Jump to content

TDP TIMES - GOOD MORNING YELLOW ARMY - 9/07/17


Recommended Posts

Posted

Image may contain: 2 people, people smiling, people standing

 

Good Morning Yellow Army 

ఎన్టీఆర్, భానుమతిగార్లు జంటగా అనేక ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటించారు. మొదటగా 'మల్లీశ్వరి' చిత్రంలో వీళ్లిద్దరూ కలిసి నటించడం జరిగింది. తెలుగు చలన చిత్ర రంగంలో అదొక అపురూప కళాఖండం. విషయం ఏమిటంటే భానుమతిగారు అప్పటికే ఒక వెలుగు వెలిగి ఇక నటనా రంగం నుంచి దాదాపు విరమిద్దాం అనుకుంటున్న తరుణంలో ఈ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టారు. ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయనకు ఇది 8వ చిత్రం. మల్లీశ్వరి తరవాత వీళ్ళిద్దరూ కలిసి నటించిన చిత్రం 'చండీరాణి'. అందులోదే ఈ స్టిల్. 
తన స్వంత బ్యానరు 'భరణి చిత్ర' పతాకంపై ఏకకాలంలో మూడు భాషల్లో 'చండీరాణి' సినిమాకు దర్శకత్వం వహిస్తూ, ఆ మూడు వెర్షన్లలోనూ ద్విపాత్రాభినయం చేస్తూ, కథను తానే రాసుకొని, స్వరరచనకు పర్యవేక్షకురాలిగా వహించిన తొలి మహిళగా భానుమతి రికార్డు సృష్టించారు. పాతాళ భైరవి' (1951) 'మల్లీశ్వరి'(1951) చిత్రాల హిట్‌ తరువాత తారాపథంలో దూసుకుపోతున్న ఎన్టీఆర్, 'చండీరాణి' తన అందం, అభినయం, అలవాటైన జానపద ఆహార్యంతో ఆకట్టుకున్నారు. అప్పటికే ఆయన నిర్మాతగా కూడా మారి 'పిచ్చిపుల్లయ్య' సినిమా తీశారు. 
‘తాతమ్మ కల’ చిత్రానికి కథారచయిత డీవీ నరసరాజు. ఇందులో తాతమ్మ పాత్రను పోషించేదెవరో ముందే చెబితే ఆ ఆర్టిస్టును దృష్టిలో పెట్టుకుని డైలాగులు రాయవచ్చని నరసరాజుగారు అంటే... ‘ఇంకెవరున్నారు భానుమతిగారు ఒక్కరే’ అని ఎన్టీఆర్ అన్నారట. ఆ చిత్రంలో తాతమ్మ వేషం ఉంది వేస్తారా అని భానుమతిని నరసరాజు అడిగారు. ‘రామారావు గారు తాతయ్య వేషం వేస్తే.. తాతమ్మ వేషం వేయడానికి నాకేం అభ్యంతరం లేదు’ అని భానుమతి అన్నారు. ఆ మర్నాడు ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లినప్పుడు నరసరాజు ఈ విషయం చెప్పారు. ‘ఆమె అడిగింది న్యాయమే కదా’ అని ఒక్క క్షణం ఆలోచించి ‘ఆల్‌రైట్, తాతయ్య వేషం సృష్టిద్దాం.'' అన్న ఎన్టీఆర్ తాతయ్య-తాతమ్మల మధ్య సీన్లు డెవలప్ చేశారు. 
అదే సమయంలో భానుమతిగారు భరణీ బేనరుపై ‘అమ్మాయి పెళ్లి’ చిత్రం నిర్మించే సన్నాహాల్లో ఉన్నారు. తన సినిమా ‘అమ్మాయిపెళ్లి’లో తండ్రి వేషం వెయ్యమని ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి అడిగారు భానుమతి. ఆమె అడిగిన వెంటనే ఆయన అంగీకరించడంతో ఇటు 'అమ్మాయి పెళ్ళి' అటు 'తాతమ్మ కల' చిత్రాలు నిర్మించబడ్డాయి. కథా రచన, దర్శకత్వం, నిర్మాణం, నటనా రంగాల్లో వీరిద్దరూ ఎవరికి వారు ఉద్దండులనిపించుకున్నారు. 
ఈ రోజు స్వర్గీయ భానుమతిగారి జయంతి రోజు.

Posted
Just now, KumarVuncle said:

GM Arya, You books ticket to me for Fan following meeting ?

we are looking for booking spl chartered flight with full service fafas Uncle so still searching and money gathering from all fans across the 50 states...it will be an EPIC fan meeting!

Posted
3 minutes ago, KumarVuncle said:

Thanks Arya, if possible book Sunny Leone also in the flight. 

we are also in talks with all flayboy models uncle

Posted
29 minutes ago, mettastar said:

enduku vuncle paisa ki paniki rani topics @3$%

ninnati nunchi sustunna edo madana padutunnav ide post repeat sesi...emmanna hurt sesana vuncle @3$%

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...