Jump to content

Rajamouli enduku antunnaru


Recommended Posts

Posted

world trade center mida attack jariginappudu FBI ,CIA vallu hollywood directors  ni pilichi inka ekkda ayina ellanti  attack jargavaccha  ani kanukunnaru, ante ardham chesukondi leader vision...

Posted
సీఎంని కలిసిన రాజమౌళి
 
 
636415577697289712.jpg
  • మూడు విడతలుగా భేటీ.. డిజైన్లపై చర్చ
  • రాజమౌళి సూచించేది కాన్సెప్టు మాత్రమే: నారాయణ
అమరావతి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంపై తగిన సూచనలు ఇచ్చేందుకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి సీఎం చంద్రబాబును కలిశారు. బుధవారం అమరావతి వచ్చిన రాజమౌళి మూడు విడతలుగా సీఎంతో భేటీ అయ్యారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని సీఎం నివాసంలో, మధ్యాహ్నం కలెక్టర్ల సదస్సులో, రాత్రి విజయవాడ సీఎం క్యాంప్‌ కార్యాలయంలో చంద్రబాబుతో రాజమౌళి భేటీ అయ్యారు.
 
ఐకానిక్‌ నిర్మాణాలైన అసెంబ్లీ, హైకోర్టులు ఎలా రూపుదిద్దుకోవాలని సీఎం కోరుకుంటున్నారో తెలుసుకున్నారు. వీటి కోసం మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌ రూపొందించిన డిజైన్లు, వాటి వెనుక ఉన్న కాన్సె్‌ప్టల గురించి ఆ సంస్థ ప్రతినిధులతోపాటు సీఆర్డీయే ఉన్నతాధికారులు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా రాజమౌళికి వివరించారు.
 
అంతకుముందు రాజమౌళి రాజధాని ప్రాంతాన్ని, వెలగపూడి తాత్కాలిక సచివాలయాన్ని సందర్శించారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. కాగా, రాజమౌళి సలహాలు ఇచ్చేది డిజైన్లకు సంబంధించి కాదని,ఏ కాన్సె్‌ప్టలో అవి రూపొందితే బాగుంటాయో మాత్రమే సూచిస్తారని మంత్రి నారాయణ తెలిపారు. అక్టోబరు 12 లేదా 13 తేదీల్లో సీఆర్డీయే అధికారులతో కలిసి రాజమౌళి లండన్‌ వెళ్లి, నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులతో సమావేశమవుతారని తెలిపారు.ఈ సేవలకుగాను రాజమౌళికి ఫ్రభుత్వం ఎలాంటి ఫీజూ చెల్లించడంలేదన్నారు.
 
సచివాలయం భేష్‌: రాజమౌళి
వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయ నిర్మాణాలు బాగున్నాయని రాజమౌళి కితాబిచ్చారు. సచివాలయం మొదటి బ్లాకులోని సీఎం చాంబరు, సమావేశపు గదులను, అసెంబ్లీ, మండలి భవనాలను పరిశీలించారు.
Posted

ఆకృతుల రూపకల్పనలో సహకరిస్తా: రాజమౌళి
20ap-main7a.jpg

ఈనాడు, అమరావతి: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో భాగంగా ఆకృతుల రూపకల్పనలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి చెప్పారు. బుధవారం విజయవాడకు వచ్చిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో వేర్వేరు సమయాల్లో మొÅ్తŒం మూడు సార్లు సమావేశమయ్యారు. ఆకృతుల పరంగా ఇప్పటివరకు జరిగిన పరిణామాలను తెలుసుకున్నారు. ప్రస్తుత ఆకృతులు ఏ ప్రాతిపదికన రూపొందించారని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రాజధాని నిర్మాణ ఆకృతులు ఉండాలని ముఖ్యమంత్రి ఆయనకు సూచించారు. బాహ్య స్వరూపం ఆకట్టుకునేలా ఉండాలన్నారు. రాజధాని నిర్మాణం ప్రపంచంలోని అగ్రనగరాల్లో ఒకటిగా ఉండాలని, ప్రజలందరూ ఆమోదించేలా ఉండాలని స్పష్టం చేశారు. లండన్‌ వెళ్లి నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులను కలిసేందుకు దర్శకుడు రాజమౌళి సుముఖత వ్యక్తం చేశారు. తొలుత నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశం అవుతానని, ఆ తర్వాత లండన్‌ వెళతానని చెప్పారు. దర్శకుడు రాజమౌళి ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. వెలగపూడి సచివాలయానికి వెళ్లారు. అక్కడి శాసనసభ, ఇతర భవనాలను పరిశీలించారు. కరకట్ట మీదుగా ప్రయాణం చేసి రాయపూడిలో ప్రకాశం బ్యారేజీ బ్యాక్‌వాటర్‌ను పరిశీలించారు. ప్రకాశం బ్యారేజీ, దుర్గాఘాట్‌ నుంచి నదిలో బోటుపై పున్నమిఘాట్‌ వరకు ప్రయాణం చేశారు. ఆ ప్రాంతాలను సందర్శించారు. తాను తిరిగిన ప్రదేశాలను చరవాణిలో బంధించారు. అనంతరం మూడో సారి క్యాంపు కార్యాలయంలో సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువకప్పి సీఎం ఘనంగా సత్కరించారు. పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, ఆర్కిటెక్టు చంద్రశేఖర్‌, సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ ఉన్నారు. దర్శకుడు రాజమౌళి మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.

అధ్యయనం చేస్తారు: మంత్రి నారాయణ
నార్మన్‌ఫోస్టర్‌ ఆకృతులను అధ్యయనం చేసి మరోసారి సీఎంతో దర్శకుడు రాజమౌళి సమావేశమవుతారని మంత్రి నారాయణ చెప్పారు. సీఎంతో సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అవగాహన కోసం రాజధాని ప్రాంతంలో రాజమౌళి పర్యటించారని, వివిధ ప్రాంతాలను పరిశీలించి సందేహాలను తీర్చుకున్నారని వివరించారు. చరిత్ర తెలిసిన వ్యక్తి కావడం, వివిధ దేశాల్లో పర్యటించిన అనుభవం ఉండటంతో రాజధాని ఆకృతుల విషయంలో ఆయన సహాయం కోరగా సానుకూల స్పందన లభించిందని చెప్పారు. నార్మన్‌ఫోస్టర్‌ రూపొందించిన డైమండ్‌ ఆకృతి అంతగా నచ్చలేదని ప్రజాభిప్రాయసేకరణలో తేలిందన్నారు.

రహదారుల నిర్మాణానికి 15లోగా టెండర్లు
రాజధాని ప్రాంతంలో 365 కిలోమీటర్లకు సంబంధించిన రోడ్ల నిర్మాణానికి వచ్చే నెల 15లోగా టెండర్లను పిలువనున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. వీటిని ఏడాదిలోగా పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. సచివాలయం, ఐకానిక్‌ భవనాలలో మౌలిక సదుపాయాల కల్పన, భూగర్భ మురుగునీటి వ్యవస్థకు రూ.24 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. రాజధాని ప్రాంతంలో 27 గ్రామాలకు చెందిన రైతులకు స్థలాలు ఇచ్చామని వెల్లడించారు.

Posted
12 minutes ago, SonyKongara said:

world trade center mida attack jariginappudu FBI ,CIA vallu hollywood directors  ni pilichi inka ekkda ayina ellanti  attack jargavaccha  ani kanukunnaru, ante ardham chesukondi leader vision...

H2kJSQL.gif

Posted
1 minute ago, Kool_SRG said:

Ante ippudu CBN visionary copy kottadantava??

 

1 minute ago, Kool_SRG said:

Ante ippudu CBN visionary copy kottadantava??

Kontekurradu

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...