ye maaya chesave Posted September 28, 2017 Report Posted September 28, 2017 కథ-కథనం - విశ్లేషణ: మనుషులని చంపేసి.. ఆ శవాల వద్ద వాళ్ళ ఆత్మీయులు ఏడుస్తుంటే చూసి ఆనందపడే ఒక సైకో విలన్... అసలు చావు వరకు వెళ్లకుండా ప్రమాదం జరిగే ముందే మనుషులని కాపాడే ఆశయం కలిగిన హీరో.. స్థూలంగా వీళ్లిద్దరి ఐడియాలజీ మధ్య క్లాష్ నే ఈ సినిమా ప్రధాన కధగా చెప్పుకోవచ్చు. ఫస్టాఫ్ లో ప్రధాన కథలోకి అడుగు పెట్టే ముందు హీరో ఇంట్రో, అతని ఆశయం గురించి ఎస్టాబ్లిష్ చేయడం అనేది చాలా సింపుల్ గా కానిచ్చేశాడు. ఐతే అతను చేసే సాహసాలు అన్ని మొదట పాటలోనే చూపించేయడం తో అంత కిక్ లేకుండా పోయింది. ఆ తరువాత రకుల్ తో రొమాన్స్ ట్రాక్ కూడా ఒకే ఒకే .. ఆలా కాస్త సాధారణంగా వెళ్తున్న ఫస్టాఫ్ కి జంట హత్యల ఉదంతం తోటే చలనం వస్తుంది. ఆ పై హీరో ఇన్వెస్టిగేషన్ నేపధ్యం లో వచ్చే భైరవుడి ఫ్లాష్ బ్యాక్ తో విలన్ పైశాచికత్వాన్ని ఒళ్ళు గగుర్పొడిచే రేంజ్ లో ఎస్టాబ్లిష్ చేశాడు. దానికి దీటుగా హీరో విలన్ నేపధ్యాన్ని ఛేదించి,అతడికే సవాల్ విసిరే సీన్ తో ఆసక్తికరంగా ముగుస్తుంది ఫస్టాఫ్. ఇక హీరో-విలన్ మధ్య గేమ్ మరింత రంజుగా ఉండబోతుంది అన్న ఆశలు రేపుతుంది. ఆ అంచనాలని అందుకుంటూనే సెకండాఫ్ స్టార్ట్ అవుతుంది. హీరో తల్లిని కాపాడి విలన్ ని ఆత్మరక్షణలోకి నెట్టే ఎపిసోడ్ బాగా వచ్చింది. విలన్ ఎక్కడ దాక్కున్నాడో ట్రాక్ చేసే ఎపిసోడ్ లో కొందరు ఆడవాళ్ళ సాయం తో హీరో వేసే ప్లాన్ అబ్బో అనిపించినప్పటికీ ఆ టెంపో మైంటైన్ కాకుండా సాగదీయడం వల్ల ఆకట్టుకోలేకపోయింది. ఇక్కడే మురుగదాస్ పట్టు కోల్పోయాడు. హీరో-విలన్ మధ్య గేమ్ స్టార్ట్ అయిపోయాక వాళ్లిద్దరూ సై అంటే సై అనేలా సీన్స్ ఉండాలి కానీ కథనం నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాల్సిన దశలో కూడా హీరో ని కుర్చీ,కంప్యూటర్ ముందే కట్టేయడం తో పంచ్ మిస్ అయిపోయింది. కనీసం విలన్ ని అరెస్ట్ చేసిన తరువాత అయినా అతని ప్లాన్ ఏంటో తెలుసుకుని హీరో షాక్ ఇవ్వడం లాంటి ఒక్క సీన్ కూడా లేదు,విలన్ అనుకున్న ప్రతిదీ జరిగిపోతుంది. ఆ తరువాత ప్రీ క్లైమాక్స్ లో కొండ రాయి దొర్లే ఎపిసోడ్, క్లైమాక్స్ లో హాస్పిటల్ లో విలన్ వల్ల జరిగే విధ్వంసం ఏవి హీరో జరగకుండా ఆపలేకపోవడం సినిమాని పూర్తిగా నీరు గార్చేసింది. అసలు విలన్ పైశాచికత్వం ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం లో అతను తలపెట్టే ప్రమాదాలు అన్నీ నాచురల్ డిజాస్టర్స్ తరహాలో ప్లాన్ చేసేసాడు దర్శకుడు.వాటిని ఆపడానికి కానీ, డామేజ్ రికవరీ కి కానీ హీరో బలం సరిపోకపోవడం అనేది మింగుడుపడని అంశం.ఈ మిస్ క్యాల్క్యులేషన్ ని బాలన్స్ చేయడానికే మురుగదాస్ పరిచయం లేని మనిషికి ఏమి ఆశించకుండా చేసే సహాయమే మానవత్వం అనే మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నించినట్టు ఉన్నాడు. ఐతే ఆ మెసేజ్ సినిమా అయిపోయాక మొక్కుబడిగా చెప్పించే కంటే, ఆ హాస్పిటల్ ఎపిసోడ్ వద్దే హీరో జనాల్లో చైతన్యం తీసుకొచ్చి విలన్ పధకాన్ని తిప్పికొట్టినట్టు చూపించి ఉంటే తన ఉద్దేశ్యానికి సరైన న్యాయం జరిగి ఉండేది. సామాజిక అంశాలకు లార్జర్ థెన్ లైఫ్ హీరో/సన్నివేశాలు జతపర్చి ఆకట్టుకునే మురుగదాస్ ఈ సారి తనదైన ముద్ర వేయలేకపోయాడు. మహేష్-మురుగదాస్ కాంబినేషన్ కి ఇది ఆర్డినరీ అవుట్పుట్ అనే చెప్పాలి. నటీనటులు: మహేష్ తన వరకు పాత్రకు పూర్తి న్యాయం చేసాడు, ఎప్పటిలాగే ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ ఒకే. విలన్ గా ఎస్ జె సూర్య నటన చాలా బాగుంది. ఆ స్మైల్, ఎక్స్‌ప్రెషన్స్ అసలు అదరగొట్టేశాడు. ఇక అతని చిన్నప్పటి పాత్ర చేసిన పిల్లాడు ఎవరో కానీ అతను కూడా అదరగొట్టేశాడు. ప్రియదర్శి,భరత్, దీపా రామానుజం,జయప్రకాష్ తదితరులు ఒకే. సాంకేతిక వర్గం : కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్/గ్రాఫిక్స్ వర్క్ ముఖ్యమైన సన్నివేశాల్లో సరైన ఔట్పుట్ ఇవ్వలేదు. హరీష్ జయరాజ్ సంగీతం లో పాటలు పరవాలేదు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్బ్. రేటింగ్: 5.5/10 Quote
Android_Halwa Posted September 28, 2017 Report Posted September 28, 2017 dongalu padda aaru nelalaki kukka morigithe....yadadi ellinaka policeollu vachinaranta... Quote
BaabuBangaram Posted September 28, 2017 Report Posted September 28, 2017 7 minutes ago, Android_Halwa said: dongalu padda aaru nelalaki kukka morigithe....yadadi ellinaka policeollu vachinaranta... aayana eppudu inthe cinima release ayyaka two days tharwatha review istharu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.