TampaChinnodu Posted October 14, 2017 Report Posted October 14, 2017 మహా విజయవాడ! కార్పొరేషన్లో 45 గ్రామాలు విలీనం ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ నవంబరు నెలాఖరుకి పట్టాలు 20 వేల మందికి ఇళ్ల నిర్మాణం పాత ఆసుపత్రిలో కొత్త భవన నిర్మాణం పారిశుద్ధ్య నిర్వహణపై ఆగ్రహం రౌడీయిజం చేస్తే బయటకు పంపించేస్తాం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు ఈనాడు - అమరావతి విజయవాడలో కొండల మీద, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న సుమారు 50 వేల మందికి ఇళ్ల స్థలాలు క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. విశాఖలో చేసినట్టే లబ్ధిదారులందరినీ పిలిచి...పసుపు కుంకుమ కార్యక్రమం కింద మహిళల పేరు మీద పట్టాలిచ్చి, భోజనం పెట్టి పంపిస్తామన్నారు. నవంబరు 30 నాటికి పట్టాలు అందజేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ చుట్టుపక్కల ఉన్న 45 గ్రామాల్ని దశలవారీగా నగరపాలక సంస్థలో విలీనం చేస్తామన్నారు. అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. పాత ప్రభుత్వాసుపత్రిలో పడకల సంఖ్య పెంచుతామని, ఆస్పత్రి ఆవరణలోని పాత భవనాన్ని కూలగొట్టి కొత్త భవనం కడతామని చెప్పారు. విజయవాడలో రౌడీయిజం అన్న మాటే వినిపించడానికి వీల్లేదని, ఎవరైనా తోకజాడిస్తే రాష్ట్రం బయటకు పంపిస్తానని హెచ్చరించారు. ముఖ్యమంత్రి శనివారం నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి మొదలైన ఆయన నగర పర్యటన మధ్యాహ్నం ఒంటిగంట దాటేంత వరకు కొనసాగింది. కొన్ని చోట్ల ఉదయం తొమ్మిది గంటలు దాటినా చెత్త తొలగించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాంబే కాలనీలోకి వెళ్లి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. చివరగా పాత ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసి, వైద్య సేవలు ఎలా అందుతున్నాయో ఆరా తీశారు. అక్కడే విలేఖరులతో మాట్లాడారు. అనంతరం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులతో నగరాభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆదేశాలు జారీ చేశారు. * 45 గ్రామాల విలీనానికి ఆరు నెలల గడువు. ఆయా గ్రామాల సర్పంచ్‌లతో సమావేశం నిర్వహించాలని ఆదేశం. ఈ లోగా ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్యం, మౌలిక వసతుల బాధ్యత విజయవాడ నగరపాలక సంస్థకు అప్పగింత. కార్పొరేషన్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా సర్పంచ్‌లు. * వాంబే కాలనీలో 5-6 వేల మంది ఇళ్లు కట్టుకుని ఉంటున్నారు. స్థలాలు వారి పేరు మీద లేవు. వారితో పాటు కొండలపైనా చాలా మంది ఇళ్లు కట్టుకుని అనేక సంవత్సరాలుగా ఉంటున్నారు. ఎక్కడ ఉంటున్న వారికి అక్కడే స్థలాల క్రమబద్ధీకరణ. * నగరంలో సొంత గూడు లేని పేదలందరికీ ఇళ్ల నిర్మాణం. కాలువ కట్టలపై ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి తొలి ప్రాధాన్యం. సుమారు 20 వేల ఇళ్ల నిర్మాణం. * వాంబే గృహ సముదాయంలో సగం కట్టి వదిలేసిన 4 వేల ఇళ్ల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని ఆదేశం. జక్కంపూడి కాలనీలో నిర్మిస్తున్న 12 వేల ఇళ్లతో పాటు, అదనంగా మరో 4 వేల ఇళ్ల నిర్మాణం. పనులు పూర్తికి తొమ్మిది నెలల గడువు. * వాంబే కాలనీ దగ్గర 50 ఎకరాలకు అదనంగా చెత్త నుంచి విద్యుదుత్పత్తి ప్లాంట్‌కు కేటాయించిన 30 ఎకరాలు కేటాయింపు. ఆ 80 ఎకరాల్లో జీ+7 విధానంలో ఎకరానికి 200 ఇళ్లు చొప్పున పేదలకు 14 వేల ఇళ్ల నిర్మాణం. * నగరంలో రహదారుల ఆధునికీకరణలో భాగంగా ఈ చివరి నుంచి ఆ చివరికి సిమెంటు లేదా బీటీ రోడ్డు. ప్రధాన రహదారులతో పాటు, కాలనీ రోడ్ల అభివృద్ధి. * పోలీసు కంట్రోల్ రూం ఎదురుగా పనికిరాని వస్తువులతో రూపొందించిన బొమ్మలతో ఏర్పాటు చేసిన పార్కు చుట్టూ వాకింగ్ ట్రాక్. రైవస్ కాలువ ఇరుపక్కలా ఒడ్డున సుందరీకరణ. దీనికి రెండు నెలల గడువు. నెల రోజుల్లో ట్రాఫిక్ ఐలాండ్లు, కూడళ్ల అభివృద్ధి. * గుంటూరులో చెత్త నుంచి విద్యుదుత్పత్తి ప్లాంట్ నిర్మాణం. వాంబే కాలనీ వద్ద డంపింగ్ యార్డులో పేరుకున్న 2 లక్షల టన్నుల చెత్త ఏడాది కాలంలో అక్కడకు తరలింపు. రూ.18 కోట్లతో పనులు. * పాత బస్టాండ్ దగ్గరున్న సీఎన్జీ డిపో 45 రోజుల్లోగా పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌కు తరలింపు. గెయిల్ ఎండీ ఏపీ దాస్‌తో మాట్లాడాలని అధికారులకు సీఎం ఆదేశం. 30 రోజుల్లో పైప్‌లైన్ వేయడం పూర్తి చేయాలి. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్, డ్రైవర్ రహిత బస్సులు వస్తాయని వెల్లడి. పాత బస్టాండ్ ప్రాంతాన్ని మంచి సందర్శనీయ ప్రదేశంగా తీర్చిదిద్దాలని ఆదేశం. * భవన నిర్మాణ వ్యర్థాల్లో దేనికి దానికి వేరు చేసి పునర్వినియోగించుకునే వ్యవస్థకు శ్రీకారం. * పాత ప్రభుత్వాసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణపై సంతృప్తి. ఆస్పత్రి ఆవరణను ల్యాండ్‌స్కేపింగ్‌తో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతాం.పెరుగుతున్న రోగుల అవసరాలకు తగ్గట్టు పడకల సంఖ్య పెంచేందుకు కార్యాచరణ సిద్ధం. * రామవరప్పాడు కూడలి ఆధునికీకరణ. రామవరప్పాడు నుంచి గన్నవరం వరకు రహదారి వెడల్పు పనులు 2 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశం. * విజయవాడలోని కొండలు మరింత ఆకర్షణీయంగా కనిపించేలా సుందరీకరణ పనులకు ఆదేశం. కనకదుర్గ అమ్మవారి పూజలకు ఉపయోగించే ఎరుపు, పసుపు రంగు పుష్ప వనాలను ఇంద్రకీలాద్రిపై పెంచాలని సూచన. * మరే నగరంలో లేని విధంగా విజయవాడలో మూడు కాలువలు, బుడమేరు డ్రెయిన్ ఉన్నాయి. కాలువల్లో నిరంతరం నిర్దిష్ట నీటి మట్టం ఉండేలా చూడాలి. జలరవాణాకు వీలుగా ఒక కాలువతో మరో కాలువని అనుసంధానించాలని ఆదేశం. పడవలు, వాటర్ స్కూటర్లు నడపాలని సూచన. * దుర్గగుడి పైవంతెన పనులు వేగవంతం చేయకపోతే కఠిన చర్యలు. కాలువలపై ఒకటి రెండు చోట్ల పైవంతెన నిర్మాణం. * విజయవాడలో లైట్ మెట్రో ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయం. * నగరంలో వర్షపు నీటిపారుదల వ్యవస్థ ఏర్పాటు పనుల్ని ఎల్ అండ్ టీ సంస్థ ఆలస్యం చేయడంపై అసంతృప్తి. పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశం. * పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో సిటీ స్క్వేర్ అభివృద్ధి. రౌడీలూ జాగ్రత్త..! విజయవాడలో కొందరు రౌడీయిజం చేయాలని చూస్తున్నారని, అలాంటి వారిని కఠినంగా అణచివేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు. హైదరాబాద్‌లో అలాగే చేశానన్నారు. విజయవాడలో ఉండటం ఇష్టం లేకపోతే వేరే చోటుకి వెళ్లి బతకాలని, ఇక్కడ ఉండి రౌడీయిజం చేద్దామనుకుంటే మాత్రం రాష్ట్రంలోనే లేకుండా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాజధాని ప్రాంత అభివృద్ధి ఇక్కడి ప్రజల ప్రవర్తన మీద కూడా ఆధారపడి ఉంటుందన్నారు. విశాఖ ప్రజలు సౌమ్యంగా ఉంటూ, అందరితో కలసిపోతారు కాబట్టే అక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు. కొందరి వల్ల రాజధానికి చెడ్డపేరు వస్తుందనుకుంటే సహించేది లేదన్నారు. అసాంఘిక శక్తులు, బ్లేడ్ బ్యాచ్‌లపై కఠినంగా వ్యవహరించాలని నగర పోలీసు కమిషనర్‌ను సీఎం ఆదేశించారు. 6 నెలల్లో హోదా ఈనాడు డిజిటల్, విజయవాడ: ఆరు నెలల్లో విజయవాడ మహానగరంగా మారనుంది. హైదరాబాద్, విశాఖ నగరాలకే పరిమితమైన మహానగర హోదా ఇక విజయవాడకు త్వరలో దక్కనుంది. విజయవాడ నగరాన్ని మెట్రోపాలిటన్‌గా గుర్తిస్తూ ప్రభుత్వం లోగడ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రకటించిన 19 గ్రామాలతో కలిపి 45 గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేయనున్నారు. ప్రస్తుతం విజయవాడ పరిధి 61.9 చ.కి.మీ.లు. జనాభా 15 లక్షల దాకా ఉంది. 45 గ్రామాలను కలిపితే జనాభా 20 లక్షలు దాటనుందని అంచనా. విలీన గ్రామాలు: గన్నవరం, కంకిపాడు, కొండపల్లి, ఇబ్రహీంపట్నం, నున్న, పాతపాడు, రాయనపాడు, పైడూరిపాడు, గొల్లపూడి, నల్లకుంట, కొత్తూరు తాడేపల్లి, షాబాదా, జక్కంపూడి, మంగలాపురం, అంబాపురం, ఫిర్యాదినైనవరం, నిడమానూరు, గూడవల్లి, ఎనికపాడు, ప్రసాదంపాడు, రామవరప్పాడు, డోన్‌ఆత్కూరు, కేసవపల్లి, బుద్ధవరం, ఉప్పులూరు, కూనవరం, పోరంకి, తాడిగడప, యనమలకుదురు, పెనమలూరు, గుంటుపల్లి, సూరాయపాలెం, పునాదిపాడు, ఎదురుపావులూరు సహా మరో 11 గ్రామాలు కార్పొరేషన్లో విలీనం కానున్నాయి. Quote
TampaChinnodu Posted October 14, 2017 Author Report Posted October 14, 2017 Quote విజయవాడలో కొండల మీద, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న సుమారు 50 వేల మందికి ఇళ్ల స్థలాలు క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. Great inka encourage seyyandi kabja lu. first kabja seyyandi dorikindi doriki nattu , future lo elagu regularize sesestharu votes kosam. Quote
Pipucbn Posted October 15, 2017 Report Posted October 15, 2017 Already vijayawada ni Bramaravathi lo kalipesaru ga.... Quote
RunRaajaRun123 Posted October 15, 2017 Report Posted October 15, 2017 1 hour ago, TampaChinnodu said: Great inka encourage seyyandi kabja lu. first kabja seyyandi dorikindi doriki nattu , future lo elagu regularize sesestharu votes kosam. Konda meedha illu kattukunnarantene peddaga dabbulenollu man. kotlu kotlu kabja chesina vallu chala mandhi happy ga tiruguthunnaru. vallaki ivvatam lo pedd tappem ledu. Quote
pahelwan Posted October 15, 2017 Report Posted October 15, 2017 Thank u kcr. Ni daya tho ma bezwada develop cheskuntunam Quote
pentaya Posted October 15, 2017 Report Posted October 15, 2017 10 hours ago, Pipucbn said: Already vijayawada ni Bramaravathi lo kalipesaru ga.... Nuvvu kuda anevadivena cbn ni... Poyi nee real id tho ra, raithu bidda Quote
sattipandu Posted October 15, 2017 Report Posted October 15, 2017 8 hours ago, pahelwan said: Thank u kcr. Ni daya tho ma bezwada develop cheskuntunam hehe ido rakam fanism... Quote
pentaya Posted October 15, 2017 Report Posted October 15, 2017 3 minutes ago, sattipandu said: hehe ido rakam fanism... Fanism kadu... nijame... divide avvakapothe Andhra alaage edchedi without development. Though we have ample of money there is no infrastructure. It's time to build infrastructure and commercialise things. Remember bro... before even hyd and so called big cities in the country, Bezawada was far beyond in riches, textiles, food and transport in British times. Quote
sattipandu Posted October 15, 2017 Report Posted October 15, 2017 4 minutes ago, pentaya said: Fanism kadu... nijame... divide avvakapothe Andhra alaage edchedi without development. Though we have ample of money there is no infrastructure. It's time to build infrastructure and commercialise things. Remember bro... before even hyd and so called big cities in the country, Bezawada was far beyond in riches, textiles, food and transport in British times. ok ok i also like PK Quote
pentaya Posted October 15, 2017 Report Posted October 15, 2017 28 minutes ago, sattipandu said: ok ok i also like PK What is pk? Quote
pentaya Posted October 15, 2017 Report Posted October 15, 2017 19 minutes ago, SonyKongara said: Jai CBN Jai Lokesh Aapu saamy... nuvvu nee dabba gola. Please stop bhajana. Quote
TampaChinnodu Posted October 15, 2017 Author Report Posted October 15, 2017 17 hours ago, RunRaajaRun123 said: Konda meedha illu kattukunnarantene peddaga dabbulenollu man. kotlu kotlu kabja chesina vallu chala mandhi happy ga tiruguthunnaru. vallaki ivvatam lo pedd tappem ledu. you think the deserved people get those ? Most of them will be binamis to local leaders. Agents and local leaders ki money ivvakunda permission ee raadu. And that is not the way to give homes to poor people. It is indirectly encouraging people to kabja lands. Quote
RunRaajaRun123 Posted October 15, 2017 Report Posted October 15, 2017 31 minutes ago, TampaChinnodu said: you think the deserved people get those ? Most of them will be binamis to local leaders. Agents and local leaders ki money ivvakunda permission ee raadu. And that is not the way to give homes to poor people. It is indirectly encouraging people to kabja lands. Valla andarni tosesthe first egesukuntu vachedhi PK ne. peddollu ki anayayam antu. ippatavi legalize chesi. Next nundi gattiga undatame. Quote
TampaChinnodu Posted October 15, 2017 Author Report Posted October 15, 2017 Just now, RunRaajaRun123 said: Valla andarni tosesthe first egesukuntu vachedhi PK ne. peddollu ki anayayam antu. ippatavi legalize chesi. Next nundi gattiga undatame. That next will never come. Just like we were never able to get rid of reservations to even rich people. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.