timmy Posted September 13, 2017 Report Posted September 13, 2017 లేడీ గెటప్ లో అదరగొట్టేస్తోన్న స్టార్ హీరో! Wed, Sep 13, 2017, 11:20 AM కోలీవుడ్ స్టార్ హీరోల జాబితాలో ఈ మధ్యకాలంలోనే విజయ్ సేతుపతి చేరిపోయాడు. అందుకు కారణం ఆయన ఎంచుకుంటూ వచ్చిన వైవిధ్యభరితమైన పాత్రలే. అదే పద్ధతిని ఆయన తాజా చిత్రం విషయంలోను అనుసరిస్తూ వచ్చాడు. ప్రస్తుతం ఆయన 'సూపర్ డీలక్స్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో 'శిల్ప' అనే లేడీ పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నాడు. ఈ వార్త బయటికి వచ్చినప్పుడు కోలీవుడ్ జనాలు ఆశ్చర్యపోయారు. చాలా రఫ్ లుక్ తో కనిపించే విజయ్ సేతుపతి, లేడీ గెటప్ లో నప్పడేమోనని అనుకున్నారు. కానీ అందుకు సంబంధించిన లుక్ తాజాగా బయటికి రావడంతో మరింత షాక్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో విక్రమ్ .. శివ కార్తికేయన్ లు లేడీ గెటప్ లు వేసి మెప్పించారు. విజయ్ సేతుపతి కూడా లేడీ పాత్రలో అదరగొట్టేయడం ఖాయమని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు. https://www.ap7am.com/flash-news-589152-telugu.html Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.