ye maaya chesave Posted October 1, 2017 Report Posted October 1, 2017 చిత్రం: ‘మహానుభావుడు’ నటీనటులు: శర్వానంద్ - మెహ్రీన్ కౌర్ - వెన్నెల కిషోర్ - నాజర్ - కళ్యాణి నటరాజన్ - ఆనంద్ - జబర్దస్త్ వేణు - భద్రం తదితరులు సంగీతం: తమన్ ఛాయాగ్రహణం: నిజార్ షఫి నిర్మాతలు: వంశీ - ప్రమోద్ కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: మారుతి కథ: ఆనంద్ (శర్వానంద్) అతి శుభ్రత అనేది బలహీనతగా మారిపోయే ఓసీడీ అనే డిసార్డర్ తో బాధపడే కుర్రాడు. అలాంటి కుర్రాడు.. తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న మేఘన (మెహ్రీన్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతణ్ని ప్రేమిస్తుంది .ఐతే ముందు ఆనంద్ బలహీనతను తేలిగ్గానే తీసుకున్న మేఘనకు తర్వాత దాని తీవ్రత అర్థమవుతుంది. దీంతో అతణ్ని అసహ్యించుకుని దూరంగా వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఈ పరిస్థితుల్లో తన ప్రేమను గెలిపించుకోవడానికి ఆనంద్ ఏం చేశాడన్నదే మిగతా కథ. కథనం - విశ్లేషణ: కధగా చూసుకుంటే "మహానుభావుడు" సినిమా "భలే భలే మగాడివోయ్" ని గుర్తుకు తెస్తుంది. అక్కడ మతిమరుపు ఐతే ఇక్కడ అతి శుభ్రత. కాకపోతే అక్కడ అతని బలహీనతని దాచిపెట్టే క్రమంలో కామెడీ పండిస్తే ఇక్కడ అతి శుభ్రత అనే లోపాన్ని చూపిస్తూనే ఎంటర్టైన్ చేయాలి. ఆ ప్రయత్నం లో మారుతి చాలా వరకు సక్సెస్ అయ్యాడు. సినిమా అంతా సింగిల్ థ్రెడ్ మీదే నడపడం అన్నది అంత తేలికైన పని కాదు. హీరో పరిచయం దగ్గరనుంచి అతడి ఆఫీస్ సన్నివేశాలు, హీరోయిన్ తో ప్రేమ వ్యవహారం అన్నిట్లో అతని బలహీనత చుట్టూ కధని నడిపించి వీలైనంత ఎంటర్టైన్ చేశాడు దర్శకుడు.దానికి థమన్ సంగీతం తో పాటు విజువల్స్ కూడా తోడై మరింత అలరిస్తాయి,ముఖ్యంగా టైటిల్ సాంగ్ చిత్రీకరణ ఆకట్టుకుంటుంది. తన తల్లి కి జ్వరం వచ్చిందని ఆమె చేతి ముద్దనే వద్దన్న సీన్ లొనే హీరో బలహీనత ఏ స్థాయిలో ఉందొ చూపించిన దర్శకుడు ఇంటర్వెల్ వద్ద ఒక షాకింగ్ సిట్యుయేషన్ లో హీరో చేతులు ఎత్తేసినట్టు చూపించి కాస్త సీరియస్ టచ్ ఇచ్చి ఆసక్తిని రేకెత్తిస్తాడు. ఇక సెకండాఫ్ లో సీన్ ఊరికి షిఫ్ట్ అయ్యాక ఆ బ్యాక్ డ్రాప్ అంతా కాస్త రొటీన్ అనిపించినా, వెన్నెల కిశోర్ రంగంలోకి దిగాక మళ్ళీ ఎంటర్టైన్మెంట్ బాట పడుతుంది సినిమా. శర్వానంద్-వెన్నెల కిశోర్ ఒకరి మీద ఒకరితో పాటు అవతలి వాళ్ళ మీద వేసే పంచ్ లు బాగా వర్కౌట్ అయ్యాయి.ఇక క్లైమాక్స్ లో రెండు గ్రామాల మధ్య కుస్తీ పోటీల బ్యాక్ డ్రాప్ పాతకాలం నాటిది అనిపించినా హీరో రియలైజ్ అయ్యే సిట్యుయేషన్ బాగుంది. అలాగే చివరి సన్నివేశం లో వచ్చే కొసమెరుపు కూడా. అతి శుభ్రత అనే కాన్సెప్ట్ కి రిలేటబిలిటీ కొంచెం తక్కువ ఉండడం,అలాగే హీరో ప్రేమ ని గెలిచేందుకు బలమైన కాన్ఫ్లిక్ట్ లేకపోవడం సినిమా కి మైనస్ లు అయినా, ముందుగానే చెప్పుకున్నట్టు మారుతి తాను సెట్ చేసుకున్న జోన్ లో చాలావరకు ఎంటర్టైన్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. నటీనటులు: ఆనంద్ పాత్రలో శర్వానంద్ ఒదిగిపోయాడు. తనదైన కామెడీ టైమింగ్ తో అలరించాడు. హీరోయిన్ మెహ్రీన్ సినిమాకి మరో ప్లస్ పాయింట్. అందం తో పాటు ఆమె నటన కూడా బాగుంది. వెన్నెల కిశోర్ మరోసారి తన కామెడీ తో అలరించాడు. నాజర్ మామూలే. భద్రం,ఇతర నటీనటులు ఒకే. సాంకేతిక వర్గం: కెమెరా వర్క్ చాలా బాగుంది. యువీ క్రియేషన్స్ అన్ని సినిమాల్లానే విజుఅల్స్ రిచ్ గా ఉండి ఆకట్టుకుంటాయి. ఇక థమన్ సంగీతం కూడా సినిమాకి ప్లస్ ఐంది. సాంగ్స్ సినిమాలో బాగా కుదిరాయి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. రేటింగ్: 6/10 Quote
TampaChinnodu Posted October 1, 2017 Report Posted October 1, 2017 heroine worst action, saran babu laa ichindi expressions. Quote
Picha lite Posted October 1, 2017 Report Posted October 1, 2017 Greatandhra nunchi review denkochi ikada vestav, em vayya ne review valla use. that too movie release ayina 4 days ki vestav anni reviews ni collect chesi. Quote
ARYA Posted October 1, 2017 Report Posted October 1, 2017 10 minutes ago, Picha lite said: Greatandhra nunchi review denkochi ikada vestav, em vayya ne review valla use. that too movie release ayina 4 days ki vestav anni reviews ni collect chesi. prati movie ki vestadu tucha tappakunda papam CP gadu.. vadiley Quote
kittaya Posted October 1, 2017 Report Posted October 1, 2017 21 minutes ago, Picha lite said: Greatandhra nunchi review denkochi ikada vestav, em vayya ne review valla use. that too movie release ayina 4 days ki vestav anni reviews ni collect chesi. papam bhayya great andhra covert ikkada pani chesthunte nuvu vadhu antunave indirect gaaa papam Quote
thooch Posted October 1, 2017 Report Posted October 1, 2017 Rating 3/5 aa? Suggunda ra ayya..asalu movie lo chillar comedy adi kuda few scenes tappite em ledu.. bhale bhale magadivoy part-2 inkedo rogam toh movie teesadu...bokkalo movie..picha bore aindi.. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.