఖ దేశాలు పోటీ పడుతున్నాయి. రాజు ముందు తమ పాండిత్యాన్ని ప్రదర్శించడానికి పోటీపడే కవుల్లా.. దేవతల రాజు దేవేంద్రుడి రాజధాని ‘అమరావతి’ పేరు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో, నిర్వహణలో తమ ప్రతిభను చూపడానికి అంతర్జాతీయ సంస్థలు పోటీ పడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు గుంటూరు జిల్లాలో చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఒక వూరైన ‘అమరావతి’ నేడు యావత్ ప్రపంచం దృష్టిని ఆకరిస్తోంది. నిర్మాణ, మౌలిక వసతులు, ప్రణాళికల రంగాల్లో అగ్రగామి అంతర్జాతీయ సంస్థల్ని నేడు రా రామ్మని వూరిస్తోంది. 217 చ.కి.మీ. పరిధిలో నిర్మిస్తున్న ఈ నూతన నగరంలో ఏదో ఒక రూపంలో పాలు పంచుకునేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు, సాంకేతిక, ఆర్థిక సహకారం అందించేందుకు సింగపూర్, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, చైనా ఇలా పలు దేశాలు, అక్కడి సంస్థలు ప్రణాళికలతో ముందుకు వస్తున్నాయి. ఈ దేశాల బృందాలు ఇప్పటికే అమరావతిలో పర్యటించాయి. కొన్ని దేశాలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలూ చేసుకున్నాయి. స్క్రిప్ట్ పక్కాగా సిద్ధమైతే సగం సినిమా పూర్తయినట్టే అని సినీ పండితులు చెబుతారు. నిర్మాణానికి కూడా అంతే. ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణంలో పలు అంశాలపై అనేక దేశాలు అందిస్తున్న వివిధ ప్రణాళికలపై ప్రత్యేక కథనం.. సింగపూర్ గురించి చెప్పేదేముంది.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తర్వాత అమరావతి ప్రాజెక్టులో ఎక్కువ పాత్ర పోషిస్తోంది సింగపూరే. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలోనే సింగపూర్ లాంటి నగరాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఆ దేశానికి కీలక బాధ్యతలు అప్పగించారు. అమరావతి నగరం, కేంద్ర రాజధాని ప్రాంతం, మొత్తం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ)కు వ్యూహ ప్రణాళికను సింగపూర్ సంస్థలే రూపొందించాయి. * అమరావతిలో 1691 ఎకరాల్లో అంకుర ప్రాంత అభివృద్ధికి ప్రధాన అభివృద్ధిదారుగా సింగపూర్‌కి చెందిన అసెండాస్-సింగ్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్ సంస్థల కూటమి ఎంపికమైంది. * ఆంధ్రప్రదేశ్, అమరావతి అభివృద్ధికి సింగపూర్ సహకారానికి సంబంధించి రెండు ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దీని అమలు పర్యవేక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సారథ్యంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైంది. * సీఆర్‌డీఏ ప్రాంతంలో పరిశ్రమల అభివృద్ధికి ‘క్యాపిటల్ రీజియన్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రమోషన్ ఏజెన్సీ’ ఏర్పాటుకు సింగపూర్ ముందుకు వచ్చింది. * తమ దేశానికి చెందిన ‘సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్’ సంస్థ ద్వారా అమరావతిలో భూ నిర్వహణ, నగర నిర్వహణ ప్రణాళికల రూపకల్పనలో సింగపూర్ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోంది Quote
SonyKongara Posted August 30, 2017 Author Report Posted August 30, 2017 జపాన్ రవాణా ప్రణాళిక అమరావతిపై మొదటి నుంచి ఆసక్తి కనబరుస్తున్న దేశాల్లో జపాన్ ఒకటి. మొత్తం సీఆర్‌డీఏ ప్రాంతానికి సమగ్ర ట్రాఫిక్, రవాణా అధ్యయనాన్ని జపాన్ చేపట్టింది. రెండేళ్లలో ఇది పూర్తవుతుంది. * సీఆర్‌డీఏ పరిధిలోని వివిధ పట్టణ ప్రాంతాల్ని రాజధానితో అనుసంధానం చేయడం, వాటి మధ్య పరస్పర అనుసంధానానికి చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేస్తుంది. * రాజధాని మొత్తానికి సమాచార ప్రసార సాంకేతిక పరిజ్ఞానం (ఐసీటీ) నెట్‌వర్క్ ప్రణాళిక రూపకల్పనకు ముందుకు వచ్చింది. * అమరావతిలో క్రీడా, ఎలక్ట్రానిక్ నగరాల అభివృద్ధిలో భాగస్వామ్యానికి జపాన్ ఆసక్తిగా ఉంది. 2020 ఒలింపిక్స్ నిర్వహిస్తున్న అనుభవంతో రాజధానిలో క్రీడా నగరాన్ని అభివృద్ధి చేస్తామని జపాన్ ప్రతిపాదించింది. * ఆంధ్రప్రదేశ్, జపాన్ మధ్య సహకారానికి అక్కడి మినిస్ట్రీ ఆఫ్ ల్యాండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్స్‌పోర్టు (ఎంఎల్‌ఐటీ)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. * రాజధానిలో ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందించేందుకు జపాన్‌కు చెందిన జైకా, జేబిక్ వంటి సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. * తాగునీరు, మురుగునీటి శుద్ధి, విపత్తుల నుంచి రక్షణ, డేటా కేంద్రాల నిర్వహణలో ప్రాజెక్టులు చేపట్టేందుకు జపాన్ సిద్ధంగా ఉంది. Quote
SonyKongara Posted August 30, 2017 Author Report Posted August 30, 2017 స్టేడియం నిర్మాణానికి బ్రిటన్ ఆసక్తి అమరావతి, ఆంధ్రప్రదేశ్‌తో సహకారానికి బ్రిటన్ రెండు విభాగాలను ఏర్పాటు చేసింది. అమరావతిలో వాణిజ్యం, పెట్టుబడుల ప్రోత్సాహానికి అవసరమైన సమావేశాలు, రహదారి ప్రదర్శనల నిర్వహణ వంటి కార్యక్రమాల్ని ఒక విభాగం చూస్తుంది. అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధి, ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దేందుకు సహకారం అందించేందుకు మరో విభాగం కృషి చేస్తోంది. * అమరావతిలో అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మాణానికి బ్రిటన్ ముందుకు వచ్చింది. * వివిధ అంశాలపై అధ్యయనానికి నిధులిచ్చేందుకు బ్రిటన్‌కు చెందిన అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (డీఎఫ్‌ఐడీ) ఆసక్తిగా ఉంది. * తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ, ప్రైవేటు పెట్టుబడిదారులను ఆకర్షించడం, వాతావరణ మార్పులు, ఆకర్షణీయ నగరాల నాయకత్వం, నవకల్పన సంస్థల ఏర్పాటు తదితర అంశాల్లో బ్రిటన్ సహకరించనుంది. * రాజధానిలో భూగర్భ జలవనరులు, కృష్ణా నది పరీవాహక ప్రాంతం గతంలో ఎలా ఉండేది, రాబోయే కొన్నేళ్లలో ఎలా మారనుంది వంటి అంశాలపై బ్రిటన్‌కు చెందిన బ్రిటిష్ జియోలాజికల్ సర్వే సంస్థ అధ్యయనం చేయనుంది. ఆ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. Quote
SonyKongara Posted August 30, 2017 Author Report Posted August 30, 2017 * పరిపాలన నగరం బృహత్ ప్రణాళిక, శాసనసభ, హైకోర్టు భవనాల ఆకృతులు రూపొందిస్తోంది కూడా బ్రిటన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్-పార్ట్‌నర్స్ సంస్థే. మౌలిక వసతుల ప్రణాళికలో చైనా పాత్ర * రాజధాని ప్రాథమిక ప్రణాళిక దశ నుంచి చైనా ఆసక్తి కనబరిచింది. రాజధానిలో కీలకమైన మౌలిక వసతుల ప్రణాళిక రూపకల్పనలో చైనాకు చెందిన గుజౌ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్స్ కార్పొరేషన్ (జీఐఐసీ) కీలక పాత్ర పోషించింది. ఆర్వీ అసోసియేట్స్‌తో కలిసి ఆ సంస్థ ప్రణాళిక రూపొందించింది. గుజౌ, అమరావతి మధ్య సోదర నగర సహకారానికి ఒప్పందం జరిగింది. జల నిర్వహణలో ఆస్ట్రేలియా సాయం జలవనరుల సుస్థిర నిర్వహణలో సాయపడేందుకు ఆస్ట్రేలియా ముందుకు వచ్చింది. ఆస్ట్రేలియాతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. అమరావతిలో నివాస భవనాల నుంచి వచ్చే వ్యర్థ జలాల్ని అక్కడే శుద్ధి చేసి పునర్వినియోగానికి అనుగుణంగా మార్చే ప్రాజెక్టుకు ‘కోపరేటివ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ వాటర్ సెన్సిటివ్ సిటీస్’ (సీఆర్‌సీ) సంస్థ సాంకేతిక సహకారం అందిస్తుంది. ఆ సంస్థతో కలసి రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు చేపడుతోంది Quote
SonyKongara Posted August 30, 2017 Author Report Posted August 30, 2017 ఇంధన రంగంలో జర్మనీ ఆసక్తి రాజధానిలో ఇంధన, రవాణా రంగాల అభివృద్ధికి నిధులు సమకూర్చేందుకు ఆ దేశానికి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ ఆసక్తిగా ఉంది Quote
SonyKongara Posted August 30, 2017 Author Report Posted August 30, 2017 విజయవాడలో లైట్ రైల్ రవాణా వ్యవస్థపై ఈ సంస్థ అధ్యయనం చేసింది. ఆకర్షణీయ అమరావతికి ఫ్రాన్స్ తోడ్పాటు అమరావతిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సహకారం అందించేందుకు ఫ్రాన్స్ ముందుకు వచ్చింది. అమెరికాలోని వివిధ ఫ్రెంచి కంపెనీల ప్రతినిధులు ఇటీవల అమరావతిని సందర్శించారు. వారిలో సలహాదారులు (కన్సల్టెంట్), గుత్తేదారులు, సాంకేతిక సహాయం అందించేవారు ఉన్నారు. ఫ్రాన్స్‌లోని మార్సిలే నగరంతో అమరావతికి సోదర నగర ఒప్పందం ఉంది. అమరావతిలో రవాణా ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు అక్కడి సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి Quote
SonyKongara Posted August 30, 2017 Author Report Posted August 30, 2017 మరికొన్ని దేశాలు. * కెనడా: రాజధానిలో రహదారులు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు అవసరమైన పరికరాల సరఫరా, ఇంధన ప్రాజెక్టులు, ఎలక్ట్రిక్ వాహనాల సరఫరాకు ఈ దేశం ఆసక్తి కనబరుస్తోంది. * స్విట్జర్లాండ్: ఈ దేశ బృందం ఇటీవలే అమరావతిలో పర్యటించింది. బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియంట్ ప్రాజెక్ట్ (బీప్) ద్వారా సాంకేతిక, పర్యావరణ, జల నిర్వహణలో సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది. * నెదర్లాండ్స్: ఈ దేశానికి చెందిన ఆర్కాడిస్.. టాటా సంస్థతో కలిసి రాజధానికి వరద నియంత్రణ ప్రణాళిక, బ్లూ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోంది. * డెన్మార్క్: రాజధానిలో సైకిల్ ట్రాక్‌లు, మోటారు రహిత రవాణా వ్యవస్థల రూపకల్పనలో పాలు పంచుకునేందుకు ఆసక్తిగా ఉంది. * అమెరికా: ఈ దేశానికి చెందిన మెకన్సీ, సీహెచ్ 2ఎం సంస్థలు సీఆర్‌డీఏకి కీలకమైన కన్సల్టెన్సీ సర్వీసులందిస్తున్నాయి. * రష్యా: ఈ దేశ బృందం అమరావతిని సందర్శించింది. నిర్మాణంలో పాలుపంచుకోవాలన్న ఆసక్తి వ్యక్తం చేసింది. * మలేసియా: ‘కెపాసిటీ బిల్డింగ్’లో సహకారానికి సిద్ధంగా ఉంది. అమరావతి ప్రణాళిక రూపకల్పన దశలో.. పుత్రజయ నగర నిర్మాణంలో తమకెదురైన అనుభవ పాఠాలను వివరించింది. Quote
SonyKongara Posted August 30, 2017 Author Report Posted August 30, 2017 @TOM_BHAYYA @tom bhayya @chittimallu2 @Kool_SRG Quote
SonyKongara Posted August 30, 2017 Author Report Posted August 30, 2017 Nyaya nagaram, vyavasaya nagaram, IT nagaram, pharma nagaram, chaduvula nagaram, kreeda nagaram ila enno ennenno kadutunnaru Quote
BaabuBangaram Posted August 30, 2017 Report Posted August 30, 2017 anni countries thalo gajam lekka ivvandi thondaraga ayipoddi construction Quote
fake_Bezawada Posted August 30, 2017 Report Posted August 30, 2017 why are they so interested ? what is the benefit that they are getting from this? why don't they invest time for us instead of spending time to develop much more for their country ? what is so creepy that's happening internally ? Quote
BaabuBangaram Posted August 30, 2017 Report Posted August 30, 2017 19 minutes ago, fake_Bezawada said: why are they so interested ? what is the benefit that they are getting from this? why don't they invest time for us instead of spending time to develop much more for their country ? what is so creepy that's happening internally ? mana dagar dabbulu yeda raja Quote
fake_Bezawada Posted August 30, 2017 Report Posted August 30, 2017 11 minutes ago, BaabuBangaram said: mana dagar dabbulu yeda raja ala aythe only amaravathi ae endhuku mottam india lo vunna anni states lo kattestham ani ravali kadha Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.