Jump to content

Number of VIP darshanam's reduced to Thirumala


Recommended Posts

Posted

తిరుమలలో ప్రతి రోజూ నిర్ణీత సమయంలో సాధారణ భక్తుల క్యూలైన్‌ను ఆపి, వీఐపీలను దర్శనానికి అనుమతించే బ్రేక్‌ దర్శనాలకు చంద్రబాబు బ్రేక్ వేశారు. తిరుమలేశుడి దర్శనం కోసం వీఐపీల సిఫారసులకు దాదాపుగా బ్రేకు పడింది. వీఐపీలకు తప్ప.. వారి సిఫారసులకు ప్రాధాన్యం తగ్గిస్తూ టీటీడీ రెండు నెలలుగా చేస్తున్న ప్రయత్నాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదముద్ర వేశారు.

తిరుమలలో కొన్నాళ్ళ క్రితం వరకు వీఐపీలను మూడు ప్రాధాన్యాల కింద విభజించి దర్శనానికి అనుమతించేవారు. తొలి ప్రాధాన్యం కింద ప్రొటోకాల్‌ వర్తించే వీవీఐపీలను 10 మందిని ఒక బృందంగా కులశేఖరపడి దాకా అనుమతించి, హారతి ఇచ్చి, తీర్థం ఇచ్చి, శఠారి దీవెన ఇచ్చి పంపేవారు. రెండో ప్రాధాన్యం కింద ప్రొటోకాల్‌ వర్తించే వీఐపీలను 20 మందిని ఒక బృందంగా కులశేఖరపడికి కొంత దూరంలో నిలబెట్టి హారతి మాత్రం ఇచ్చి పంపేవారు. మూడో ప్రాధాన్యం కింద.. సిఫారసులతో వచ్చేవారికి లఘుదర్శనం ఉండేది. అయితే ఈ మూడు కేటగిరీల కోసం సాధారణ భక్తుల దర్శనాన్ని 2-3 గంటలు ఆపేయాల్సి వస్తుండడంతో భక్తుల్లో అసంతృప్తి పెరిగింది. ఫలితంగా అధికారులు వీఐపీ భక్తుల సంఖ్యను తగ్గించే కసరత్తు మొదలుపెట్టారు.

రెండునెలల కింద చంద్రబాబు అనుమతి ఇవ్వడంతో ప్రొటోకాల్‌ వర్తించే వీఐపీలకు మాత్రమే ఎల్‌1 బ్రేక్‌ దర్శనం కేటాయించడం మొదలుపెట్టారు. ఎల్‌2, ఎల్‌3లను ఒకటిగానే పరిగణించి దర్శనం వరకే ప్రాధాన్యత కల్పిస్తున్నారు.

ఈ మధ్య వరకూ ఎల్‌1 కింద దాదాపు 500 నుంచి 1000 మందిని అనుమతించేవారు. ఇప్పుడు ప్రొటోకాల్‌ వర్తించే వారికి మాత్రమే ఎల్‌1ను పరిమితం చేయడంతో ఈ సంఖ్య రోజుకు 100-150కి తగ్గిపోయింది. ఇక ఎల్‌2, ఎల్‌3 కింద సిఫారసు లేఖలతో వచ్చే ప్రముఖులను, ఇతరుల సంఖ్య కూడా ప్రస్తుతం 1000కి మించడంలేదు. వీరిని కులశేఖరపడి దాకా అనుమతించినా.. అక్కడ ఆగకుండా స్వామివారిని దర్శించుకుంటూ ముందుకు వెళ్లిపోవాలి. ఈ మార్పులతో సాధారణ భక్తులకు అదనంగా రెండు గంటలకు పైగా దర్శనం కల్పించే అవకాశం పెరిగింది. అంటే దాదాపు తొమ్మిది వేల మంది అదనంగా దర్శనం చేసుకుంటున్నారు. చంద్రబాబు చొరవకు సాధారణ భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Image may contain: 1 person, smiling
Posted

Great step by CBN. 

Still do not understand the concept of VIP's when visiting Temples. Should be removed completely unless they that person have security threats.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...