Jump to content

Ika Chaka Chaka: Amaravathi Constructions


Recommended Posts

Posted
అమరావతి నిర్మాణంలో కీలకం ఈ అక్టోబర్‌!
636426175277873405.jpg
  • ఓ కొలిక్కి రానున్న అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లు
  • పలు రహదారులు, మౌలిక, లేఅవుట్ల టెండర్లు ఖరారు
  • రైతుల సింగపూర్‌ ట్రిప్‌లూ ఈ నెలలోనే..!
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో ఈ నెల కీలకంగా నిలవనుంది. ఎప్పుడెప్పుడాని అమరావతి రైతులతోపాటు రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ ఫైనల్‌ మాస్టర్‌ ప్లాన్‌తోపాటు అసెంబ్లీ, హైకోర్టుల తుది డిజైన్లు ఇంచుమించుగా ఒక కొలిక్కి రావడంతోపాటు పలు కీలక పనులకు సంబంధించిన టెండర్లు అక్టోబరులో ఖరారు కానున్నాయి. అమరావతి అభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడనున్న ప్రముఖ హోటళ్లు, విద్యాసంస్థల ఏర్పాటు ప్రక్రియ కూడా రానున్న కొద్దివారాల్లో ఊపందుకోనుంది.
 
(ఆంధ్రజ్యోతి, అమరావతి)
గత కొన్ని నెలలుగా ముమ్మరంగా జరిగిన అసెంబ్లీ, హైకోర్టుల ఫైనల్‌ డిజైన్ల తయారీ ప్రక్రియ గత నెలలోనే ముగిసి, విజయదశమి రోజున వాటికి శంకుస్థాపన జరుగుతుందని ప్రభుత్వంతోపాటు సీఆర్డీయే ఉన్నతాధికారులూ భావించారు. ఇందుకు ఊతమిచ్చేలా పలు పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే సదరు డిజైన్లను రూపొందిస్తున్న మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌ కొన్ని వారాల క్రితం అందజేసిన ఆకృతులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అసంతృప్తి వ్యక్తపరచి, స్వయంగా తానే ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తానని ప్రకటించడం తెలిసిందే. పైగా ఐకానిక్‌ భవంతులైన అసెంబ్లీ, హైకోర్టులు రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తున్న విధంగా అత్యద్భుతంగా రూపొందేలా చూడడంలో చలనచిత్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తోడ్పాటును తీసుకోవాల్సిందిగా సీఆర్డీయేను ఆదేశించడమూ విదితమే. ఆ ప్రకారం సుమారు 2 వారాల క్రితం రాజమౌళి అమరావతికి వచ్చి, సీఎంతో సమావేశమై, ఆయన అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.
 
తదుపరి దశగా ఈ దిగ్దర్శకుడు ఈ నెల 2వ వారంలో సీఆర్డీయే ఉన్నతాధికారులతో కలసి లండన్‌కు వెళ్లి, నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఆ తర్వాత చంద్రబాబుతోనూ సమావేశమవుతారు. ఈ మధ్య వ్యవధిలోనూ వీరందరి మధ్య ఎప్పటికప్పుడు డిజైన్లపై ముమ్మర సంప్రదింపులు జరగబోతున్నాయి. అనంతరం ఈ నెల 24, 25 తేదీల్లో సీఎం లండన్‌కు వెళ్లి, ఫోస్టర్‌తో చర్చలు జరపడం ద్వారా అసెంబ్లీ, హైకోర్టుల తుది ఆకృతులను దాదాపుగా ఒక కొలిక్కి తేనున్నారు. తదుపరి వాటిపై అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకుని, తదనుగుణంగా కొన్ని మార్పుచేర్పులతో ఫైనల్‌ డిజైన్లను ఆమోదించనున్నారు.
 
వారం, 10 రోజుల్లో రోడ్ల టెండర్లు..
అమరావతి రూపకల్పనలో అత్యంత కీలక పాత్ర పోషించనున్న పలు రహదారులకు సంబంధించిన టెండర్లను 10 రోజుల్లోపు ఖరారు చేయనున్నారు. ఇప్పటికే టెండర్లు ఖరారై, పనులు జరుగుతున్న సీడ్‌ యాక్సెస్‌, ఇతర ప్రయారిటీ రోడ్లకు ఇవి అదనం. వీటిని కలిపితే రాజధానిలో మొత్తంమీద సుమారు 365 కిలోమీటర్ల పొడవైన దాదాపు అన్ని ప్రాధాన్య రహదారులకు సంబంధించిన టెండర్‌ ప్రక్రియ అంతా పూర్తయినట్లవుతుంది. ఇది జరిగేసరికి, వానలు దాదాపుగా తగ్గుముఖం పడతాయి కాబట్టి, టెండర్లు దక్కించుకున్న నిర్మాణ సంస్థలు కాలయాపన లేకుండా పనులు చేపట్టనున్నాయి. బిడ్ల ఖరారు తర్వాత 12 మాసాల్లో రహదారులను పూర్తి చేయాల్సి ఉన్నందున వాటి నిర్మాణం ఈ నెలలోనే ప్రారంభమయ్యేందుకు అవకాశం ఉంది.
 
15కల్లా ఎల్పీఎస్‌ లేఅవుట్ల టెండర్లు..
రాజధానికి పూలింగ్‌ ప్రాతిపదికన భూములిచ్చిన వారికి బదులుగా కేటాయించిన రిటర్నబుల్‌ ప్లాట్లున్న ఎల్పీఎస్‌ లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించిన టెండర్లన్నీ కూడా ఈ నెల 15వ తేదీకల్లా ఖరారవుతాయని చెబుతున్నారు. ప్రస్తుతం పెగ్‌మార్కింగ్‌ పనులు జరుగుతున్న వివిధ లేఅవుట్లలో ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ.14,000 కోట్ల అంచనా వ్యయంతో పిలిచిన టెండర్లు రానున్న 2 వారాల్లో ఖరారవనున్నాయి.
 
సింగపూర్‌ ట్రిప్‌లూ ..
అర్బన్‌ ప్లానింగ్‌లో ప్రపంచంలోనే పేరొందిన సింగపూర్‌ సహాయ సహకారాలతో అమరావతి రూపొందనున్న క్రమంలో రాజధాని రైతులు ఆ దేశాన్ని ప్రత్యక్షంగా తిలకిస్తే, భవిష్యత్తులో మన క్యాపిటల్‌ సిటీ ఏ విధంగా రూపొందబోతోందనే విషయంపై ఒక అంచనాకు వస్తారన్న అభిప్రాయంతో సీఆర్డీయే వారిని సింగపూర్‌ యాత్రకు పంపనుండడం తెలిసిందే. మొత్తం వందమందిని 3 బృందాలుగా సింగపూర్‌కు పంపనున్న నేపథ్యంలో తొలి బృందం ఈ నెల 22- 26 తేదీల మధ్య అక్కడికి వెళ్లనుంది.
 
ఇవి కూడా..
  • రాజధానికి ఆకర్షణ పెంచనున్న శాఖమూరు రీజియనల్‌ పార్క్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, ఎన్టీఆర్‌ విగ్రహాలతో కూడిన భారీ ఉద్యానవనాలు, కృష్ణానదిపై గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌- పవిత్ర సంగమ ప్రదేశాన్ని కలుపుతూ నిర్మించదలచిన ఐకానిక్‌ బ్రిడ్జితోపాటు సీడ్‌ యాక్సెస్‌ రహదారి, ఇతర రోడ్ల వెంబడి అభివృద్ధి పరచదలచిన గ్రీనరీ ఏర్పాటు ఇత్యాదివన్నీ కూడా ఈ నెలలో ఒక క్రియాశీలక రూపం సంతరించుకోనున్నాయి.
  • అమరావతిలో తమ శాఖలను ఏర్పాటు చేయాలని ఆశిస్తున్న పలు సుప్రసిద్ధ హోటల్‌ గ్రూపులు, విద్యాసంస్థల యాజమాన్యాలతో సీఆర్డీయే జరుపుతున్న చర్చలు కూడా ఈ మాసంలోనే ఒక కొలిక్కి రానున్నాయి.
  • అమరావతిలోని స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి బాధ్యతలు చేపట్టిన సింగపూర్‌ కన్సార్షియం సదరు కార్యక్రమాలను కూడా ఈ నెలలోనే మరింత ముందుకు
  • తీసుకువెళ్లే అవకాశం ఉంది.
  • గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌, ఎల్పీఎస్‌ లేఅవుట్ల అభివృద్ధి పనులు ఇత్యాది వాటిని మరింత సమర్ధంగా పర్యవేక్షించేందుకు వీలుగా రాజధానిలో సుమారు రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన సీఆర్డీయే ప్రధాన కార్యాలయ నిర్మాణపనులు కూడా ఈ మాసంలోనే మొదలవనున్నాయి.
  • మరొకపక్క.. రాజధాని నిర్మాణానికి అవసరమైన వేలాది కోట్ల రూపాయల నిధులను వివిధ మార్గాల్లో సమీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో సీఆర్డీయే చేస్తున్న ప్రయత్నాలు సైతం ఈ అక్టోబర్‌లోనే మరింత ముందడుగు వేయనున్నాయి. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, ఇతర ప్రాధాన్య రోడ్లలో కొన్నింటికి అడ్డంకిగా నిలిచిన భూమిని సేకరించే ప్రక్రియ కూడా రానున్న కొద్ది వారాల్లో ఊపందుకోనుంది.
Posted
16 minutes ago, Kontekurradu said:

LOl nAKKA 

bala bokka

Posted
46 minutes ago, mahesh1 said:

bala bokka

please dont comment on our Balayya 

JAI BALAYYA 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...