Jump to content

Recommended Posts

Posted
రాష్ట్రంలో ఏరోసిటీ 
550 కోట్ల డాలర్లతో ఏర్పాటు! 
మౌలిక వసతుల రంగంలో 200 కోట్ల డాలర్ల పెట్టుబడులు 
ఏవియేషన్‌ సిటీ ఎల్‌ఎల్‌పీ, బిన్‌ జాయేద్‌ గ్రూపులతో ఒప్పందాలు 
వీటి విలువ సుమారు రూ.48,750 కోట్లు 
నౌకాయాన రంగంలో పెట్టుబడులకు డీపీ వరల్డ్‌ సంసిద్ధత 
విజయవాడ, విశాఖ, తిరుపతిలకు ఎమిరేట్స్‌ విమాన సర్వీసులు 
చంద్రబాబు యూఏఈ పర్యటనలో కీలక ఒప్పందాలు 
ఈనాడు - అమరావతి 
22ap-main1a.jpg

ముఖ్యమంత్రి చంద్రబాబు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 750 కోట్ల డాలర్ల పెట్టుబడులకు సంబంధించి రెండు ప్రముఖ సంస్థలతో ఆదివారం కీలక ఒప్పందాలు జరిగాయి. విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాలకు ఎమిరేట్స్‌ విమాన సర్వీసుల నిర్వహణకు కూడా మార్గం సుగమం అయింది. రాష్ట్రంలో దశలవారీగా 550 కోట్ల డాలర్ల పెట్టుబడితో ఏరోసిటీ నిర్మాణానికి మహ్మద్‌ అబ్దుల్‌ రెహమాన్‌ అల్‌ జూరానీకి చెందిన ఏవియేషన్‌ సిటీ ఎల్‌ఎల్‌పీ సంస్థ ముందుకు వచ్చింది. ఆ సంస్థ, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి బోర్డు (ఈడీబీ) ప్రతినిధులు ముఖ్యమంత్రి సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. రెండో ఒప్పందం బిన్‌ జాయేద్‌ గ్రూప్‌తో కుదిరింది. ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతుల రంగంలో 200 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. అవగాహన ఒప్పందంపై ఈడీబీ సీఈఓ జాస్తి కృష్ణ కిశోర్‌, బిన్‌ జాయేద్‌ గ్రూపు తరఫున సంస్థ ఎండీ మిధాత్‌ కిద్వాయ్‌ సంతకాలు చేశారు. ఈ రెండు ఒప్పందాల విలువ రూపాయి మారకంలో సుమారు రూ.48,750 కోట్లు. మూడు రోజులు యూఏఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు ఆదివారం రెండో రోజు దుబాయిలో పలువురు ప్రభుత్వ, వాణిజ్య ప్రముఖులతో సమావేశమయ్యారు. ఇండియన్‌ బిజినెస్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ కౌన్సిల్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయికి చెందిన డీపీ వరల్డ్‌ సంస్థ సంసిద్ధత తెలియజేసింది.

20 వేల మందికి ఉద్యోగాలు 
ఆంధ్రప్రదేశ్‌లో వైమానిక రంగానికి సంబంధించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో ఏరోసిటీని నిర్మిస్తారు. ఇది పూర్తయితే 15 వేల మందికి ప్రత్యక్షంగా, ఐదు వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఏరోసిటీ నిర్మాణానికి 10 వేల ఎకరాలు అవసరమవుతుంది. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏరోసిటీ నిర్మించాలన్న విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని చంద్రబాబు తెలిపారు. అనుకూల ప్రాంతంపై అధ్యయనానికి కంపెనీ ప్రతినిధుల బృందం వచ్చే నెల మూడో వారంలో ఆంధ్రప్రదేశ్‌కి వస్తుంది. వచ్చే జనవరిలో దావోస్‌లో ప్రాథమిక నివేదిక అందజేస్తుంది. భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టు రూపొందిస్తున్నామని, దేశ విదేశాల నుంచి విజ్ఞానాన్ని తీసుకురావడం తమ లక్ష్యమని చంద్రబాబు తెలిపారు.

నేరుగా ప్రభుత్వానికి నిధులు 
రాష్ట్రంలో రహదారులు, ఓడ రేవులు, విమానాశ్రయాల అభివృద్ధికి బిన్‌ జాయేద్‌ గ్రూపు పెట్టుబడులు పెడుతుంది. రాజధాని అమరావతిలో ప్రధాన రహదారులు, అంతర్‌ వలయ రహదారి (ఐఆర్‌ఆర్‌), విజయవాడ మెట్రో ప్రాజెక్టు, రామాయపట్నం ఓడరేవు, భోగాపురం నుంచి భీమిలి, విశాఖ నుంచి అద్దరిపేట వరకు బీచ్‌ కారిడార్లు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం తదితర ప్రాజెక్టుల అభివృద్ధికి అవసరమైన నిధుల్ని నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనుంది. 
 

మీ వ్యాపారాలకు సరైన గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్‌. మీరంతా మంచి ప్రతిపాదనలతో రండి. కేవలం ఖనిజ వనరులే కాకుండా, అత్యుత్తమ మానవ వనరులు కూడా కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. సులభతర వాణిజ్యానికి అనువైన ప్రదేశాల విషయంలో మా రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. దుబాయి నిర్మాణంలో పాలుపంచుకున్న మీరంతా అమరావతి నిర్మాణంలోను భాగస్వాములవ్వాలని కోరుకుంటున్నాను.
- దుబాయి ఇండియన్‌ బిజినెస్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ కౌన్సిల్‌లో ముఖ్యమంత్రి

ఓడరేవుల అభివృద్ధికి డీపీ వరల్డ్‌ సంసిద్ధత 
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయికి చెందిన డీపీ వరల్డ్‌ సంసిద్ధత తెలియజేసింది. రాష్ట్రంలో ఓడ రేవుల అభివృద్ధికి సానుకూలత వ్యక్తంచేసింది. డీపీ వరల్డ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌, సీఈఓ సుల్తాన్‌ అహ్మద్‌ బిన్‌ సులేయమ్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు తామూ ఆసక్తిగా ఉన్నామని, జాతీయ మౌలిక సదుపాయాల నిధి విషయంలో ఇప్పటికే భారత్‌తో కలసి సన్నిహితంగా పనిచేస్తున్నామని సుల్తాన్‌ తెలిపారు. ‘‘మా ఓడరేవులకు రహదారి అనుసంధానత సాధించాల్సి ఉంది. వేగంగా నిర్ణయాలు తీసుకోవడం మాకు అత్యంత ముఖ్యం. సమయాన్ని అత్యంత విలువైనదిగా భావిస్తాం’’ అని తెలిపారు. తాము నిర్ణయాలు వేగంగా తీసుకునే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని, రియల్‌టైంలో నిర్ణయాలు తీసుకుని మంచి ఫలితాలు సాధిస్తున్నామని చంద్రబాబు వివరించారు. ఉభయులు కలసి పనిచేసేందుకు ఒక కార్యబృందం ఏర్పాటు చేయాలని, ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలను ఆ బృందం ద్వారా వేగంగా ముందుకు తీసుకెళ్లగలమని సుల్తాన్‌ ప్రతిపాదించారు. తమ భారత కార్యాలయానికి అన్ని విషయాలు వదిలిపెట్టకుండా, ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తామని తెలిపారు. సంయుక్త కార్యాచరణ బృందానికి రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌, డీపీ గ్రూప్‌ సీఎఫ్‌ఓ యువరాజ్‌ నారాయణ్‌ సారథ్యం వహిస్తారని ముఖ్యమంత్రి తెలిపారు. సంయుక్త కార్యాచరణ బృందం ఏర్పాటు ఒక ముందడుగని, ఇది ఉమ్మడి కార్యాచరణను ముందుకు తీసుకెళుతుందని, ప్రతి నెలా ఈ అంశంపై పురోగతిని సమీక్షించుకుందామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రారంభించనున్న లాజిస్టిక్‌ యూనివర్సిటీలో భాగస్వామి కావాలని డీపీ వరల్డ్‌ గ్రూపు ఛైర్మన్‌ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. సప్లయ్‌ చైన్‌ ద్వారా అంతర్జాతీయ వాణిజ్యానికి మార్గం సుగమం చేయడంలో డీపీ వరల్డ్‌ ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఈ సంస్థకు 40 దేశాల్లో నౌకాశ్రయాల్లో మెరైన్‌, ఇల్‌లాండ్‌ టెర్మినళ్లు ఉన్నాయి. 103 దేశాల్లో కార్యాలయాలున్నాయి.

22ap-main1b.jpg
మీ దగ్గర నైపుణ్యం, పెట్టుబడులు ఉన్నాయి. మా దగ్గర విస్తృత అవకాశాలున్నాయి. ఓడరేవుల అభివృద్ధిలో కలసి పనిచేద్దాం. రాబోయే రోజుల్లో సరకు రవాణా యావత్తూ తూర్పు తీరం నుంచే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌కి నౌకాశ్రయాల ఏర్పాటుకి అవసరమైన సేవలు అందించగల సామర్థ్యం, సత్తా ఉన్నాయి.
- డీపీ వరల్డ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌, సీఈఓ సుల్తాన్‌ అహ్మద్‌ బిన్‌ సులేయమ్‌తో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో విమానాశ్రయం నిర్మించండి 
ఆంధ్రప్రదేశ్‌లో విమానాశ్రయం నిర్మించాల్సిందిగా యూఏఈకి చెందిన ఎమిరేట్స్‌ విమానయాన సంస్థలకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను సమీకృత లాజిస్టిక్‌ హబ్‌గా చేసుకోవచ్చునని సూచించారు. ఆదివారం ఆయన ఎమిరేట్స్‌ స్ట్రాటజీ అండ్‌ ప్లానింగ్‌ ఇన్‌ఛార్జి అద్నాన్‌ ఖాజిమ్‌, ఫ్లై దుబాయి సీఈఓ ఘయిత్‌ అల్‌ ఘయిత్‌లతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో విమానాశ్రయం నిర్మించాలని, రాష్ట్రంలో విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాల నుంచి దుబాయికి విమాన సర్వీసులు నడపాలని, ఆంధ్రప్రదేశ్‌ను ఎమిరేట్స్‌ హబ్‌గా మార్చుకోవాలని, ఏవియేషన్‌ అకాడమీని నెలకొల్పాలని చంద్రబాబు ప్రతిపాదించారు. ఈ నాలుగు ప్రతిపాదనలకూ ఎమిరేట్స్‌ సంస్థ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. వీసా నిబంధనలు సులభతరమైతే మరింత మార్పు వస్తుందని అభిప్రాయపడ్డారు. బ్యాంకాక్‌ వీసా నిబంధనలు సడలించడంతో రోజుకి ఐదు విమానాలు నడుపుతున్నామన్నారు. దుబాయి నుంచి భారత్‌కు వారానికి వెయ్యికిపైగా విమానాలు నడుపుతున్నా సరిపోవడం లేదని, ఇంకా పెంచాల్సి ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సూచించిన మూడు నగరాలకు విమానాలు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని, వెంటనే కార్యాచరణ ప్రారంభిస్తామని తెలిపారు. విమానాల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్‌హాల్‌ పనులకు అవసరమైన సదుపాయాల్ని ఆంధ్రప్రదేశ్‌లో కల్పిస్తామని చంద్రబాబు తెలిపారు. తమకు ఎయిర్‌లైన్స్‌, ఎయిర్‌పోర్టులు, పోర్టుల ప్రతినిధుల బృందంతో ఒక టాస్క్‌ఫోర్సు ఉందని, ఇరువురం సంయుక్తంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని పనిచేద్దామని ఫ్లై దుబాయి సీఈఓ ఘయిత్‌ ప్రతిపాదించారు. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉండగా ఎంతో చొరవ తీసుకుని ఎమిరేట్స్‌ను మొదటిసారి హైదరాబాద్‌కు తెచ్చారని అద్నాన్‌ ఖాజిమ్‌ గుర్తు చేసుకున్నారు. వీసా నిబంధనలు సరళీకృతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని సమావేశంలో పాల్గొన్న భారత రాయబారి నవదీప్‌సింగ్‌ సూరీ తెలిపారు.

బ్లాక్‌ చైన్‌, ఫిన్‌టెక్‌ రంగాల్లో కలసి పనిచేస్తాం 
ఐటీ, బ్లాక్‌చైన్‌, ఫిన్‌టెక్‌ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌తో కలసి పనిచేయడానికి ఫెడరల్‌ సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆర్థిక, పర్యాటక శాఖల మంత్రి, ఫెడరల్‌ సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ ఛైర్మన్‌ సుల్తాన్‌ బిన్‌ సయీద్‌ అల్‌ మన్సూరీతో దుబాయిలో చంద్రబాబు సమావేశమయ్యారు. దుబాయి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.

ఆంధ్రప్రదేశ్‌ శరవేగంగా అభివృద్ధి ఫలాలు అందుకోవడం తమను ఎంతో ఆకట్టుకుందని, ముఖ్యంగా రాష్ట్రంలో రవాణా మార్గాలు అభివృద్ధి చేస్తున్న తీరు ప్రశంసనీయమని మన్సూరీ ప్రశంసించారు. ‘‘భారతదేశం మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌ సవ్యదిశలో ఉంది. రహదారి, రైలు, జల మార్గాలతో దేశం మొత్తంతో అనుసంధానం కలిగిన రాష్ట్రం మాది. దుబాయి, సింగపూర్‌, హాంకాంగ్‌ వంటి అంతర్జాతీయ నగరాలతో జల, వాయు మార్గాల ద్వారా అనుసంధానం చేయాలని భావిస్తున్నాం. అత్యుత్తమ మానవ వనరులు మా సొంతం. మా వాళ్లు ఏ రంగంలోనైనా దూసుకెళ్లగలరు’’ అని చంద్రబాబు వివరించారు. ‘‘సరకుల్ని, ప్రయాణికుల్ని వేగంగా గమ్యస్థానాలకు చేర్చడం విమానయానరంగంలో ముఖ్యమైన సవాలు. భారత్‌, యూఏఈ మధ్య వాణిజ్య సంబంధాలు దృఢంగా ఉన్నాయి. యూఈఏకి భారత్‌ ప్రథమ వాణిజ్య భాగస్వామి’’ అని మన్సూరీ తెలిపారు. రెండు ప్రభుత్వాల ప్రతినిధులతో సంయుక్త కార్యాచరణ బృందం ఏర్పాటుకి ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ బృందంలో తమ తరఫు ప్రతినిధులను త్వరలో ఖరారు చేసి, తమ రాయబారి ద్వారా తెలియజేస్తామని మన్సూరీ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ తరఫున పర్యవేక్షణ బాధ్యతల్ని ఈడీబీకి చంద్రబాబు అప్పగించారు.

22ap-main1c.jpg

ఆంధ్రావని ఆనందదాయని..! 
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల సంతోష స్థాయినే కొలమానంగా తీసుకుని, ఆనందమయ సమాజం కోసం పనిచేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. యూఏఈ ‘హ్యాపీనెస్‌ అండ్‌ వెల్‌బీయింగ్‌’ శాఖ మంత్రి ఉద్‌బిన్‌ ఖల్ఫాన్‌ అల్‌ రౌమితో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆనందపు వారాంతాలు, ఆనంద లహరి, రంజాన్‌ తోఫా, క్రిస్మస్‌ కానుక, సంక్రాంతి కానుక వంటివన్నీ దానిలో భాగమేనని వివరించారు. ఇ-కార్యాలయాల ప్రవేశంతో ఉద్యోగులపై పనిభారం గణనీయంగా తగ్గిందన్నారు. తాము ఒక పద్ధతి ప్రకారం సంతోష సూచిక స్థాయిని పెంచుకుంటున్నామని, యూఏఈలో అమలు చేస్తున్న మంచి విధానాల్నీ అనుసరించి మెరుగైన ఫలితాలు సాధించడం తమ ఉద్దేశమని తెలిపారు. సమావేశం అనంతరం రౌమీతో కలసి హ్యాపీనెస్‌ డిపార్ట్‌మెంట్‌లోని ఒక కేంద్రాన్ని చంద్రబాబు సందర్శించారు. ఆ కేంద్రం ఎలా పనిచేస్తుందీ రౌమీ వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌ భౌగోళికంగా మధ్యప్రాచ్యం, దక్షిణాసియాలకు మధ్యలో ఉంది. అమరావతి, విశాఖ, తిరుపతి నగరాల్ని దుబాయికి అనుసంధానం చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ను ఎమిరేట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దడం ద్వారా రెండు దేశాల మధ్య స్నేహబంధం మరింత బలపడుతుంది. వైమానికంగా ఎంతో పురోగతి సాధించవచ్చు.
- ఎమిరేట్స్‌ స్ట్రాటజీ అండ్‌ ప్లానింగ్‌ ఇన్‌ఛార్జి అద్నాన్‌ ఖాజిమ్‌, ఫ్లై దుబాయి సీఈఓ ఘయిత్‌ అల్‌ ఘయిత్‌లతో భేటీలో సీఎం

అమరావతి, విశాఖల్లో దుబాయి తరహా పర్యాటక ఆకర్షణలు 
చంద్రబాబు బృందం సమావేశాలు ముగిసిన తర్వాత దుబాయిలోని ప్రపంచ ప్రఖ్యాత ఆకాశ సౌధం ‘బుర్జ్‌ ఖలీఫా’ సహా ముఖ్య ఆకర్షణీయ ప్రదేశాలను సందర్శించారు. బుర్జ్‌ ఖలీఫా దగ్గర సముద్ర భాగంలో ఉన్న అట్లాంటిస్‌ హోటల్‌, ఆక్వా వెంచర్‌ పార్కు తరహా పర్యాటక ఆకర్షణల వంటివి కృష్ణా నదికి అభిముఖంగా నిర్మిస్తున్న అమరావతిలోను, సాగరతీర నగరం విశాఖలోను ఉండి తీరాలని అధికారులకు ఆయన స్పష్టంచేశారు. రాష్ట్ర పర్యాటక రంగంలో ఇలాంటి ఆకర్షణలు జోడిస్తే మరింత అహ్లాదంగా, అద్భుతంగా ఉంటుందని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట యూఏఈ పర్యటనలో రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌, ఉన్నతాధికారులు ఉన్నారు.

దుబాయి నుంచి అబుదాబికి చంద్రబాబు 
ముఖ్యమంత్రి ఆదివారం రాత్రి దుబాయి నుంచి అబుదాబికి చేరుకున్నారు. చంద్రబాబు గౌరవార్థం అబుదాబిలోని యూఏఈ భారత రాయబారి నవదీప్‌సింగ్‌ సూరీ ఇచ్చిన విందులో పాల్గొన్నారు. సోమవారం అబుదాబిలో పారిశ్రామిక, వాణిజ్య, ప్రభుత్వ ప్రముఖులతో సమావేశమవుతారు. లులు గ్రూప్‌ ఛైర్మన్‌ యూసఫ్‌అలీ ఇచ్చే విందులోనూ, రాత్రికి ప్రముఖ పారిశ్రామికవేత్త బిఆర్‌షెట్టి ఇచ్చే విందులోనూ పాల్గొంటారు. సోమవారం రాత్రి అబుదాబి నుంచి లండన్‌ బయల్దేరి వెళతారు. మూడు రోజులపాటు లండన్‌లో పర్యటిస్తారు.

Posted

Endi bhaiyya anni sign aitunai antunaru nijanga ivani ostunai leka kaali paper la news le na ?

Posted
1 minute ago, 4Vikram said:

Endi bhaiyya anni sign aitunai antunaru nijanga ivani ostunai leka kaali paper la news le na ?

Time will tell. But like the idea of developing ports. Instead of running behind of IT , better to focus on AP strength areas like ports. 

Posted
4 minutes ago, TampaChinnodu said:

Time will tell. But like the idea of developing ports. Instead of running behind of IT , better to focus on AP strength areas like ports. 

No I want that to happen man. But point endi ante inni ostunai aitunai antunaru kada, manam accommodate afford cheyagaltama with labor or any other aspects ani asking man 

Posted
2 minutes ago, 4Vikram said:

No I want that to happen man. But point endi ante inni ostunai aitunai antunaru kada, manam accommodate afford cheyagaltama with labor or any other aspects ani asking man 

20K Kothha jobs create avuthayi ani andhuke antunnaru kada...

Posted
Just now, reality said:

20K Kothha jobs create avuthayi ani andhuke antunnaru kada...

Ohhh nice 

Posted
Just now, 4Vikram said:

Ohhh nice 

I think Lokesh must be working really hard behind the scenes, to get there. Slowly, it seems to be paying off.

Posted
5 minutes ago, reality said:

20K Kothha jobs create avuthayi ani andhuke antunnaru kada...

AeroCity annaru gaani , no further details. have to wait and see for more details.

Posted
48 minutes ago, 4Vikram said:

Endi bhaiyya anni sign aitunai antunaru nijanga ivani ostunai leka kaali paper la news le na ?

ne fillal futtaka u wil knw reality

Posted
35 minutes ago, reality said:

I think Lokesh must be working really hard behind the scenes, to get there. Slowly, it seems to be paying off.

@3$%

Posted
1 hour ago, reality said:

I think Lokesh must be working really hard behind the scenes, to get there. Slowly, it seems to be paying off.

Bhaiyya idhi maa Loki Bob ki satire aa leka meeru nijanga pogidinra ma rajaa ni %$#$

42 minutes ago, MathuloMazaahhh said:

ne fillal futtaka u wil knw reality

Ante mari nannagaru ani chepkuntaru emo maa pillakayal

Posted
1 hour ago, 4Vikram said:

Bhaiyya idhi maa Loki Bob ki satire aa leka meeru nijanga pogidinra ma rajaa ni %$#$

Endhuku vaa meeku antha confusion mee raaja meedha...@3$%

Posted
8 hours ago, reality said:

I think Lokesh must be working really hard behind the scenes, to get there. Slowly, it seems to be paying off.

good joke

Posted
7 hours ago, 4Vikram said:

Bhaiyya idhi maa Loki Bob ki satire aa leka meeru nijanga pogidinra ma rajaa ni %$#$

Ante mari nannagaru ani chepkuntaru emo maa pillakayal

arey nasty , go side and play 

JAI BALAYYA 

Posted
12 minutes ago, Kontekurradu said:

arey nasty , go side and play 

JAI BALAYYA 

iam_who_iam

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...