Jump to content

Recommended Posts

Posted
ACB attack on two town planning officers

ఏసీబీకి చిక్కిన ఇద్దరు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు

అక్రమాస్తులు రూ.500 కోట్లకు పైమాటే?

టౌన్‌ ప్లానింగ్‌ అధికారి రఘు ఆస్తులపై ఏసీబీ దాడులు 

షిర్డీ సహా రాష్ట్రంలోని 23 చోట్ల సోదాలు

పలు ప్రాంతాల్లోని ప్లాట్లు,ఫ్లాట్‌ల పత్రాలు స్వాధీనం

బినామీ శివప్రసాద్‌ ఇంటిపైనా దాడులు

8 కిలోల బంగారం.. 23 కిలోల వెండి వస్తువులు స్వాధీనం

శివప్రసాద్‌ భార్య పేరుతో ఇన్‌ఫ్రా కంపెనీలు

సాక్షి నెట్‌వర్క్‌: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో ఏసీబీ అధికారులు సోమవారం ఏపీ టౌన్‌ ప్లానింగ్‌ డైరెక్టర్‌ గొల్ల వెంకట రఘు, ఆయన బినామీ విజయవాడ టౌన్‌ ప్లానింగ్‌ జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ నల్లూరి శివప్రసాద్‌ నివాసాలపై ఏకకాలంలో దాడులు చేశారు. షిర్డీ సహా రాష్ట్రంలోని 23 ప్రాంతాల్లో ఉంటున్న వారి బంధువులు, బినామీల నివాసాల్లోనూ సోదాలు జరిపారు. ఈ సందర్భంగా బయటపడిన ఆస్తుల రిజిస్ట్రేషన్‌ విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కానీ వాటి మార్కెట్‌ విలువ రూ.500 కోట్లకు పైమాటే ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

రఘు ఆస్తులివే..
మంగళగిరిలోని రఘు నివాసంతో పాటు స్వగ్రామమైన చిత్తూరు జిల్లా మహాసముద్రం, షిర్డీ, విజయవాడ, తిరుపతి, చిత్తూరు, విశాఖ జిల్లాల్లోని రఘు బంధువులు, బినామీల నివాసాల్లో ఏసీబీ సిబ్బంది సోదాలు జరిపారు. రఘు నివాసంలో జరిపిన సోదాల్లో.. కృష్ణా జిల్లా గన్నవరం వద్ద 300 ఎకరాల్లో వెంచర్, బొమ్ములూరులో 1,033 చదరపు గజాల ఇంటి స్థలం, తాడేపల్లిలో నివాస స్థలాలు, మంగళగిరి కొండపనేని లేఅవుట్‌లో 220 చదరపు గజాల స్థలం, చిత్తూరు జిల్లా పులివెల్లంలో 2 ప్లాట్లు, విశాఖలో రూ.80 లక్షల విలువైన ఫ్లాట్, షిర్డీలోని హోటల్, డూప్లెక్స్‌ హౌస్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. అలాగే రూ.12 లక్షల విలువైన బంగారం, రూ.5 లక్షల విలువైన గృహోపకరణాలు, రూ.10 లక్షల నగదును ఏసీబీ స్వాధీనం చేసుకుంది.

మంగళగిరిలోని రఘు నివాసానికి సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆయనకు చెందిన రెండు కార్లను అధికారులు గుర్తించారు. చిత్తూరు జిల్లా రాంపల్లెలోని రఘు అత్త కళావతమ్మ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. ఆమె పేరు మీదున్న పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ ఆశీల్‌మెట్టలోని ప్రైవేటు సర్వేయర్‌ గోవింద్‌రాజు ఇంట్లో తనిఖీలు చేసి.. రూ.2.5 లక్షల నగదు, పలు రికార్డులు స్వాధీనపరుచుకున్నారు. కిర్లంపూడిలోని రఘు స్నేహితుడు కాంట్రాక్టర్‌ భాస్కరరెడ్డి ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ సిబ్బంది.. పలు రికార్డులు తీసుకెళ్లారు. కాగా, సోమవారం సాయంత్రం కూడా సోదాల నిమిత్తం మరో బృందం రావడంతో.. వారిపై రఘు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంట్లోకి రావొద్దంటూ కేకలు వేయడంతో పాటు అరెస్ట్‌ చేస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించారు.  

బినామీ ఇంట్లో భారీగా బంగారం..
రఘు బినామీ అయిన శివప్రసాద్‌(గుణదల) నివాసంలో ఏసీబీ జరిపిన దాడుల్లో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు లభించాయి. శివప్రసాద్‌కు భారతీనగర్‌లో 16 ఫ్లాట్లు, గన్నవరం సమీపంలోని చినఅవుట్‌పల్లి 1.40 ఎకరాల్లో సాయి మిథిల కన్వెన్షన్‌ హాల్‌ ఉంది. ఆయన భార్య గాయత్రి పేరుతో భారతీనగర్, గుణదలలో రెండు భవనాలున్నాయి. పలు ప్రాంతాల్లో 11.65 ఎకరాల పొలముంది. అంతేకాకుండా ఆమె పేరు మీద సాయి సదన్‌ ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్, సాయి సుధా అవెన్యూ ప్రైవేటు లిమిటెడ్, సబురి బిల్డర్స్‌ ప్రైవేటు లిమిటెడ్, శ్రీ మాతా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ అనే కంపెనీలున్నాయి. వీరి కుమార్తె పేరుతో భారతీనగర్‌లోనే రూ.80 లక్షల విలువైన స్థలంలో ఓ భవనం, హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఓ ప్లాట్‌ ఉంది.

శివప్రసాద్‌ కుటుంబసభ్యులు, బంధువుల పేరు మీద విజయవాడలోని గుణదల, భారతీనగర్, కృష్ణా జిల్లాలోని పోతేపల్లి, బొమ్ములూరు, గుంటూరు జిల్లా కటికలపూడి, సుకృతికోటపాడు ప్రాంతాల్లో 18కి పైగా ఖరీదైన ఇళ్ల స్థలాలున్నట్టు ఏసీబీ సిబ్బంది గుర్తించారు. అలాగే 8 కిలోల బంగారు, వజ్రాభరణాలు, 23 కిలోల వెండి వస్తువులను అధికారులు శివప్రసాద్‌ నివాసం నుంచి స్వాధీనం చేసుకున్నారు. వీటిలో బంగారంతో చేసిన ఆరు రకాల వడ్డాణాలు, జడలు, నాలుగు అరవంకలు, 25కు పైగా గాజులు, పావు కిలో బరువైన ప్లేట్లు, గ్లాసులు, వెండితో తయారు చేసిన పూజ సామగ్రి తదితర ఆభరణాలున్నాయి. అలాగే రూ.44 లక్షల నగదు కట్టలను స్వాధీనం చేసుకున్నారు. 

బినామీలు ఇంకెంతమందో!
ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న రఘుపై ఏసీబీ దాడులు నిర్వహించడం చర్చనీయాంశమైంది. మరోవైపు శివప్రసాద్‌ను రఘుకు బినామీ అని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. గతంలో విజయవాడలో పనిచేసిన రఘుతో శివప్రసాద్, ఆయన భార్య చింతమనేని గాయత్రి కలసి విధులు నిర్వహించారు. శివప్రసాద్‌ ఇంట్లో దొరికిన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు గాయత్రి పేరుతోనూ, బంగారు ఆభరణాలకు సంబంధించిన బిల్లులు రఘు పేరుతోనూ ఉన్నట్టు సమాచారం. దీంతోనే శివప్రసాద్, గాయత్రీలను రఘు బినామీలుగా ఏసీబీ నిర్ధారించింది. కాగా, ఈ కేసులో దర్యాప్తు సాగుతోందని ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌ చెప్పారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఏసీబీ డీఎస్పీ కృష్ణారావు, స్పెషల్‌ టీం డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించినట్టు చెప్పారు. దొరికిన డాక్యుమెంట్లపై విచారణ జరుగుతోందన్నారు. రఘు, శివప్రసాద్‌ లింకులపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రఘు బినామీలు, వారి ఆస్తుల వివరాలపై తమకు ఇంకా సమాచారం అందుతోందని, వాటిపై కూడా దాడులు చేస్తామని ఠాకూర్‌ చెప్పారు. కాగా, జీవీ రఘును మంగళవారం ఉదయం విశాఖ నగరానికి తీసుకువచ్చి విచారించనున్నారు. 

Posted
ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగలం 
25brk-56-acb1.jpg

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఏసీబీ వలకు భారీ అవినీతి తిమింగలం చిక్కింది. రాష్ట్ర పట్టణ ప్రణాళికా విభాగం సంచాలకులు గొల్ల వెంకట రఘు భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే అభియోగంపై ఏసీబీ అధికారులు ఆయన ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. రంగంలోకి దిగిన 15 ఏసీబీ బృందాలు సోదాలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు రూ.500 కోట్ల విలువ చేసే అక్రమాస్తులను అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. తవ్వుతున్న కొద్దీ అక్రమాస్తులు బయటపడుతుండటంతో ఏసీబీ అధికారులు విస్తుపోతున్నారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలో రఘు నివాసం ఉంటున్న ఇంట్లో రూ.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. విజయవాడ నగర శివారులోని బొమ్మలూరులో 1033 చదరపు అడుగుల ఇంటిస్థలం, గుంటూరు జిల్లా మంగళగిరిలోని కండపేని లే అవుట్‌లో 220 చదరపు అడుగుల ఇంటి స్థలం గుర్తించారు. రూ.5.5 లక్షల విలువ చేసే హుందాయ్‌ కారు గుర్తించారు. రఘు భార్య పేరిట బొమ్మలూరులో 1033 చదరపు అడుగుల ఇంటి స్థలం, కృష్ణా జిల్లా వేల్పూరులో రెండెకరాల ఆరు సెంట్ల వ్యవసాయ భూమి, కుమార్తె పేరిట చిత్తూరు జిల్లా పులివెల్లంలలో 428 చదరపు అడుగుల రెండు ఇళ్ల స్థలాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అతడి అత్త పేరిట విశాఖలో 167 చదరపు అడుగుల ఇంటి ప్లాటు, మహారాష్ట్రలోని షిర్డీలో సాయి సురాజ్‌కుంజ్‌ పేరిట డూప్లెక్స్‌ ఇల్లు, లాడ్జి ఉన్నట్టు కనుగొన్నారు.

25brk-56-acb2.jpg

వీటితో పాటు ఇంట్లో 200 గ్రాముల బంగారు ఆభరణాలు, సుమారు రూ.10లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.రఘు కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంకు లాకర్లను పరిశీలిస్తున్నారు. ఇతర చర, స్థిరాస్తుల వివరాలపై ఆరా తీస్తున్నారు. గుంటూరు నగర శివారులోని గోరంట్లలో పురపాలక శాఖ కార్యాలయంలో పట్టణ ప్రణాళిక విభాగం సంచాలకులుగా రఘు విధులు నిర్వహిస్తున్నారు. 1988 మే 11న అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పట్టణ, కంట్రీ ప్లానింగ్‌ విభాగంలో విధుల్లో చేరారు. అనంతపురం, నెల్లూరు, విశాఖలలో పనిచేశారు. 2015 నుంచి రాష్ట్ర టౌన్‌, కంట్రీ ప్లానింగ్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. విశాఖ ఏసీబీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్‌ పర్యవేక్షణలో విజయవాడ, మంగళగిరి తదితర ప్రాంతాల్లో మొత్తం 15 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయని ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌పీ ఠాకూర్‌ తెలిపారు.

25brk-56-acb3.jpg

బినామీ ఇంట్లో భారీగా బంగారం 
విజయవాడ నగర పాలక సంస్థలో పనిచేస్తున్న మరో అవినీతి తిమింగలాన్ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. జూనియర్‌ టెక్నికల్‌ అధికారిగా పనిచేస్తున్న నల్లూరి వెంకట శివప్రసాద్‌ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ గన్నవరం సమీపంలో భార్గవీనగర్‌లో శివప్రసాద్‌ ఇంట్లో ఏసీబీ డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు. రూ.19 కోట్ల విలువైన వజ్ర, బంగారు, వెండి ఆభరణాలను గుర్తించారు. దీంతో పాటు రూ.15కోట్ల విలువైన భూముల పత్రాలు గుర్తించారు. శివప్రసాద్‌ను రాష్ట్ర పట్టణ ప్రణాళిక శాఖ సంచాలకుడు గొల్ల వెంకట రఘు బినామీగా గుర్తించారు.

Posted
15 minutes ago, TampaChinnodu said:

deenamma enni rojulu ikkada contract jobulu chesi ooru ooru sanchi pattukoni tirigithe osthai 500 C

Posted
36 minutes ago, TampaChinnodu said:

no corruption in nippu CBN rule ani chinna babu tweeted no silent_I1

lol Pappu

Posted
19 minutes ago, princeofheaven said:

deenamma enni rojulu ikkada contract jobulu chesi ooru ooru sanchi pattukoni tirigithe osthai 500 C

oo pedda mesthri shop petti thousands of people usuru posukunte thappa earn seyyalem 500 C

Posted
29 minutes ago, princeofheaven said:

deenamma enni rojulu ikkada contract jobulu chesi ooru ooru sanchi pattukoni tirigithe osthai 500 C

5C kuda kashtamay.. 500C antey almost 100 Million .. pichakayal osthay IT contracting chesthey.. retire ayye time ki 5M untey maha goppa...

Posted
1 hour ago, Quickgun_murugan said:

5C kuda kashtamay.. 500C antey almost 100 Million .. pichakayal osthay IT contracting chesthey.. retire ayye time ki 5M untey maha goppa...

5M....chala expectation unnayi babu neeku....adhi highly paid consultants ki thappa...trivial software engineer full time ithe expenses ponu...1M save cheyyagaligithe goppa...life time lo....

500C ante comedy ayipoyindhi......emito...emi chesukuntaru anni dabbula tho....vammo...naana sankalu naakuthunnam ikkada month gadavaniki....addam gaa dhochesthunnaru....endhuko ee yedhava sadhuvulu....hard work and dedication..matti masanam....thu...

yedisi..vellani yevadu pattukodu...pattukunna % icchi escape ayipotharu...bindas life....

Posted
Just now, nokia123 said:

Agreed. Good post

Posted
26 minutes ago, Renault said:

Ippudu veellani em sestaru va...jail lo pedtara...commission dobbi vadilestara 

last line

Posted
అవినీతి బంధం.. వందల కోట్ల సామ్రాజ్యం 
దోచేశారు 
ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగలం 
పట్టణ ప్రణాళికా విభాగం డైరెక్టర్‌ రఘు, బినామీ నల్లూరి వెంకట శివప్రసాద్‌, ఆయన భార్య అక్రమాస్తుల గుట్టురట్టు 
23 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు 
మార్కెట్‌ విలువ రూ.500 కోట్లు 
25ap-main1a.jpg
ఆయన ప్రణాళికా విభాగంలో కీలక అధికారి. అందుకేనేమో అవినీతి పనులకు పక్కాగా ప్రణాళిక రచించాడు. ఇద్దరు బినామీలను ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారా తన అక్రమ కార్యకలాపాలను సాగించాడు. కోట్లాది రూపాయల ఆస్తులను కూడబెట్టాడు. లేఅవుట్‌ల అనుమతికి నగదు కన్నా ప్లాట్లే మిన్నగా భావించాడు. ప్రతి దానిలో నాలుగైదు ప్లాట్లను తన జేబులో వేసుకున్నాడు. బినామీల పేరున సంస్థలను ఏర్పాటు చేశాడు. వాటి పేరునే ఆస్తులను బదలాయించాడు. ఈ క్రమంలో మరో 4 రోజుల్లో పదవీ విరమణ చేయనున్నాడు. ఈ సమయంలో ఏసీబీ వలలో చిక్కాడు. ఆయనే పట్టణ ప్రణాళికా విభాగం సంచాలకులు రఘు.

ఈనాడు, అమరావతి: అవినీతి నిరోధక విభాగం వలలో మరో భారీ తిమింగలం చిక్కుకుంది. ఆయన బినామీలపై కూడా దాడి చేయడంతో వూహించని రీతిలో ఆస్తులు, వజ్రాలు, బంగారు ఆభరణాలు, నగదు బయటపడ్డాయి. సోమవారం ఏకకాలంలో జరిపిన దాడుల్లో మార్కెట్‌ విలువ ప్రకారం దాదాపు రూ.500 కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టినట్లు గుర్తించింది. వారిలో ఒకరేమో పట్టణ ప్రణాళికా విభాగం (టౌన్‌ అండ్‌ కంట్రీప్లానింగ్‌) డైరెక్టరు గొల్ల వెంకట రఘు, మరొకరేమో పురపాలక శాఖ ఇంజినీరింగ్‌ విభాగం జూనియర్‌ టెక్నికల్‌ అధికారి నల్లూరి వెంకట శివప్రసాద్‌, ఇంకొకరేమో శివప్రసాద్‌ భార్య చింతమనేని గాయత్రి. ఆమె పురపాలక శాఖలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా పని చేసి రెండేళ్ల కిందట స్వచ్చంద పదవీ విరమణ చేశారు. వీరు ముగ్గురు చేతులు కలిపారు. ఒకరికి మరొకరు బినామీగా వ్యవహరించి రూ.500 కోట్ల (మార్కెట్‌ విలువ) అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆంధ్రప్రదేశ్‌ ఏసీబీ గుర్తించింది. మూడు రాష్ట్రాల పరిధిలోని 8 జిల్లాల్లో తమ అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించినట్లు తేల్చింది. వారితో పాటు వారి బంధువులు, కుటుంబసభ్యులు, బినామీల ఇళ్లపై ఏసీబీ డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్‌ ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బంది సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ మొత్తం 23 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్లు చెదిరే బంగారు, వజ్రాభరణాలు దొరికాయి. ఈదాడుల్లో విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌నగరాల్లో ఖరీదైన ఆస్తులు వెలుగుచూశాయి. వీటిలో అత్యధిక శాతం ఆస్తులు నల్లూరి వెంకట శివప్రసాద్‌ భార్య చింతమనేని గాయత్రి పేరిటే ఉన్నాయి. శివప్రసాద్‌, గాయత్రిలు గొల్ల వెంకట రఘుకు బినామీలుగా వ్యవహరించినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. ఆ క్రమంలోనే గన్నవరంలోని భార్గవినగర్‌లోని శివప్రసాద్‌ ఇంట్లోని సోదాల్లోనే గుట్టల కొద్దీ బంగారు, వజ్రాభరణాలు, లక్షల విలువైన నోట్ల కట్టలు బయటపడ్డాయి.

25ap-main1b.jpg

సోదాలు నిర్వహించింది: 
ఏసీబీ విశాఖపట్నం రేంజి, సీఐయూ విభాగం అధికారులు 
నిందితులైన అధికారులు: 
1. గొల్ల వెంకట రఘు, డైరెక్టర్‌, టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ 
2. నల్లూరి వెంకట శివప్రసాద్‌, జూనియర్‌ టెక్నికల్‌ అధికారి, ఇంజినీరింగ్‌ విభాగం, విజయవాడ నగరపాలక సంస్థ.

25ap-main1c.jpg

ఎక్కడెక్కడ తనిఖీలు నిర్వహించారంటే: 
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరు, తూర్పుగోదావరి, చిత్తూరు, హైదరాబాద్‌ జిల్లాల పరిధిలో, మహారాష్ట్రలోని షిరిడిలో.

గొల్ల వెంకట రఘు పేరిట గుర్తించిన ఆస్తుల పుస్తక విలువ: 
రూ.4.06 కోట్లు

నల్లూరి వెంకట శివప్రసాద్‌, ఆయన భార్య చింతమనేని గాయత్రి, కుటుంబ సభ్యులు, వారి కంపెనీల పేరిట గుర్తించి ఆస్తుల పుస్తక విలువ: 
రూ.17.12 కోట్లు 
వీరి ఆస్తుల మొత్తం మార్కెట్‌ విలువ: 
రూ.500 కోట్లుగా అంచనా

Posted

Ap shinning.

Cbn okkadey clean. Assalu corruption spelling kooda telvad. Migitha andaru dongaley. Cbn kastanni vrudha chesthunaru...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...