Jump to content

Second Kuda waste cheyyoddu: CBN


Recommended Posts

Posted
క్షణమైనా వృథా చేయొద్దు
 
 
636427696770203508.jpg
  • చకచకా రాజధాని పనులు
  • అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
  • వీఐపీ హౌసింగ్‌కు 9 నుంచి ప్రొక్యూర్‌మెంట్‌
  • రోడ్లు, ఇన్‌ఫ్రాకు 10 వేల కోట్ల సమీకరణ
  • స్టేడియం నిర్మాణానికి త్వరలో టెండర్లు
  • వాటర్‌ స్పోర్ట్స్‌కు ఇటలీ సంస్థ సంసిద్ధత
  • దశావతారాల థీమ్‌కు బోయపాటి డిజైన్లు
అమరావతి, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): రోజురోజుకూ అమరావతిపై పెరుగుతున్న ప్రజల అంచనాలకు అనుగుణంగా ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా పనులు జరపాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో సీఆర్‌డీఏ సమీక్షా సమావేశంలో ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం (ఎల్‌పీఎస్‌) లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పనపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 13 ఎల్పీఎస్‌ జోన్లలో ఐదు జోన్లను రూ.10,000 కోట్లతో హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌లో అభివృద్ధి చేస్తారు. ఇంతవరకు దేశంలో ఈ విధానంలో ఒక్క జాతీయ రహదారులను మాత్రమే నిర్మిస్తున్నారు. ఇప్పుడు తొలిసారిగా అమరావతి నగరాన్ని అభివృద్ధి పరచనున్నారు.
 
మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 49 శాతాన్ని రాష్ట్రప్రభుత్వం భరించనుండగా.. మిగిలిన 51 శాతాన్ని డెవలపర్లు భరించనున్నారు. యాన్యుటీ రీపీమెంట్‌లో ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రభుత్వం గ్యారంటీలు ఇవ్వనుంది. రాజధాని నగరంలోని 5 జోన్లలో రహదారులు, మురుగునీటి పారుదల వ్యవస్థ, విద్యుత్‌, నీరు వంటి మౌలిక వసతులను అంతర్జాతీయ ప్రమాణాలతో కల్పిస్తారు. వీటికి సంబంధించిన టెండర్లు ఈ నెల 11 కల్లా సిద్ధమవుతాయి. రూ.2383 కోట్ల వ్యయంతో 5వ జోన్‌లోని 5,174 ఎకరాలను, రూ.817 కోట్లతో నాలుగో జోన్‌లోని 1360 ఎకరాలు, రూ.3714 కోట్లతో 9వ జోన్‌లోని 6902 ఎకరాలు, రూ.2102 కోట్లతో 12వ జోన్‌లోని 7,838 ఎకరాలు, రూ.1498 కోట్లతో 12-ఏ జోన్‌లోని 3,860 ఎకరాలను అభివృద్ధి చేస్తారు. వచ్చే 2 వారాల్లో 13,000 కోట్ల విలువైన పనుల గ్రౌండింగ్‌ను జరిపేందుకు నిర్ణయించారు.
 
లండన్‌లో 3 రోజుల పర్యటన
పరిపాలనా నగరంలోని రెండు ఐకానిక్‌ భవంతులైన అసెంబ్లీ, హైకోర్టు భవంతుల తుది ఆకృతుల నిర్మాణ ప్రణాళికపై మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌తో చర్చించేందుకు సీఆర్‌డీఏ బృందం ఈ నెల 11నుంచి 13 వరకు లండన్‌లో పర్యటించనుంది. సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ భవంతుల ప్రణాళికలను ఈ నెల 12న ఫోస్టర్‌ ప్రతినిధులు సమర్పిస్తారు. అమరావతిలో చేపట్టనున్న వీఐపీ హౌసింగ్‌కు సంబంధించి ఈ నెల 9న ప్రొక్యూర్‌మెంట్‌ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ సీఎంకు తెలిపారు.
 
కీలక నిర్ణయాలివీ..
రాజధానిలోని ప్రాధాన్య రహదారుల నిర్మాణ టెండర్లలో రూ.13,000 కోట్ల విలువైన టెండర్లకు ఆమోదం తెలిపామని సమావేశానంతరం పురపాలక మంత్రి పి.నారాయణ తెలిపారు. మిగిలినవి వచ్చే 15 రోజుల్లో ఖరారు చేయాలని సీఎం ఆదేశించారని చెప్పారు. వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌, టెన్నిస్‌, టీటీ, ఫుట్‌బాల్‌, క్రికెట్‌ తదితర క్రీడలు ఆడుకునేందుకు, నృత్యోత్సవాల నిర్వహణకు అనువైన ప్రాంగణాన్ని ఒకే చోట నిర్మిస్తారు. స్పోర్ట్స్‌ సిటీలో కృష్ణానదికి అభిముఖంగా 20 ఎకరాల్లో ఈ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను నిర్మిస్తారు. హోటళ్లు, షాపింగ్‌ మాల్స్‌ను ఏర్పాటు చేసి, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్వహణకు వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని చంద్రబాబు ఆదేశించారు.
 
రెండు దశల్లో దీని నిర్మాణం ఉంటుంది. ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న పవిత్ర సంగమ ప్రదేశంలో శ్రీ వేంకటేశ్వరుని ఆకృతిలో ఆలయ శిఖర నిర్మాణానికి ప్రముఖ చలనచిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సమావేశంలో ప్రజెంటేషన్‌ ఇచ్చారు. తిరుమలేశుడి మూడు నామాలు, దానిపై ఆలయ గోపురం ఉండేలా, వాటికింద నుంచి నదీ ప్రవాహం సాగేలా ఈ నిర్మాణాన్ని ప్రతిపాదించారు. దశావతారాల థీమ్‌తో ఈ ఆలయ శిఖరాకృతికి రూపకల్పన చేసినట్లు బోయపాటి సీఎంకు వివరించారు. ఈ ఆకృతులపై ఆగమశాస్త్ర నిపుణులు, తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) పండితులతో చర్చించి, 10 రోజుల్లో తుది నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆలయ నిర్మాణానికి వైకుంఠపురం అనువైన ప్రదేశంగా అభిప్రాయపడ్డారు.
 
2018 నవంబరులో వాటర్‌ ఫెస్టివల్‌పై ఎంవోయూ
భవిష్యత్‌లో రాష్ట్రానికి జలవనరులే అతి పెద్ద ఆకర్షణ కానున్నాయని సీఎం అన్నారు. అందుకు అనుగుణంగా అంతర్జాతీయ స్థాయి క్రీడల నిర్వహణకు అనువైన వాతావరణాన్ని అమరావతిలో కల్పించాలని ఆదేశించారు. పర్యాటకం, వినోదం, క్రీడలకు రాజధాని చిరునామా కావాలన్నారు. ‘ఎఫ్‌1 హెచ్‌2వో’ పేరుతో అమరావతిలో వాటర్‌ ఫెస్టివల్‌ను వచ్చే ఏడాది నవంబరులో 15 రోజులపాటు నిర్వహించేందుకు ఇటలీకి చెందిన అంతర్జాతీయ సంస్థ యూఐఎం ముందుకొచ్చిందని తెలిపారు. ఈ ఉత్సవాలపై ఆ సంస్థ ప్రతినిధులు ఈ సందర్భంగా ప్రజెంటేషన్‌ కూడా ఇచ్చారు. ఈ పోటీలకు ప్రపంచం నలుమూలల నుంచి 300 నుంచి 400 మంది క్రీడాకారులు వస్తారని, వారు ఇక్కడ కనీసం వారంపాటు బస చేసేందుకు మొత్తం 1200 హోటల్‌ గదులు అవసరమవుతాయని పర్యాటక శాఖ కార్యదర్శి మీనా తెలిపారు. గోదావరి- కృష్ణా నదుల్లో ఏడాది పొడవునా ఈ తరహా పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం టూరిజం శాఖను ఆదేశించారు.
Posted

Evaranna adhikari thoka jadiste ventane dismiss cheyyali...oke okkadu lo Arjun laga vundali

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...