TampaChinnodu Posted October 5, 2017 Report Posted October 5, 2017 అనంతలో అవినీతి చేప! చేసేది చిరుద్యోగం.. అక్రమాస్తులు రూ. 50 కోట్లు అనిశా వలలో ఐసీడీఎస్ సీనియర్ అసిస్టెంట్ ఈనాడు - అనంతపురం చేసేది చిరుద్యోగమైనా రూ.కోట్ల అక్రమాస్తులు కూడబెట్టిన ఓ అవినీతి తిమింగలం అనంతపురం జిల్లాలో అవినీతి నిరోధక శాఖకు పట్టుబడింది. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో(ఐసీడీఎస్) సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కోవూరు వెంకట నారాయణరెడ్డి నివాసం, బంధువుల ఇళ్లలో అనిశా బుధవారం జరిపిన సోదాల్లో పెద్దఎత్తున అక్రమ ఆస్తులు వెలుగుచూశాయి. నారాయణరెడ్డి ప్రస్తుతం పెనుకొండ ఐసీడీఎస్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్. ఆయనపై పలు ఫిర్యాదులు ఉండటంతో అనిశా అధికారులు కొంత కాలంగా నిఘా ఉంచారు. తాజాగా అనంతపురం జిల్లా అనిశా ఇన్‌ఛార్జి డీఎస్పీ జయరామరాజు నేతృత్వంలో బుధవారం ఉదయం నుంచి నారాయణరెడ్డితోపాటు, ఆయన తల్లి లక్ష్మీనారాయణమ్మ, కుమారుడు నారపరెడ్డి ఇళ్లతోపాటు, నార్పల మండలం నడిమిదొడ్డిలోని వియ్యంకుడు పుట్లూరు రామకృష్ణారెడ్డి తదితరుల ఇళ్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. నారాయణరెడ్డికి రెండు ఇళ్లు, భార్య పద్మావతి పేరిట మూడు ఇళ్లు, నాలుగు ఇంటి స్థలాలు, నాలుగు చోట్ల ఎనిమిదిన్నర ఎకరాల పొలం; కుమారుడు నారపరెడ్డి పేరిట అనంతపురంలోని శ్రీకంఠం కూడలిలో వాణిజ్య సముదాయం, చిత్తూరు జిల్లా పాకాల మండలం దామలచెరువులోని ఇంటి స్థలం, అనంతపురం గ్రామీణ పరిధిలో 1.25 ఎకరాల భూమి, కోడలు నవీన పేరిట ధర్మవరంలో ఇల్లు, అనంతపురం గ్రామీణంలో ఇంటి స్థలం ఉన్నట్లు గుర్తించారు. నారాయణరెడ్డితోపాటు, ఆయన తల్లి ఇంటిలో కలిపి కేజీన్నర బంగారం గుర్తించారు. ఇందులో 700 గ్రాములు బ్యాంకులో కుదువపెట్టారు. 1.2 కిలోల వెండి వస్తువులు, రూ.2.32లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆదాయానికి మించి భారీగా ఆస్తులున్నట్లు తేలడంతో అనిశా అధికారులు నారాయణరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని అరెస్ట్ చేసి, గురువారం కర్నూలులోని అనిశా న్యాయస్థానంలో హాజరుపరుస్తామని డీఎస్పీ జయరామరాజు ‘ఈనాడు’కు తెలిపారు. రూ.కోట్ల అక్రమాస్తులతో అనిశాకు చిక్కిన నారాయణరెడ్డి..పేరుకే చిరుద్యోగి. తెరవెనుక ఓ పెద్ద గుత్తేదారులా దందా నడుపుతున్నాడు. నిజానికి ఈయన ఐసీడీఎస్‌లో 1985లో అటెండరుగా చేరాడు. చాన్నాళ్లకు జూనియర్, ఆపై సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందాడు. ప్రధానంగా కోడిగుడ్లతో పాటు చౌకదుకాణాలకు కందిపప్పు సరఫరా విషయంలో పదేళ్లుగా చక్రం తిప్పుతున్నాడు. అసలైన గుత్తేదారుల స్థానంలో ఇతడే కొందరితో కలిపి దందా నడిపిస్తుంటాడు. జిల్లాలోని 17 ప్రాజెక్టుల పరిధిలో 5,200 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, వీటికి నెలకు 50లక్షల వరకు కోడిగుడ్లు సరఫరా అవుతుంటాయి. ఈ వ్యవహారంలో నారాయణరెడ్డి అంతా తానై కథ నడిపిస్తున్నాడు. అంగన్వాడీలకు చిన్నసైజు గుడ్లను సరఫరా చేయటం, నెలకు సగం గుడ్లే అందజేయడం వంటి అక్రమాలతో రెండుచేతులా ఆర్జిస్తున్నాడు. అక్రమాలన్నీ ఐసీడీఎస్‌లో అన్నిస్థాయుల వారికీ తెలిసినా ఎవరికి ముట్టాల్సింది వారికి ముడుతోండటంతో ఎవరూ పట్టించుకోలేదు. ఎవరైనా ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తే నారాయణరెడ్డి తన పలుకుబడితో వారిని వేధింపులకు గురిచేయిస్తుంటాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన తన అవినీతి సామ్రాజ్యాన్ని కుమారుడి సాయంతో పక్క జిల్లాలకూ విస్తరించినట్లు సమాచారం. Quote
TampaChinnodu Posted October 5, 2017 Author Report Posted October 5, 2017 గుడ్డులోనూ గుంజుడు..! స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఐసీడీఎస్‌లో అవినీతి తీరిది ఈనాడు, అమరావతి: పేరుకి స్త్రీ, శిశు సంక్షేమం.. అందించేది పౌష్టికాహారం. ఏముంటుందిలే అంగన్‌వాడీ కేంద్రాల్లో అనుకుంటారంతా.. కానీ, అవే కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందజేయాల్సిన పౌష్టికాహారం రూపేణా అక్రమార్కులు రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. రెవెన్యూ, పోలీసు, పురపాలన ఇలా కొన్ని శాఖల్లోనే తప్ప అంగన్‌వాడీల్లో ఏం ఉంటుందిలే తినడానికి అన్న భావన చాలామందిలో ఉంటోంది. నిఘా అమలు, ఏసీబీ వంటి సంస్థలు కూడా ఈ శాఖపై పెద్దగా దృష్టి పెట్టే పరిస్థితి లేకపోవడానికి కూడా ఇదే కారణమన్న వాదనా ఉంది. కానీ, సమగ్ర శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్)లో ఒక్క గుడ్డు సరఫరాలోనే రూ.కోట్లు దండుకుంటున్నారన్న చేదు నిజం బుధవారం అనంతపురంలో బయటపడింది. ఆ శాఖ ఉద్యోగి నారాయణరెడ్డి ఇళ్లపై ఏసీబీ దాడులు, వెలుగుచూసిన రూ.కోట్ల అక్రమాస్తులతో అది తేటతెల్లమైంది. చాప కింది నీరులా సాగిపోతున్న అక్రమాల్లో ఈ సంఘటన ఓ ఉదాహరణ మాత్రమే. గుడ్డుతో దోచేస్తున్నారిలా... ఐసీడీఎస్‌లో పంపిణీ చేస్తున్న ఆహారంలో గుడ్డును ప్రధాన ఆదాయ వనరుగా ఈ శాఖ ఉద్యోగులు ఎంచుకుంటున్నారు. పేరుకే రాష్ట్రస్థాయిలో ఇ-ప్రొక్యూర్‌మెంట్ పేరుతో గుడ్ల సేకరణ అంటున్నారు. క్షేత్రస్థాయిలో వీటిని సరఫరా చేస్తోంది మాత్రం ఈ శాఖలోని కొందరు ఉద్యోగుల బినామీ సంస్థలు, మరికొన్నిచోట్ల బయట సంస్థల్లోని ఉద్యోగులే. అనంతపురం, విశాఖ, గుంటూరులో పనిచేస్తున్న నలుగురైదుగురు ఉద్యోగులు వారి బినామీ సంస్థల ద్వారానే అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్లను సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షించే ప్రాజెక్టు అధికారులతోనూ వీరికి సంబంధాలుంటున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఉన్నా లేకున్నా ఒక్కోచోటా 50మంది(గరిష్ఠ సంఖ్య ఇది) పిల్లలు, 20 మంది వరకు బాలింతలు, గర్భిణులు గుడ్లు, ఆహారాన్ని తీసుకుంటున్నట్లు రికార్డులు సిద్ధం చేసేస్తున్నారు. పరిశీలించి ధ్రువీకరించాల్సిన ప్రాజెక్టు అధికారులు మమ అనేస్తున్నారు. ఇలా మింగేసిన గుడ్లకు సరిపడా మొత్తాన్ని ఆయా ప్రాజెక్టు అధికారులు, సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్న ఆ నలుగురైదుగురు ఉద్యోగులు పంచుకుంటున్నారు. ధరలోనూ ఇదే తీరు.. గుడ్డు ధరలోనూ గోల్‌మాల్ చేస్తూ అక్రమార్కులు ప్రతీనెలా రూ.కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారు. ఏటా కొన్నికోట్ల గుడ్లు అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయాల్సి ఉంది. ఇంత పెద్దమొత్తంలో తీసుకుంటున్నపుడు సాధారణంగా అయితే బహిరంగ మార్కెట్‌లో కంటే కనీసం 30 నుంచి 40శాతం తక్కువ ధరకే వచ్చే అవకాశంఉంటుంది. కానీ, ఐసీడీఎస్‌లో సరఫరా చేస్తున్న గుడ్డుధర రూ.4పైనే ఉంటోంది. దీన్ని సైతం ఎప్పటికప్పుడు అంతర్గతంగా సవరిస్తూ, ఉత్తర్వులు సిద్ధం చేస్తూ ధర పెంచేసి చెల్లింపులు చేసేస్తున్నారు. ఒకవైపు తప్పుడు రికార్డులను సృష్టించడం ద్వారా గుడ్లు సరఫరా చేసినా, చేయకున్నా చేసినట్లు లెక్కలు చూపిస్తూ, మరోవైపు ఇలా ధరనూ పెంచేసి రూ.కోట్లలో దండుకుంటున్న పరిస్థితీ ఉంది. ఐసీడీఎస్‌లో ప్రధాన అవినీతి మార్గాల్లో... * అన్న అమృత హస్తం పథకం కింద గర్భిణులు, బాలింతలకు నెలలో 25రోజులపాటు రోజుకు ఒకటి చొప్పున గుడ్డు అందించాలి. 7 నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులకు నెలకు 8 వంతున; 3 నుంచి 6ఏళ్ల వయసు వరకు పిల్లలకు నెలకు 16 చొప్పున గుడ్లు అందజేయాల్సి ఉంది. * వీరందరికీ దాదాపు వంద శాతం పంపిణీ చేస్తున్నట్లు రికార్డులు సిద్ధంచేసి సరఫరాదారులకు చెల్లింపులు జరుపుతున్నారు.మొన్నటి వరకూ(బాలామృతం పథకం పునరుద్ధరించక ముందు దాకా) టేక్ హోం రేషన్ కింద కందిపప్పు, ఆయిల్, గుడ్లు పంపిణీ చేసేవారు. వీటిని 40శాతం మేర లబ్ధిదారులకు కూడా పంపిణీ చేసేవారు కాదన్న ఆరోపణలున్నాయి. * ప్రాజెక్టు అధికారుల కార్యాలయాల్లో ఆడిటింగ్(పీడీ కార్యాలయం నుంచి నియమిత ఉద్యోగి)కి వెళ్లినపుడు అక్కడ అవకతవకలను కప్పిపుచ్చేందుకు పర్సెంటేజీలు. * ఆయిల్ సరఫరాదారులకు అదనపు ధరలు చెల్లించిన విషయంలో కేవలం నాలుగు జిల్లాల్లోనే ముగ్గురు ప్రాజెక్టు డైరెక్టర్లు(పీడీలు), 5 పదులకుపైగా సీడీపీవోలు, మరికొందరు ఉద్యోగులు భాగస్వాములైన బాగోతం ఇటీవలే బయటపడింది, వారిలో అతికొద్దిమందిపై చర్యలు తీసుకున్నారు. * అంగన్‌వాడీ కార్యకర్తల నియామకాల సందర్భంగా నిర్వహించే ఇంటర్వ్యూల్లో పోస్టుకు ఇవ్వగలిగినవారిని బట్టి రూ.లక్షల్లో గుంజుతున్నారు. * కార్యాలయానికి సంబంధించి అదనపు ఖర్చుల పేరుతో ఇచ్చే నిధుల్లో 80శాతం మేర సంబంధిత అధికారులు, ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లోకే వెళుతోంది. పేరుకే అంతర్గత నిఘా.. స్త్రీశిశు సంక్షేమ శాఖలో అంతర్గ నిఘా విభాగం ఉన్నా దానికి పెద్దగా పనేమీ ఉండడం లేదు. ఈ విభాగం నేరుగా తనిఖీలు చేసి కేసులు నమోదు చేసే పరిస్థితీ కనిపిండడం లేదు, ఎప్పుడైనా ఫిర్యాదులు వస్తే పరిశీలన, విచారణకే పుణ్యకాలం గడచిపోతోంది, అరకొర కేసులను నమోదు చేస్తున్నారు. Quote
TampaChinnodu Posted October 5, 2017 Author Report Posted October 5, 2017 Just now, mettastar said: 50 kotlaaa kids daggara food laakoni mari. chi em bathuku man adi. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.