SonyKongara Posted October 16, 2017 Author Report Posted October 16, 2017 ‘డిజైన్ల’పై లండన్‌లో చర్చలు నార్మన్ ఫోస్టర్‌తో మంత్రి నారాయణ బృందం భేటీ సీఎం లండన్ పర్యటన నాటికి ముసాయిదా డిజైన్లు అమరావతి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): అమరావతిలోని పరిపాలనా నగరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయాలకు సంబంధించిన డిజైన్లపై మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్ ప్రతినిధులతో మంత్రి నారాయణ ఆధ్వర్యంలోని ఉన్నతస్థాయి బృందం లండన్‌లో చర్చలు జరిపింది. రాజధానిలో ప్రధాన కట్టడాల డిజైన్లపై నెలల తరబడి కసరత్తు చేసినా... ఇటీవల నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు సమర్పించిన డిజైన్లు సీఎం చంద్రబాబును ఆకట్టుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో నారాయణ బృందం మరొకమారు లండన్‌కు పయనమైన సంగతి విదితమే. ఎలాగైనా సరే ఈ డిజైన్ల ప్రక్రియను కొద్ది వారాల్లోనే ఒక కొలిక్కి తెచ్చే కృతనిశ్చయంతో ఉన్న సీఎం... ఈ ప్రక్రియలో ప్రఖ్యాత చలనచిత్ర దర్శకుడు ఎస్.ఎ్‌స.రాజమౌళిని కూడా భాగస్వామిని చేశారు. సీఎం ఆలోచనలను తెలుసుకునేందుకు ఇప్పటికే ఆయనతో సమావేశమైన రాజమౌళి... గత బుధవారం నారాయణ బృందంతోపాటు లండన్‌కు వెళ్లారు. సీఆర్డీయే మాజీ కమిషనర్ డాక్టర్ నాగులపల్లి శ్రీకాంత్‌కు సైతం ఈ టీంలో ప్రభుత్వం స్థానం కల్పించిన విషయం తెలిసిందే. సీఎం సూచనల మేరకు ఫోస్టర్ ప్రతినిధులు రూపొందించిన రివైజ్డ్ డిజైన్లను నారాయణ, రాజమౌళి తదితరులు నిశితంగా పరిశీలించారు. అవసరమైన మార్పుచేర్పులను సూచించారు. అనంతరం నారాయణ, రాజమౌళి శనివారం ఉదయానికి హైదరాబాద్ చేరుకోగా, మరింత లోతైన చర్చల కోసం సీఆర్డీయే కమిషనర్ శ్రీధర్, మాజీ కమిషనర్ శ్రీకాంత్ తదితరులు లండన్‌లోనే ఉండిపోయారు. సీఎం చంద్రబాబు ఈ నెల 24, 25 తేదీల్లో లండన్‌లో ఫోస్టర్ సంస్థ రూపొందించిన డిజైన్లను పరిశీలించనున్నారు. అప్పటికల్లా డిజైన్లు ఒక కొలిక్కి తెచ్చేందుకు నారాయణ బృందం ప్రయత్నిస్తోంది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.