Jump to content

Vijayawada Ku Lite Metro


Recommended Posts

Posted

మెట్రో స్వరూపం మార్పు!
కొత్తగా జక్కంపూడి, కేసీ జంక్షన్‌కు కారిడార్లు
గన్నవరం వరకు పొడిగింపు
amr-gen1a.jpg

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విజయవాడ నగర మెట్రో ప్రాజెక్టు స్వరూపం మారిపోతోంది. తొలి దశలోనే నాలుగు కారిడార్లు నిర్మాణం చేయాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. దానికి సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయాలని అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ తన ఆర్‌ఎఫ్‌పీ (రిక్వస్టు ఫర్‌ ప్రపోజల్‌)లో కోరింది. విజయవాడ నగరాన్ని మొత్తం విస్తరించేలా మెట్రో ప్రాజెక్టు తొలి దశలోనే ఏర్పాటు కానుంది. దీనికి కేంద్రం నుంచి నిధులు మంజూరు కోసం ప్రయత్నాలు చేస్తోంది. నవ్యాంధ్ర రాజధాని నగరంగా గుర్తింపు పొందిన విజయవాడ నగరానికి మెట్రో ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టి సంకల్పంతో ఉన్న విషయం తెలిసిందే. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా పచ్చజెండా వూపింది. అయితే ప్రధాన కన్సల్టెన్సీగా ఉన్న దిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ చేతులు ఎత్తేయడంతో మళ్లీ మెట్రో కథ మొదటికి వచ్చింది.

 అమరావతి: తాజాగా విజయవాడ నగరానికి తేలికపాటి మెట్రో ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని తేలికపాటి మెట్రో ప్రాజెక్టు రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారీకి కన్సల్టెన్సీని నియమించేందుకు సోమవారం నోటీసు జారీ చేసింది. అయితే గతంలో ఉన్న మెట్రో స్వరూపం ప్రస్తుతం మారిపోయింది. ప్రాథమికంగా 26 కిలోమీటర్ల మెట్రో కోసం డీపీఆర్‌కు నోటీసు జారీ చేసినా.. ఆర్‌ఎఫ్‌పీలో మాత్రం మొత్తం నాలుగు కారిడార్లకు జారీ చేసింది. దీనికి ప్రతిపాదనలు అందించాలని ఏఎంఆర్‌సీ కోరినట్లు తెలిసింది. తొలి దశలోనే వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. మొదట మెట్రో ప్రాజెక్టుకు కేవలం రెండు కారిడార్లు మాత్రమే ప్రతిపాదించి డీఎంఆర్‌సీ సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించిన విషయం తెలిసిందే. బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు కారిడార్లను పీఎన్‌బీ నుంచి నిడమానూరు వరకు, మరొకటి పెనమలూరు వరకు నిర్మాణం చేయాలని తలపెట్టారు. దానికే టెండర్లను పిలిచారు. మొత్తం 26 కిలోమీటర్ల దూరం ఉంది. అయితే ప్రస్తుతం అదనంగా మరో 17 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది.

ఇవీ ప్రతిపాదనలు
గతంలో డీఎంఆర్‌సీ రూపొందించిన డీపీఆర్‌ ప్రకారం ఏలూరు కారిడార్‌ నిడమానూరు వరకు వెళుతుంది. దాదాపు 13 కి.మీ. పొడవున నిర్మించి 11 స్టేషన్లను ఏర్పాటు చేశారు. బందరు కారిడార్‌ మరో 13 కిలోమీటర్లు ఉంటుంది. దీనిలోనూ 11 స్టేషన్లను ఏర్పాటు చేశారు. నిడమానూరు వద్ద కోచ్‌ డిపో ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన. దానికి దాదాపు 50 ఎకరాల ప్రైవేటు పట్టా భూములు అవసరం ఉందని గుర్తించారు. అదే పెద్ద వివాదమైంది. నాడు మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.7,200 కోట్లుగా నిర్ణయించారు. దీనిలో భూసేకరణ పరిహారం అన్నీ కలిపారు. డీఎంఆర్‌సీ ప్రతిపాదనల ప్రకారం కిలోమీటరు మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి రూ.246 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం హెవీ, మీడియం మెట్రో ప్రాజెక్టుల నుంచి ప్రభుత్వం వైదొలిగింది. లైట్‌ మెట్రో ప్రాజెక్టు నిర్మాణం చేసి భవిష్యత్తులో విస్తరించుకోవాలని నిర్ణయానికి వచ్చింది. దాని డీపీఆర్‌ తయారీకి ఆదేశాలు జారీ చేసింది.

భూమి మీద కూడా..
* తాజా లైట్‌మెట్రోలో తొలిదశలోనే నాలుగు కారిడార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పీఎన్‌బీ కేంద్రంగా ఇవి సాగుతాయి. నాలుగు కారిడార్ల పొడవు మొత్తం 43 కి.మీ. లైట్‌ మెట్రో ప్రాజెక్టు అంచనా వ్యయం జర్మనీ నిపుణులు డాట్సన్‌ ప్రతిపాదన ప్రకారం కిలోమీటరుకు రూ.160 కోట్లు. దాని ప్రకారం మొత్తం ప్రాజెక్టు రూ.6,880 కోట్లు వ్యయం అవుతుంది. అంటే మీడియం మెట్రోలో 26 కిలోమీటర్లకు అయ్యే వ్యయంతో 43 కిలోమీటర్ల దూరం చేపట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.

* బందరు కారిడార్‌లో మార్పులు చేయడం లేదు. పీఎన్‌బీ నుంచి పెనమలూరు వరకు ఉంటుంది. దీనిలో కొంత భూమిమీద నడిచే విధంగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. 6.81 కి.మీ. భూమ్మీద (ఎట్‌గ్రేడ్‌) ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఇటీవల బందరు రోడ్డు విస్తరణ కోసం నిర్మాణాలను తొలగించడంతో అది పెద్ద సమస్య కాబోదని అంటున్నారు. భూమ్మీద మెట్రో నిర్మాణానికి కిలోమీటరుకు రూ.82.31 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది.

* ఏలూరు కారిడార్‌లో మార్పులు చేశారు. నిడమానూరు నుంచి గన్నవరం వరకు పొడిగించాలని నిర్ణయించారు. అంటే అదనంగా మరో 7 కి.మీ. పెరగనుంది. నిడమానూరులో కోచ్‌డిపో ఆవశ్యకత ఉండదు. గన్నవరంలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. డిపో ఏర్పాటుకు 30 ఎకరాలు సరిపోతుందని అంచనా వేశారు.

* ఏలూరు రోడ్డులో బీఆర్‌టీఎస్‌ రోడ్డును వినియోగించుకొని దాదాపు 8.18 కి.మీ. ఎట్‌గ్రేడ్‌గా భూమ్మీద ట్రాక్‌ ఏర్పాటు చేయవచ్చు. దీంతో అంచనా వ్యయం భారీగా కలిసివస్తుంది. కేవలం 26 కిలోమీటర్ల పాక్షిక ఎలివేటెడ్‌ మెట్రోకు రూ.2,142 కోట్ల వ్యయం అవుతుందని డాట్సన్‌ నివేదించారు. ఒకవేళ ఇదే అమలు చేస్తే ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది.

* కొత్తగా జక్కంపూడికి మెట్రో కారిడార్‌ నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు. జక్కంపూడిలో ప్రభుత్వం ఆర్థిక నగరాన్ని నిర్మాణం చేస్తోంది. ఇక్కడ కొన్ని పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. అక్కడికి మెట్రో ఆవశ్యకత ఉంది. పీఎన్‌బీ నుంచి గాంధీ పార్కు మీదుగా చిట్టినగర్‌ నుంచి జక్కంపూడికి నిర్మాణం చేయాలనేది ప్రతిపాదన. దీనికి ఆర్‌ఎఫ్‌పీ అందించింది. దాదాపు 8 కిలోమీటర్ల వరకు దూరం ఉంటుంది. దీనికి అంచనా వ్యయం దాదాపు రూ.1340కోట్లు అవుతుంది.

* మరో కారిడార్‌ను కృష్ణా కాలువ జంక్షన్‌ వరకు నిర్మాణం చేయాలనేది ప్రతిపాదన. దాదాపు 3 కి.మీ. ఉండే అవకాశం ఉంది. కృష్ణా కాలువ వరకు నిర్మాణం చేస్తే భవిష్యత్తులో అమరావతి రాజధాని నగరానికి అనుసంధానం సులభంగా ఉంటుందని అంచనా. తొలి దశలో ఈ నాలుగు కారిడార్లకు డీపీఆర్‌ సిద్ధం కానుందని తెలిసింది. భవిష్యత్తులో ఇబ్రహీంపట్నం, కొండపల్లి వరకు పొడిగించాలనేది ప్రతిపాదన.

నిధుల మాటేమిటి?
విజయవాడ లైట్‌ మెట్రోకు నిధుల సమస్య లేదని అధికారులు చెబుతున్నారు. జర్మనీ సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ, ప్రాన్సు సంస్థ ఏఎఫ్‌డబ్ల్యూ సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. కేంద్రం నుంచి నిధులు అందుతాయా లేదా అనేది ఇప్పుడు సమస్యగా మారింది. పాత పద్ధతిలో కేంద్రం 20 శాతం నిధులు సమకూర్చేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్రం 20శాతం అందించనుంది. ప్రస్తుతం మెట్రో ప్రాజెక్టులు నూతన విధానంలోనే అనుమతులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అంటే పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేసుకోవాల్సిందే. విజయవాడ మెట్రోను సగం ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మాణం చేసి నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థకు అప్పగించాలనే ఆలోచన చేస్తున్నారు. అంటే ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణాలు ఇతర పనులకు ప్రభుత్వం నిధులు సమకూర్చాలి. లేదా రుణ సంస్థలకు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఇతర నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ప్రతిపాదిస్తున్నాం
కొత్తగా తయారు చేయనున్న డీపీఆర్‌లో గన్నవరం వరకు ప్రతిపాదనలు అడుగుతున్నాం. మరో కారిడార్‌ జక్కంపూడికి విస్తరించనున్నాం. కృష్ణా నది దాటించాలనే సంకల్పంతో ఉన్నాం. అందుకే మూడో కారిడార్‌ కేసీ జంక్షన్‌ వరకు ప్రతిపాదించాం. దీనికి డీపీఆర్‌ తయారు చేయాలని ఆర్‌ఎఫ్‌పీలో కోరాం. అవన్నీ అంతర్గతంగా ఉంటాయి. కేంద్రం నుంచి నిధులు అందితే ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన అవుతుంది. డీఎంఆర్‌సీ టెండర్లను ఖరారు చేసి ఉంటే ఇప్పటికే పనులు ప్రారంభం అయ్యేవి. ప్రస్తుతం నాలుగు నెలల్లో డీపీఆర్‌ తయారు చేసిన తర్వాత సీఎం ఆమోదించాల్సి ఉంటుంది.

రామకృష్ణారెడ్డి, ఎండీ, అమరావతి మెట్రో

Posted
లైట్‌ రైల్‌ చాలు
16-09-2017 02:43:47
 
636411266436159191.jpg
  • బెజవాడకు మెట్రో అక్కర్లేదు.. జనాభా 14 లక్షలే కదా!
  • ప్రణాళికలు సిద్ధం చేసుకోండి.. కేంద్ర మంత్రి పురి సూచన
  • జైట్లీ దృష్టికీ తీసుకెళ్తామని మంత్రి నారాయణకు హామీ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): జనాభా ప్రాతిపదికన విజయవాడలో హెవీ మెట్రో రైలు ప్రాజెక్టుకు అనుమతించలేమని కేంద్రం స్పష్టం చేసింది. లైట్‌ మెట్రోకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటే బావుంటుందని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖల మంత్రి హరదీ్‌పసింగ్‌ పురి సూచించారు. శుక్రవారమిక్కడ ఆయనతో, కేంద్ర పట్టణాభివృద్ధి కార్యదర్శి దుర్గాశంకర్‌తో ఆంధ్రప్రదేశ్‌ పురపాలక మంత్రి పి.నారాయణ భేటీ అయ్యారు. విజయవాడలో మెట్రో అంశాన్ని రాష్ట్ర విభజన చట్టంలో కూడా పేర్కొన్నారని, 2015లోనే మెట్రో కోసం దరఖాస్తు చేసుకున్నందున హెవీ మెట్రో నిర్మాణానికే అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
 
అయితే 20 లక్షల జనాభా ఉన్న పట్టణాల్లో మాత్రమే హెవీ మెట్రోకు అనుమతి ఇస్తున్నామని, విజయవాడలో 14 లక్షల మంది జనాభానే ఉన్నందున రాబోయే 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకున్నా లైట్‌ రైల్‌ మెట్రోనే సముచితంగా ఉంటుందని పురి సలహా ఇచ్చారు. అయినా రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. నారాయణ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. మెట్రో మ్యాన్‌ శ్రీధర్‌ సూచించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) ప్రకారం.. విజయవాడ నడిబొడ్డులోనే రూ.800కోట్ల విలువైన భూమిని సేకరించాల్సి ఉంటుందని, లైట్‌ మెట్రో రైల్‌ను కేవలం రూ.400 కోట్లకే విమానాశ్రయం వరకూ పొడిగించవచ్చని, అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నామని తెలిపారు
Posted
4 minutes ago, Idassamed said:

Completion date?

2019 varaku complete avochu

Posted
Just now, SonyKongara said:

2019 varaku complete avochu

Is it even possible?

Posted
7 minutes ago, SonyKongara said:

2019 varaku complete avochu

2019 AD na or 2019 BC ah??

Posted
4 minutes ago, Kool_SRG said:

2019 AD na or 2019 BC ah??

CBN chesi chupistadu chudandi

Posted
3 minutes ago, Pipucbn said:

Andhuthe Thala Andhaka pothe Kallu... as usual Pulkas

State development kosam...future generation kosam

Posted
4 minutes ago, SonyKongara said:

CBN chesi chupistadu chudandi

Chestaru maree 2019 lopu ela avvuddi vaa , nuvvu asalu telisi matladu tunnavo leka endo... Velli CBN ni adigina 2019 kalla cheyyalemu ane ani cheptadu.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...