TDPROCKS Posted October 1, 2017 Report Posted October 1, 2017 ముగ్గురొచ్చారు.. ముచ్చట గొల్పారు! ఇంటర్నెట్‌డెస్క్: వెండితెరపై మనకు నచ్చిన హీరోను చూడటం ఒక సరదా అయితే.. వారు ద్విపాత్రాభినయం చేస్తుంటే చూడటం మరో ఆసక్తి. అదే కథానాయకుడు త్రిపాత్రాభినయం చేస్తే, ఆ సినిమా చూస్తున్నంతసేపు వచ్చే కిక్కే వేరు. ఏ భాషలోనైనా ఇలాంటి సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. అదీ అగ్ర కథానాయకుల సినిమాలైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులో వారి పాత్రలు ఎలా ఉంటాయి? వేషధారణ ఎలా ఉంటుందనే ఆసక్తి సగటు అభిమాని బుర్రను తొలిచేస్తుంది. తాజాగా ఇలాంటి ఫార్ములాతోనే బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నారు ఎన్టీఆర్. ఆయన త్రిప్రాతాభినయం చేసిన చిత్రం ‘జై లవకుశ’. రాశీఖన్నా, నివేదా థామస్ కథానాయికలు. బాబీ దర్శకుడు. ఈ నెల 21న విడుదలైన ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఓ ప్రత్యేక చిత్రంగా నిలిచిపోయింది. ఇదే ఫార్ములాతో గతంలోనూ కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించాయి. వాటిల్లో కొన్ని.. * నందమూరి తారక రామారావు. పరిచయం అక్కర్లేని పేరు. పౌరాణికం, జానపదం, సాంఘికం ఇలా జోనర్ ఏదైనా పాత్రలో ఒదిగిపోయి తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన స్వయంగా దర్శకత్వం వహిస్తూ త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘దాన వీర శూర కర్ణ’. తెలుగు సినీ చరిత్రలో ఎవర్‌గ్రీన్ చిత్రాలుగా చెప్పుకొనే వాటిలో ఇదీ ఒకటి. కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, కర్ణుడిగా ఆయన నటించిన తీరు, పలికిన డైలాగ్‌లు, హావాభావాలు ఎన్నిసార్లు విన్నా, చూసినా తనివి తీరదు. * కుటుంబ కథా చిత్రాల హీరో శోభన్‌బాబు త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘ముగ్గురు మొనగాళ్ళు’. తాతినేని రామారావు దర్శకుడు. 1983లో వచ్చిన ఈ చిత్రంలో శోభన్‌బాబు నటన అందర్నీ మెప్పించింది. * నేటి యువ కథానాయకులకే కాదు.. నాటి, నేటి అగ్ర కథానాయకులకు సాధ్యం కాని విధంగా సినిమాలు చేసి, ‘డేరింగ్ అండ్ డాషింగ్’ హీరో అనిపించుకున్నారు ‘సూపర్‌స్టార్’ కృష్ణ. ‘కుమార రాజా’, ‘పగపట్టిన సింహం’, ‘బంగారు కాపురం’, ‘సిరిపురం మొనగాడు’, ‘డాక్టర్ సినీ యాక్టర్’, ‘రక్త సంబంధం’, ‘బొబ్బిలిదొర’ చిత్రాల్లో ఆయన త్రిప్రాతాభినయం చేశారు. * నేటి అగ్ర కథానాయకుల్లో త్రిపాత్రాభినయంలో అలరించిన కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’. దీన్లో చిరు సరసన రోజా, నగ్మా, రమ్యకృష్ణలు నటించారు. * నందమూరి నట సింహ బాలకృష్ణ, పరుచూరి మురళి దర్శకత్వంలో త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘అధినాయకుడు’. 2012లో వచ్చిన ఈ సినిమాలో బాలయ్య తనదైన మార్కు నటనతో అభిమానులను అలరించారు. తెలుగులోనే కాదు అటు తమిళంలోనూ కమల్, సూర్య, విక్రమ్ వంటి నటులు త్రిపాత్రాభినయంలో నటించి మెప్పించారు. ఇక కమల్ నట విశ్వరూపం గురించి చెప్పేదేముంది. Quote
TDPROCKS Posted October 1, 2017 Author Report Posted October 1, 2017 Just now, samaja_varagamana said: adhinayakudu neku undi Quote
samaja_varagamana Posted October 1, 2017 Report Posted October 1, 2017 Just now, TDPROCKS said: neku undi enduku hit anala ipudu Quote
kiraak_poradu Posted October 2, 2017 Report Posted October 2, 2017 2 hours ago, samaja_varagamana said: enduku hit anala ipudu Quote
Vaampire Posted October 2, 2017 Report Posted October 2, 2017 2 hours ago, samaja_varagamana said: enduku hit anala ipudu Hit by Kada adhi. Inka theaters lo aduthundi kada Quote
Sinna_Sinna Posted October 2, 2017 Report Posted October 2, 2017 Bro Mana valla madyalo aa waste fello siru gadu endhuku bro Quote
TDPROCKS Posted October 2, 2017 Author Report Posted October 2, 2017 1 hour ago, Sinna_Sinna said: Bro Mana valla madyalo aa waste fello siru gadu endhuku bro pekallo joker undali kada bro Quote
The Warrior Posted October 2, 2017 Report Posted October 2, 2017 ee item gaadidi vere prapanchakama Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.