ye maaya chesave Posted October 14, 2017 Report Posted October 14, 2017 చిత్రం : ‘రాజు గారి గది-2’ నటీనటులు: అక్కినేని నాగార్జున - సమంత - సీరత్ కపూర్ - అశ్విన్ - వెన్నెల కిషోర్ - ప్రవీణ్ - షకలక శంకర్ - నరేష్ - అభినయ - నందు తదితరులు సంగీతం: తమన్ ఛాయాగ్రహణం: దివాకరన్ మూల కథ: రంజిత్ శంకర్ మాటలు: అబ్బూరి రవి నిర్మాణం: పీవీపీ సినిమా - మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ - ఓక్ ఎంటర్టైన్మెంట్స్ కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: ఓంకార్ కథ: అశ్విన్ (అశ్విన్ బాబు).. రవి (వెన్నెల కిషోర్).. ప్రవీణ్ (ప్రవీణ్) అనే ముగ్గురు మిత్రులు కలిసి బిజినెస్ చేయాలన్న ఉద్దేశంతో ఓ రిసార్ట్ కొంటారు. ఆ రిసార్ట్ కార్యకలాపాలు మొదలై అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఈ ముగ్గురికీ అక్కడ అనూహ్య పరిణామాలు ఎదురవుతాయి. అక్కడో దయ్యం ఉన్న సంగతి వాళ్లకు తెలిసొస్తుంది. దీంతో దయ్యం ఆట కట్టించడం కోసం రుద్ర (నాగార్జున) అనే మెంటలిస్టును కలుస్తారు. అతను వాళ్ళ సమస్యని పరిష్కరించాడా ..?? ఇంతకీ ఆ రిసార్ట్ లో నిజంగానే దయ్యం ఉందా.. ఉంటే దాని కథేంటి.. చివరికి దాని కోరిక తీరిందా లేదా అన్నది మిగతా కధ. విశ్లేషణ: ప్రేమకథాచిత్రమ్ నుంచీ తెలుగు సినిమా హారర్ కామెడీ బాట పట్టింది. ఆ తరహా సినిమాలు ప్రేక్షకులకు మొహం మొత్తేసే రేంజ్ లో ఆ జానర్ ని మన దర్శకులు వాడేశారు. రాజు గారి గది-2 కూడా అలాంటి సాదాసీదా కథగానే అనిపించినా, ప్రధాన సమస్యగా ఒక కాంటెంపరరీ కాన్సెప్ట్ ని టచ్ చేసి కాస్త కొత్తగానే తీర్చిదిద్దాడు దర్శకుడు ఓంకార్. ఫస్టాఫ్ మొదట్లో పాత్రల పరిచయం, నేపధ్యం ఎస్టాబ్లిష్ చేసేంత వరకూ సినిమా చాలా రొటీన్ గానే అనిపిస్తుంది. వెన్నెల కిశోర్, ప్రవీణ్ ల మధ్య కామెడీ మామూలుగానే ఉంది. అశ్విన్ కి దయ్యం దెబ్బ తగిలిన తరువాత కానీ చలనం రాదు. ఆ పై మంచి బిల్డప్ తో రుద్ర పాత్ర పరిచయం ,అతను ఒక మర్డర్ మిస్టరీ సాల్వ్ చేసే ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతుంది. మానసికంగా ఎంతో బలం కలిగిన అతనికే దయ్యం చిన్న షాక్ ఇచ్చే సన్నివేశంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. సెకండాఫ్ లో రుద్ర అసలు కధని ఛేదించే క్రమంలో మంచి సన్నివేశాలే కుదిరాయి. సమంత ఫ్లాష్ బ్యాక్, ఆ తరువాత హంతకుడు ఎవరో తెలుసుకునే ఎపిసోడ్ కూడా బాగా పండింది. ముందుగానే చెప్పుకున్నట్టు హారర్ కామెడీకి డిఫరెంట్ టచ్ ఇచ్చే ప్రయత్నంలో ఓంకార్ సక్సెస్ అయ్యాడు. చెప్పాలనుకున్న పాయింట్ ని ఎఫెక్టివ్ గానే ప్రెజంట్ చేసాడు. ఐతే చెప్పాలనుకున్న పాయింట్ ఇంత ఎమోషనల్ అయినపుడు దానికి తగ్గ వినోదం జోడించడం లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు. వెన్నెల కిశోర్,ప్రవీణ్ లాంటి మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ లని సరిగ్గా ఉపయోగించుకోలేదు.ఏదో అడపా దడపా రెండు మూడు జోకులు ఐతే పేలాయి కానీ మొత్తంగా చూస్తే కామెడీ సన్నివేశాలు పెద్దగా వర్కవుట్ కాలేదు. అసలు కధ మొదలైన తరువాత కూడా ఆ సన్నివేశాలు తగ్గించి ఆ స్థానం లో ముగింపు లో అసలు నేరస్థులకు శిక్ష పడే ఎపిసోడ్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఓంకార్ కి తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో తమన్ వీలయినంత సపోర్ట్ ఇచ్చాడు. నాగార్జున కి ఇచ్చిన రుద్ర థీమ్ కానీ, ఇతర కీలక సన్నివేశాల్లో అయితేనేమి తమన్ రాణించాడు. అలాగే ఇంటర్వెల్,క్లైమాక్స్ సన్నివేశాల్లో గ్రాఫిక్స్ వర్క్ కూడా బాగుంది. అబ్బూరి రవి మాటలు సందర్భోచితంగా ఉన్నాయి. చివరి అరగంటలో అతని మాటల వల్లే సన్నివేశాలు మరింత ఎలివేట్ అయ్యాయి. మెంటలిస్ట్ రుద్రగా నాగార్జున నటన, స్క్రీన్ ప్రెజన్స్ చాలా బాగున్నాయి. నిడివి కొంచెం తక్కువ అయినా సమంత కూడా బాగుంది, ముఖ్యంగా చివర్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో తన నటన ఆకట్టుకుంటుంది. అభినయ పరవాలేదు.సీరత్ కపూర్ గ్లామర్ డోస్ కి పనికొచ్చింది. అశ్విన్ ఒకే. వెన్నెల కిశోర్, ప్రవీణ్ లకి సరైన సన్నివేశాలు పడలేదు కానీ ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేశారు. షకలక శంకర్ షరా మామూలుగా పవన్ కళ్యాణ్ ఇమిటేషన్ తో ఒక సన్నివేశం లో అలరిస్తాడు. నరేష్,నందు తదితరులు పరవాలేదు. రేటింగ్: 6/10 Quote
Guest Posted October 14, 2017 Report Posted October 14, 2017 12 minutes ago, k2s said: Subtitles pls telugu kuda raada.. Quote
k2s Posted October 14, 2017 Report Posted October 14, 2017 6 minutes ago, Guest said: telugu kuda raada.. Vachu Quote
Guest Posted October 14, 2017 Report Posted October 14, 2017 28 minutes ago, k2s said: Vachu mari saduv..that guy put effort in writing Quote
ARYA Posted October 14, 2017 Report Posted October 14, 2017 3 hours ago, k2s said: Subtitles pls Quote
k2s Posted October 14, 2017 Report Posted October 14, 2017 2 hours ago, Guest said: mari saduv..that guy put effort in writing But i will not Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.