SonyKongara Posted September 6, 2017 Author Report Posted September 6, 2017 రాజధాని అభివృద్ధిలో మరో ముందుడుగు రాజధాని నగరంలో తొమ్మిది గ్రామాల్లో 1100 ఎకరాల ప్రభుత్వ భూములు సీఆర్డీయే స్వాధీనం కానుంది. ఇప్పటికే భూసమీకరణ విధానంలో 34 వేల ఎకరాల వరకు భూములు రైతుల నుంచి సమ కూరాయి. భూములు ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్న రైతుల వద్ద సేకరణ విధానంలో తీసుకొ నేందుకు సీఆర్డీయే ప్రక్రియ ప్రారంభించి చివరి దశకు తీసుకొచ్చింది. దసరా నుంచి రాబోయే ఏడాదిన్నరపాటు కీలక అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోంది. తాజాగా ప్రభుత్వ భూముల స్వాధీనంతో మరో ముందడుగు పడింది. తొమ్మిది గ్రామాల్లో సీఆర్డీయేకి ప్రభుత్వ భూముల అడ్వాన్స్ పొజిషన్ 1,100 ఎకరాలు స్వాధీన పరిచేందుకు రెవెన్యూ శాఖకు అనుమతి ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ కోన శశిధర్ రాజధాని అభివృద్ధిలో మరో ముందుడుగు గుంటూరు: అమరావతి రాజధాని నగరంలోని తొమ్మిది గ్రామాల్లో ప్రభుత్వ భూములన్నింటినీ సీఆర్డీయేకి స్వాధీనపరిచేందుకు గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఉత్తర్వులు ఇచ్చారు. వీటిలో డొంక, అసైన్డ్, ప్రభుత్వ పోరంబోకు, చెరువులు, రోడ్లు, శ్మశానవాటిక స్థలా లున్నాయి. ఒకటి, రెండు గ్రామాల్లో కొండ భూములు కూడా ఉన్నట్లు తెలిసింది. విజయదశమి పర్వదినం నుంచి సీడ్ క్యాపి టల్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న భూములను సీఆర్డీయేకి ఇచ్చేయాల్సిందిగా ప్రభుత్వ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. దాంతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వో, రెవెన్యూ అధికారులు కసరత్తు జరిపి ప్రభుత్వ భూ ముల లెక్కలు తేల్చి వాటిని అడ్వాన్స్ పొజిష న్ ఇచ్చేందుకు తుళ్లూరు మండల తహసీ ల్దార్ కార్యాలయానికి అనుమతించారు. దీంతో రాజధాని నగరంలో తొమ్మిది గ్రామా ల్లో 1,100 ఎకరాల ప్రభుత్వ భూములు సీఆర్డీయే స్వాధీనం కానుంది. రాజధానిలో 26 ల్యాండ్ పూలింగ్ యూనిట్లలో ప్రభుత్వ భూములు 1,110.80 ఎకరాలు, అసైన్డ్ భూములు 1,235.78 ఎకరా లు, గతంలో భూకేటాయింపు జరిపినవి 7 ఎకరాలు, వక్ఫ్ భూములు 28.37 ఎకరాలు, దేవదాయ, ధర్మాదాయ భూములు 888.92 ఎకరాలు, అటవీ భూములు 1,048.53 ఎకరా లు, గుట్టలు 8.91 ఎకరాలు, వాగులు, వంకలు, కాలువలు 213 ఎకరాలు, చెరువు లు, నీటివనరులు 1,648.09 ఎకరాలు, గ్రామకంఠం భూములు 329.49 ఎకరాలు, శ్మశానవాటికలు 15.61 ఎకరాలు, ఇనాం భూము లు 280.39 ఎకరాలు, ఇతర కేటగిరీకి చెందినవి 89.04 ఎకరాలు కలిపి మొత్తం 7,614.31 ఎకరాలున్నాయి. వీటిల్లో దేవాదాయ, ధర్మాదాయ శాఖ భూములు ఇప్పటికే భూ సమీకరణ పథకం కింద సీఆర్డీ యే ఆధీనంలోకి వచ్చేశాయి. గ్రామకంఠాలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అటవీ భూముల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. ఇప్పటికే భూసమీకరణ విధానంలో 34 వేల ఎకరాల వరకు భూములు రైతుల నుంచి సీఆర్డీయేకి సమకూరాయి. భూములు ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్న రైతుల వద్ద భూసేకరణ విధానంలో భూములు తీసు కొనేందుకు సీఆర్డీయే ప్రక్రియ ప్రారంభించి చివరి దశకు తీసుకొచ్చింది. అన్ని గ్రామాల్లో అవార్డు ఎంక్వయిరీలు జరుగుతున్నాయి. ఇవి పూర్తికాగానే రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆ భూములను కూడా తీసుకొని జిల్లా యంత్రాంగం సీఆర్డీయేకి ఇవ్వనుంది. అభివృద్ధికి తొలగిన అడ్డంకులు రాజధాని నగరంలో ప్రస్తుతం అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మౌలిక సదు పాయాల కల్పన పనులను ప్రారంభించింది. ఇప్పటికే ఏడు ప్రాధాన్య రోడ్లకు భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించి పనులను చేస్తోంది. మరోవైపు సీడ్ యాక్సెస్ రోడ్డును నిర్మిస్తోంది. శాకమూరులో భారీ విస్తీర్ణంలో ఉద్యావన నిర్మాణానికి అడుగులు వేస్తోంది. ఇంకోవైపు రైతులకు కేటాయించిన నివాస, వాణిజ్య భూముల లేఅవుట్‌లు మాస్టర్‌ప్లాన్‌లో ప్రభుత్వ భూములుగా మార్కింగ్ అయి ఉన్నాయి. దీని దృష్ట్యా ప్రభుత్వ భూములన్నింటిని సీఆర్డీయేకి స్వాధీనపరచాల్సిన అవసరం ఏర్పడింది. దసరా నుంచి రాబోయే సంవత్సరంన్నర పాటు కీలకమైన అభివృద్ధి పనులు రాజధానిలో నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిన దృష్ట్యా మిగిలిన గ్రామాల్లోని ప్రభుత్వ భూములను కూడా సీఆర్డీయేకి స్వాధీనపరుస్తామని రెవెన్యూ వర్గాలు తెలిపాయి Quote
fake_Bezawada Posted September 6, 2017 Report Posted September 6, 2017 dondapadu ah adhi ekado gudiwada daggara vuntundi daaniki ee captial ki endhi relation Quote
kingcasanova Posted September 6, 2017 Report Posted September 6, 2017 inkaa acquisition endi naaa royya, itlaa ayithe babu muni manavadu kooda capital ni choodaledu Quote
Kontekurradu Posted September 6, 2017 Report Posted September 6, 2017 56 minutes ago, fake_Bezawada said: dondapadu ah adhi ekado gudiwada daggara vuntundi daaniki ee captial ki endhi relation Dondapadu ane palce amaravathi , tulluru middle lo vuntaid, maa relatives vuunaur aa orlo. Quote
Kontekurradu Posted September 6, 2017 Report Posted September 6, 2017 28 minutes ago, kingcasanova said: inkaa acquisition endi naaa royya, itlaa ayithe babu muni manavadu kooda capital ni choodaledu next term jagan aanan vastadu, Captail ni YSR jilla ki taralisthadu Quote
fake_Bezawada Posted September 6, 2017 Report Posted September 6, 2017 3 hours ago, Kontekurradu said: Dondapadu ane palce amaravathi , tulluru middle lo vuntaid, maa relatives vuunaur aa orlo. avunaa naku ekada gudiwada daggara vinatlu gurtu dondapadu ,dosapadu villages ok ipude google chesa two places lo vundhi adhi GDV and guntur district lo both Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.