Jump to content

Hyderabad may see heavy rains for two days


Recommended Posts

Posted

Hyderabad: There is a serious flood warning for Hyderabad and heavy rains and thunderstorm expected for the state on Tuesday and Wednesday. Hyderabad has been put on high alert for the next 72 hours. 

The Indian Meteorological Department has warned the Greater Hyderabad Municipal Corporation that there will be heavy to very heavy rainfall in the city for the next two days.

The day temperature on Monday was 330 Celsius but it dropped towards evening as high intensity lashed certain localities. Ramchadrapuram received 5 cm of rainfall, the highest, on Monday, followed by Trimulgherry, 4 cm, and Alwal. The rain blew up a transformer at Marredpally.

At Ramnathapur, even as water was drained out from inundated colonies, more water accumulated within a few hours.

Posted
రాజధాని వణికింది! 
ఈనాడు, హైదరాబాద్‌ 
hyd-brk1a.jpg

రాజధాని నగరం మళ్లీ వణికింది. సోమవారం రాత్రి కురిసిన అతిభారీ వర్షంతో మరిన్ని కాలనీలు ముంపునకు గురయ్యాయి. ప్రధానంగా రాజేంద్రనగర్‌, మీరాలం, మెహిదీపట్నం, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, మూసాపేట, మియాపూర్‌ ప్రాంతాల్లో అనేక కాలనీలు తాజాగా జలమయం అయ్యాయి. కొన్ని కాలనీల్లో ఇళ్లలోని నీరు ప్రవహించడంతో స్థానికులు వేరే ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి వచ్చింది. సోమవారం అర్థరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయనే వాతావరణ హెచ్చరికతో నగరంలో వేలాది కాలనీల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. నగరంలోని చెరువులు నిండు కుండగా మారడంతో తాజా వర్షాలతో గండ్లు పడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పదికిపైగా చెరువులు పొంగి పొర్లుతున్నాయి. వాటి పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. సోమవారం సాయంత్రం వరకు కొంతవరకు తెరపినిచ్చిన వాన.. నాలుగు గంటల నుంచి నగరంలో అన్ని ప్రాంతాలను ముంచెత్తింది. రాత్రి ఏడు గంటల అనంతరం ఉరుములు, మెరుపులతో వర్షం కుంభవృష్టిగా మారింది. నగర జీవనం స్తంభించిపోయింది. మాదాపూర్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, బేగంపేట, ఉప్పల్‌, నాగోల్‌ కూకట్‌పల్లి రహదారి కూడళ్లు పూర్తిగా స్తంభించాయి. వరద నీరు రోడ్లపై నడుముళ్లొతు చేరుకోవడంతో పాదచారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.

Posted
కలగదా కనువిప్పు! 
చెరువుల చుట్టూ భయం గుప్పిట్లో జనం 
10 రోజులుగా కాలనీలను వదలని నీరు 
పురుగుపుట్రా ఇళ్లలోకి చేరుతున్న వైనం 
చోద్యం చూస్తున్న నేతలు, యంత్రాంగం 
రాత్రి మళ్లీ మొదలైన వర్షంతో కకావికలం 
కుంభవృష్టితో నదులను తలపించిన దారులు 
స్తంభించిన రాకపోకలు, జనజీవనం అస్తవ్యస్తం 
ఈనాడు, హైదరాబాద్‌ 
hyd-top2a.jpg

వానొచ్చినా.. వరదొచ్చినా.. చుట్టూ ఉన్న ప్రాంతాలు నిండా మునిగినా.. అక్రమ నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు. నడుము లోతు నీళ్లలోనూ నిర్మాణ పనులు యథేచ్ఛగా సాగుతున్నాయి. వరద ప్రభావాన్ని తెలుసుకునేందుకు వస్తున్న అధికారులు ఆవైపే చూడట్లేదు. చెరువును ఆక్రమణల నుంచి కాపాడతామని చెబుతున్న ప్రజాప్రతినిధులు పరిష్కారం దిశగా ఆలోచించడం లేదు. ఏటా వర్షాలు రావడం, వరద ముంచెత్తడం సాధారణమనేలా వ్యవహరిస్తున్నారు. బాధితులకు ఆహారం, పాల ప్యాకెట్లు ఇస్తే చాలనుకుంటున్నారు.

మహా నగరంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో గణనీయంగా వర్షపాతం నమోదవుతోంది. వరద ప్రవాహంతో లోతట్టు ప్రాంతాలేవి? కనుమరుగైన చెరువులెక్కడ? వాటి విస్తీర్ణం ఎంతవరకు ఉంది? అనే ప్రశ్నలకు ఈ వర్షం స్పష్టమైన సమాధానం చెప్పింది. రామంతాపూర్‌ పెద్దచెరువు అంశం అందులో ఒకటి. చెరువు వాస్తవ విస్తీర్ణం 32 ఎకరాలైతే ప్రస్తుతం 20 ఎకరాల్లోనే నీరు నిలిచింది. అంటే.. చెరువు పూర్తిగా నిండలేదు. అయినప్పటికీ సుమారు 110 ఇళ్లు నీట మునిగాయని అధికారులు తేల్చారు. అధికార యంత్రాంగంతోపాటు ప్రజాప్రతినిధులు కాలనీల్లో విస్తృతంగా పర్యటించి భవిష్యత్తులో అక్రమ నిర్మాణాలు రాకుండా చూస్తామని ప్రకటించారు. చెరువు చుట్టూ కంచె ఏర్పాటు చేస్తామన్నారు. కానీ మునక ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాలను పట్టించుకోలేదు.

పట్టించుకోని యంత్రాంగం 
పెద్దచెరువు మునక పరిధిలోని రవీంద్రనగర్‌, లక్ష్మినగర్‌ కాలనీల్లో నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఆ ప్రాంతం పూర్తిస్థాయి నీటి మట్టం (ఎఫ్‌టీఎల్‌) పరిధిలో ఉందని చెబుతున్న అధికారులు, ఆయా నిర్మాణాలను పట్టించుకోకపోవడం గమనార్హం.

నీటిలో మరిన్ని కాలనీలు.. 
hyd-top2b.jpg*సికింద్రాబాద్‌ చుట్టూ ఉన్న లోతట్టు ప్రాంతాలు వరదనీటిలో కొట్టుమిట్టాడుతున్నాయి. చిలకలగూడ, రాంనగర్‌ నాలా పరిసర ప్రాంతాలు చిన్నపాటి వర్షానికే వణికిపోతున్నాయి. ఎక్కడికక్కడ నాలా ఆక్రమణకు గురవడంతో వారాసిగూడ, లాలాపేట్‌, మహ్మద్‌గూడ, ఇందిరానగర్‌, ఎల్‌.నారాయణనగర్‌ తదితర ప్రాంతాల్లోని 200కుపైగా ఇళ్లు నీట మునిగాయి. బురదమట్టితో రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. 
*నెలరోజులుగా మల్కాజిగిరి నానిపోతుంది. గతనెల కురిసిన వానలతో ఈస్ట్‌ఆనంద్‌బాగ్‌లోని బండచెరువు పొంగిపొర్లి సుమారు 2 వేల ఇళ్లు నీట మునిగాయి. అదే పరిస్థితి వారంక్రితం మళ్లీ పునరావృతమైంది. ఆదివారం మరోమారు వర్షం విజృంభించడంతో చెరువును ఆనుకుని ఉన్న ఎన్‌ఎండీసీకాలనీ, షిరిడినగర్‌, సీఎన్‌బీకాలనీ, తదితర కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జనాలు ఇళ్లు దాటి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. 
*రామ్‌నగర్‌, ముషీరాబాద్‌, సుల్లాన్‌బజార్‌, మలక్‌పేట్‌, సరూర్‌నగర్‌, సైదాబాద్‌, శంకేశ్వర్‌బజార్‌, చంపాపేట్‌, పాతబస్తీతోపాటు అనేక ప్రాంతాలు ఇంకా వరద ముప్పు నుంచి పూర్తిగా బయటపడలేదు. స్థానికులు తీవ్ర అసౌకర్యం మధ్య జీవనం సాగిస్తున్నారు. 
*సోమవారం రాత్రి కురిసిన వర్షానికి బండారి లేఅవుట్‌, బాలాజీ నగర్‌ ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించింది.

ప్రమాదంలో భవనాలు.. ‘ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి వచ్చే వరదతో పెద్ద చెరువు నిండుతోంది. దాన్ని ఇతర ప్రాంతాలకు మళ్లించడం సాధ్యం కాదు. ప్రస్తుతం చెరువులో ఉన్నది సగం నీరే. ఆ మాత్రానికే మూడు కాలనీలు నీటమునిగాయి. పది రోజులుగా వందకుపైగా ఇళ్లు నడుము లోతు నీళ్లలో మగ్గుతున్నాయి. భూగర్భం నానిపోవడంతో అపార్ట్‌మెంట్‌లు, నాణ్యతలేని నిర్మాణాలకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. పునాదులు కుంగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. అదే జరిగితే ఆస్తి నష్టంతోపాటు భారీగా ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది. చుట్టపుచూపుగా వచ్చిపోయే అధికారులు, ప్రజాప్రతినిధులు అప్పుడు ఏం సమాధానం చెబుతారు? ఆక్రమణలను అడ్డుకుని చెరువును చెరువుగా మార్చితేనే చుట్టూ ఉన్న కాలనీలు వూపిరి పీల్చుకుంటాయి.

నేడూ భారీ వర్షాలు 
రుతుపవనాలు బలంగా ఉండటం, ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో మంగళవారమూ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. క్యుములోనింబస్‌ వల్ల కుండపోత వర్షం పడుతోందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు వాతావరణం సహకరించే వరకు సమీపంలోని సురక్షిత ప్రాంతాల్లో ఉండటం మంచిదన్నారు. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కమిషనర్‌ డాక్టర్‌.బి.జనార్దన్‌రెడ్డి బల్దియా ప్రధాన కార్యాలయంలో కంట్రోల్‌ రూంలో ఉండి పరిస్థితిని సమీక్షించారు.. రాత్రంతా వర్షాకాల అత్యవసర బృందాలకు సూచనలిస్తూ.. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులకు స్పందించారు. ట్రాఫిక్‌ పోలీసులు సైతం రాత్రంతా రహదారులపై విధులు నిర్వహించారు.

Posted
రాదారులు.. గోదారులు 
రాజధానిలో మళ్లీ కుండపోత 
మాదాపూర్‌లో గంటకే 6.7 సెంటీమీటర్ల వర్షపాతం 
లోతట్టు ప్రాంతాల్లో భయం... భయం 
ఈనాడు - హైదరాబాద్‌ 
9hyd-main2a.jpg

రాజధానిలో సోమవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా రెండుగంటలసేపు కురవడంతో నగరం, శివారు ప్రాంతాల్లో వరదనీరు రహదారులపైకి వచ్చేసింది. రామచంద్రాపురం నుంచి శంషాబాద్‌ వరకూ, గచ్చిబౌలి నుంచి మెయినాబాద్‌ వరకూ జోరువాన కురవడంతో రహదారులు గోదారులను తలపించాయి. శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, బండ్లగూడ, పాతబస్తీతో పాటు ఆదివారం వర్షం కురవని షేక్‌పేట, టోలీచౌకి, మెహిదీపట్నం ప్రాంతాల్లోనూ కుంభవృష్టి కురిసింది. చాలా ప్రాంతాలు అర్ధరాత్రి వరకు విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో అంధకారంలో ఉన్నాయి. పాతబస్తీలో నాలాల్లో నీరు పొంగి ప్రవహిస్తుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కాటేదాన్‌, రాజేంద్రనగర్‌ బండ్లగూడలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమమయ్యాయి. మాదాపూర్‌ పరిసర ప్రాంతాల్లో కేవలం గంట వ్యవధిలో 6.7 సెంటీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాత్రి 10 గంటల వరకూ రామచంద్రాపురంలో 8.3 సెం.మీ., పాశమైలారం, 5.4 సెం.మీ, తిరుమలగిరి 4.7, జూబ్లీహిల్స్‌లో 2.2 సెం.మీ, గోల్కొండలో 1.4 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. రాత్రి 8 గంటల వరకూ నసురాల్లాబాద్‌(కామారెడ్డి)లో 10.6, నిజాంసాగర్‌లో 10.2, హత్నూరాలో 8.58, కిష్టారెడ్డిపేటలో 7.5, తాళ్లపల్లిలో 7.0, ధర్మాసాగర్‌లో 6.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

9hyd-main2b.jpg

నగరంలో స్తంభించిన ట్రాఫిక్‌... 
భారీవర్షం కారణంగా నగరం, శివారు ప్రాంతాల్లో పలుచోట్ల ట్రాఫిక్‌ స్తంభించింది.

* మియాపూర్‌ నుంచి తెలంగాణ జిల్లాలు, విజయవాడ, బెంగళూరు వైపు వెళ్లే ప్రైవేటు ట్రావెల్స్‌ రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

* ఉప్పల్‌, సికింద్రాబాద్‌, రైల్‌నిలయం ప్రాంతాల్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో ఉప్పల్‌, తార్నాక, సికింద్రాబాద్‌, బేగంపేట వైపు రహదారిపై రెండువైపులా వాహనాలు ఆగిపోయాయి. రోడ్లపై మోకాళ్లలోతు నీళ్లు నిలవడంతో ట్రాఫిక్‌ పోలీసులు మ్యాన్‌హోళ్లను తొలగించి వాననీరు వెళ్లేందుకు దారి చేశారు. ఇప్పటికే కొన్ని కాలనీలు మునిగిపోగా... తాజా వర్ష ఉద్ధృతికి మరిన్ని కాలనీలుముంపులో చిక్కుకున్నాయి.

9hyd-main2c.jpg

* గచ్చిబౌలి, మెహిదీపట్నం, టోలీచౌకి, గోల్కొండ టూంబ్స్‌లో వరదనీరు ముంచెత్తడంతో కార్లు, బైకుల్లో వెళ్తున్న వాహనచోదకులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. పాతబస్తీ,మాదన్నపేట, మలక్‌పేట, గోల్కొండ,నార్సింగి, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ చిక్కడపల్లిలోని కాలనీలు ముంపునకు గురయ్యాయి.

* శంషాబాద్‌, రాజేంద్రనగర్‌లో సాయంత్రం నంచి రాత్రి వరకూ రెండు విడతలుగా వర్షం కురవడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యాయి. కాప్రా, కుషాయిగూడతోపాటు రాయదుర్గం, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, మల్కాజిగిరి, మియాపూర్‌, సాగర్‌రోడ్‌, కర్మన్‌ఘాట్‌లో భారీ వర్షం నమోదైంది.

Posted
1 hour ago, TampaChinnodu said:

Hyderabad: There is a serious flood warning for Hyderabad and heavy rains and thunderstorm expected for the state on Tuesday and Wednesday. Hyderabad has been put on high alert for the next 72 hours. 

The Indian Meteorological Department has warned the Greater Hyderabad Municipal Corporation that there will be heavy to very heavy rainfall in the city for the next two days.

The day temperature on Monday was 330 Celsius but it dropped towards evening as high intensity lashed certain localities. Ramchadrapuram received 5 cm of rainfall, the highest, on Monday, followed by Trimulgherry, 4 cm, and Alwal. The rain blew up a transformer at Marredpally.

At Ramnathapur, even as water was drained out from inundated colonies, more water accumulated within a few hours.

already roju (last 3 weeks nunchi) paduthundi man.. kumba varshalu.... 

Posted

Off-season rains ivi asalu

aina cheruvula ni muusesi vaati place lo apts build chesesaru, inkekadiki potundi ah water , andhu k going to apts, houses

Posted
19 minutes ago, perugu_vada said:

Off-season rains ivi asalu

aina cheruvula ni muusesi vaati place lo apts build chesesaru, inkekadiki potundi ah water , andhu k going to apts, houses

pedda  open drainage canal ni aanukoni vunna apartment ki 70 lacs sepparu naa matta , and they got sold out even before total construction. janala pichi aa range lo vundi. 

Posted
2 minutes ago, TampaChinnodu said:

pedda  open drainage canal ni aanukoni vunna apartment ki 70 lacs sepparu naa matta , and they got sold out even before total construction. janala pichi aa range lo vundi. 

janaala pichi aa range lo vunte builders matram enduku cash sesukokunda vuntaaru. dorikindi dorikinatti kabja sesi kattestharu

Posted
24 minutes ago, TampaChinnodu said:

pedda  open drainage canal ni aanukoni vunna apartment ki 70 lacs sepparu naa matta , and they got sold out even before total construction. janala pichi aa range lo vundi. 

 

21 minutes ago, TampaChinnodu said:

janaala pichi aa range lo vunte builders matram enduku cash sesukokunda vuntaaru. dorikindi dorikinatti kabja sesi kattestharu

Thats where govt shud step in n stop granting permissions to builders, adi jaragadu, bcos valla pockets will be filled with money

inka apts construct chesesaka suffer avatam thappa chesedi em ledu

Posted
46 minutes ago, perugu_vada said:

 

Thats where govt shud step in n stop granting permissions to builders, adi jaragadu, bcos valla pockets will be filled with money

inka apts construct chesesaka suffer avatam thappa chesedi em ledu

yevadi ki andhalsindhi aadiki andhuthunte inka vellu emi chestyharu

Posted
మురుగుకాలువలోకి దూసుకెళ్లిన స్కూల్‌ బస్సు

కాప్రా : మేడ్చల్‌ జిల్లా కాప్రా పరిధిలోని నాగార్జున నగర్‌ కాలనీలో నాచారం దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ బస్సు అదుపుతప్పి మురుగుకాలువలోకి దూసుకెళ్లింది. బస్సులో ఉన్న 11 మంది విద్యార్థులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మరో బస్సులో వారిని పాఠశాలకు తరలించారు. భారీ వర్షాల కారణంగా రహదారి దెబ్బతిని ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు చెబుతున్నారు. నాళాలు పొంగిపొర్లుతున్నా జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

Posted

Cheruvulu kabja chesi dengaru..inkekkadiki potadi water

Posted
4 hours ago, perugu_vada said:

Off-season rains ivi asalu

aina cheruvula ni muusesi vaati place lo apts build chesesaru, inkekadiki potundi ah water , andhu k going to apts, houses

Off season rains emiti we are still in monsoon season no... In south it will be there till Nov end.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...