Jump to content

Spyder Official Review


Recommended Posts

Posted

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా , దేశంలో టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన మురుగదాస్ దర్శకత్వంలో ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ లు నిర్మించిన స్పైడర్ దసరా కానుక గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్న ఈ సినిమాపై అటు మహేష్ అభిమానుల్లో ఇటు ఫిలిం ఇండస్ట్రీ లో భారీ అంచనాలే ఉన్నాయి. స్పైడర్ ఈ అంచనాలు అందుకుందా.. చూద్దాం. ఈసినిమా కథ ఏంటి అంటే..?

 

కథ:

శివ (మహేష్ బాబు ) ఇంటలిజెన్స్ ఆఫీసర్ . హైదరాబాద్ నగరంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. భరత్, భైరవుడు( ఎస్.జే.సూర్య) అనే అన్నదమ్ములు ప్రజల్లో భయాందోళనలు కలిగించడానికి ఈతరహా ఘటనలకి పాల్పతుంటారు. ఇంటలిజెన్స్ ఆఫీసర్ అయిన శివ ఈ హింసని ఎలా ఆపారు, విలన్స్ ని ఎలా పట్టుకున్నారు అనేది మిగతా కథ.

ఎలా తీసారు?

మహేష్ బాబు ఇంత రొటీన్ సాదా సీదా కథని ఒప్పుకోవడానికి కారణం కేవలం మురుగదాస్ . మురుగదాస్ పై ఉన్న నమ్మకం, ప్రేక్షకులకి గ్రాండ్ స్టైలిష్ విజువల్ ఫీస్ట్ ఇస్తే బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని నమ్మడం వల్లే మహేష్ ఈ సినిమా చేసి ఉండాలి. అయితే మహేష్ తన స్టయిల్ చూపించాలన్నా, విజువల్ ఎఫెక్ట్ వాళ్ళు ఎఫెక్టివ్ విజువల్స్ ఇవ్వాలన్నా ప్రేక్షకులని కట్టిపడేసే సన్నివేశాలు ఉండాలి. దురదృష్టవశాత్తూ ఈ స్క్రిప్ట్ లో అవి లోపించాయి. రొటీన్ కథలే అయినా ఎమోషన్స్, పర్ ఫెక్ట్ స్క్రీన్ ప్లే లతో ఎన్నో హిట్స్ కొట్టిన మురుగదాస్, మహేష్ విషయంలో అన్యాయం చేసారు. కథలో ప్రేక్షకులని ఉత్కంఠ కి గురిచేసే సీన్స్ కానీ, అబ్బా ఏం చేసార్రా అని ఆశ్చర్యపరిచే సీన్స్ కానీ నాలుగుకి మించి లేవు. చాలా ఫ్లాట్ గా, రొటీన్ గా, మలుపులు లేకుండా సాగిన ఈ కథని మహేష్ తన స్టైల్ తో, ఎస్ జే సూర్య కాసింత నటనతో, నిర్మాతలు తెరపై కనిపించే భారీ ఖర్చుతో కాస్త చూడబుల్ గా మార్చారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ కు పెద్దగా స్కోప్ లేదని ఆడియో ఫంక్షన్ లోనే అందరికీ అర్థం అయింది. ఇక ప్రియదర్శి ఓకే. విలన్ గా ఎస్.జె.సూర్య పరవాలేదని పించాడు. ఎందుకంటే తనకి గొప్ప సీన్స్ ఏమీ పడలేదు. హారిస్ జయరాజ్ సంగీతం ఇచ్చిన రెండు పాటలు , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్లే ప్రేక్షకులు సినిమాకి డిటాచ్ కాకుండా చూడగలిగారు. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు , కొన్ని సీన్స్ లో తన పనితనం మనల్ని కట్టిపడేస్తుంది.

ఎలా చేసారు?

హీరో మహేష్ బాబు కి తన టాలెంట్ చూపించే సీన్స్ ఏమీ లేవు కాబట్టి ఓకే అనిపించాడు.
ఎస్ జే సూర్య విలన్ గా పరవాలేదని పించాడు.
రకుల్ ప్రీత్ అందంగా ఉంది, పాటల్లో మరింత బాగుంది.

ప్లస్ పాయింట్స్:

స్టైలిష్ టేకింగ్
విజువల్ ఎఫెట్స్ భారీగా ఉపయోగించిన రెండు సీన్స్

మైనస్ పాయింట్స్:

కథలో కొత్తదనం లేకపోవడం
స్క్రీన్ ప్లే లో మురుగదాస్ తరహా మ్యాజిక్ లేకపోవడం

ఫైనల్ గా చెప్పాలి అంటే.. మహేష్ కోసం ఒకసారి చూడొచ్చు

 

Posted

Unfortunately it's a very shallow script that's low on emotion #sypder . Below avg characterization for both protagonists & antagonist !!

There is absolutely 0 plot or twist to reveal #SPYDER .am returning my tickets for Thursday. Watching once is more than enough for this plot

 

 

 

Posted

#Spyder 27$ Bokka😭😭. I don’t be this active on Twitter but, after losing my moneyI want to show my frustration.

Posted
6 minutes ago, ArjunReddy_ said:

Distributor has to recover around 3.5M+ with these negative reviews..this is why NTR opposed critics and Mahesh supported them #SPYder

@3$% vaadidi em poindi ani le 

bob previous record 70crs loss in one year record mala break aipodda ee debba to

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...