Indiatoday2030 Posted October 26, 2017 Report Posted October 26, 2017 GASANDHRA started giving negative news against jagan 'ఆ రెండు పత్రికలు మాకు వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీ కోసం త్వరలో ఓ ఛానెల్ ఓ పత్రిక వస్తున్నాయి' అంటూ ఒకటికి రెండుసార్లు కుండ బద్దలు కొట్టినట్లు ప్రకటించారు దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ విధంగా 'ఆ రెండు పత్రికల' వ్యతిరేకతను ఉగ్గుపాలతోనే పుచ్చుకుని పుట్టింది సాక్షి. తెలుగు మీడియా రంగంలో సాక్షి ఓ సంచలనం. ఇంత భారీ పెట్టుబడితో, ఇంత భారీ ఎత్తున అన్ని సెంటర్లలో, అంత హంగామాతో మళ్లీ మరో పత్రిక రావడం అంటే దాదాపు అసాధ్యమే. పుట్టిన నాటి నుంచి ఈనాడు-జ్యోతిల వార్తలను ఖండించడం, వాటి అధినేతలకు వ్యతిరేకంగా వార్తలు వండి వార్చడం సాక్షి నిత్యకృత్యమైంది. ముఖ్యంగా రామోజీ మీద సాక్షి వండి వార్చిన పుల్ పేజీలు అన్నీ ఇన్నీ కావు. వేసిన క్యారికేచర్లు ఇన్నీ అన్నీ కావు. సాక్షి లైబ్రరీలో ఇవన్నీ పదిలంగా వుండే వుంటాయి. కేవలం వార్తల విషయంలోనే కాదు, ఆ రెండు పత్రికల సర్క్యులేషన్ ను దెబ్బతీయాలని రేటు విషయంలో కూడా సాక్షి పోటీ పడింది. ఒకదశలో హాకర్లు మిగిలిన పత్రికలు వాళ్లు కూడా రెండు రూపాయలకే పత్రిక అమ్మాలని చిన్న చిన్న ప్రదర్శనలు చేయడం సాక్షిలో పెద్దగా వచ్చింది. రామోజీకి బద్ధ వ్యతిరేకి అయిన ఈనాడు మాజీ సంపాదకుడు ఎబికె ప్రసాద్ కూడా ఈ వ్యతిరేక వార్తల విషయంలో తనవంతు చేయూత అందించారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.