Jump to content

Recommended Posts

Posted
అడ్డదారి తొక్కిన ఐపీఎస్‌ 
ఐఏఎస్‌ కావాలని యూపీఎస్సీ పరీక్షల్లో కాపీయింగ్‌ 
30hyd-main8a.jpg

ఈనాడు, హైదరాబాద్‌, ఈనాడు డిజిటల్‌, చెన్నై: చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు అధికారి అడ్డదారి తొక్కాడు. నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన ఐపీఎస్‌ అధికారి యూపీఎస్సీ పరీక్షలో కాపీ కొడుతూ పట్టుబడ్డాడు. అతనితోపాటు అందుకు సహకరించిన ఆయన భార్యను, మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా ఏఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐపీఎస్‌ అధికారి సబీర్‌ కరీంకి ఐఏఎస్‌ కావాలన్నది కల. యూపీఎస్సీ పరీక్షల్లో బ్లూటూత్‌ సాయంతో హైదరాబాద్‌లో ఉన్న తన భార్య నుంచి సమాధానాలు తెలుసుకుని రాస్తుండగా అధికారులు పట్టుకున్నారు. చైన్నె పోలీసులు ఆయనను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. వాళ్లిచ్చిన సమాచారంతో హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.. కరీమ్‌ భార్య జాయిస్‌ను, సహకరించిన లా ఎక్సలెన్సీ ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ రాంబాబును సోమవారం రాత్రి అరెస్ట్‌ చేశారు. వీరి దగ్గర నుంచి ల్యాప్‌టాప్‌, బ్లూటూత్‌ పరికరాలను స్వాధీనం చేసుకుని ఇద్దరినీ చెన్నై పోలీస్‌ అధికారులకు అప్పగించామని ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

30hyd-main8b.jpgసాంకేతిక మోసం 
సఫీర్‌ కరీమ్‌కు ఐపీఎస్‌ హోదా ఉన్నా ఐఏఎస్‌ కావాలన్నది కోరిక. యూపీఎస్సీ నిర్వహించే అర్హత పరీక్షలు మళ్లీ రాసినా ర్యాంకు రాకపోతే అన్న అనుమానం వచ్చింది. దీంతో రెండేళ్ల క్రితం అంతర్జాలంలోని డార్క్‌నెట్‌లో అక్రమ మార్గాలపై శోధించాడు. ఛాతికి సమీపంలో అమర్చుకునే అంతర్జాల ఆధారిత మైక్రో కెమెరా, ఫోన్‌తో కూడిన పరికరాన్ని తెప్పించుకున్నాడు. దాన్ని అమర్చుకుని పరీక్ష గదిలోకి వెళ్లి ప్రశ్నపత్రాన్ని చూపిస్తే అందులో కెమెరా ప్రశ్నపత్రాన్ని చిత్రీకరించి గూగుల్‌ డ్రైవ్‌కు పంపుతుంది. పరీక్ష హాలు వెలుపల ఉన్నవారు గూగుల్‌ డ్రైవ్‌లోని ప్రశ్నపత్రాన్ని చూసి అందులోంచే సమాధానాలు చెబితే సఫీర్‌ వద్ద ఉన్న మైక్రోఫోన్‌ ద్వారా అతడికి వినిపిస్తుంది. దీంతో అతడు సమాధానాలు రాసేస్తాడు. ఈ పరికరం పనితీరును తెలుసుకునేందుకు సఫర్‌ తన సోదరిపై ప్రయోగించాడు. ఆమె ఇస్రోలో సహాయ శాస్త్రవేత్త ఎంపిక పరీక్ష రాసేందుకు వెళ్లేప్పుడు ఈ పరికరాన్ని అమర్చి పంపించాడు. ప్రశ్నపత్రాన్ని ఆమె గూగుల్‌ డ్రైవ్‌లోకి పంపగానే సఫీర్‌ దాన్ని చూసి ఆమెకు సమాధానాలు చెప్పాడు. మూడేళ్ల క్రితం దిల్లీలో పరిచయమైన లా ఎక్సలెన్సీ ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ రాంబాబు సహకారం తీసుకోవాలనుకున్నాడు.

ప్రిలిమ్స్‌లోనూ ఇదే మోసం 
ఈ ఏడాది జూన్‌లో జరిగిన ప్రిలిమ్స్‌ పరీక్షకు సఫీర్‌ ఈ పరికరాన్ని ఉపయోగించి ప్రశ్నపత్రాన్ని గూగుల్‌ డ్రైవ్‌ ద్వారా పంపాడు. అతడి భార్య జాయిస్‌ వాటిని చూసి సమాధానాలు చెప్పింది. ఆమె మాటలు సరిగ్గా వినిపించనప్పుడు ‘ది వాయిస్‌ నాట్‌ ఆడిబుల్‌ (నీ స్వరం సరిగా వినిపించడం లేదు)’ అంటూ పెన్సిల్‌తో రాసి ఆ ఫొటోను పంపించేవాడు. వెంటనే ఆమె గట్టిగా సమాధానాలు చెప్పింది. జవాబులన్నీ కరెక్ట్‌గా రాయడంతో సఫీర్‌ సులభంగా ప్రిలిమ్స్‌ ఉత్తీర్ణుడయ్యాడు. గత శనివారం మెయిన్స్‌ పరీక్ష కూడా ఇదే తరహాలో రాస్తుండగా కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో చెన్నై పోలీస్‌ అధికారులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. సఫీర్‌ అరెస్ట్‌ విషయాన్ని గోప్యంగా ఉంచారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌ పోలీస్‌ ఉన్నతాధికారులకు సమాచారం అందించగా సాయంత్రం జాయిస్‌, రాంబాబులను అదుపులోకి తీసుకున్నారు. రాంబాబు, సఫీర్‌ కలిసి కొచ్చి, తిరువనంతపురంలలో ‘కరీం లా స్టడీ సర్కిల్‌’ పేరుతో సంస్థలను నెలకొల్పారని పోలీసులు చెప్పారు.

Posted

Aasha ki haddu undadu.. life ekadnundi etu poindi ippudu ataniki asalu.. gone with the wind

Posted
4 hours ago, TampaChinnodu said:

 

Lol

Posted

Ias ni emaina simhasanam meeda koorchopedathara eedu eedi kakkurthi ips aina ias aina civil servant ye almost equal cadre

Posted
2 hours ago, aakathaai said:

Ias ni emaina simhasanam meeda koorchopedathara eedu eedi kakkurthi ips aina ias aina civil servant ye almost equal cadre

salary and benifits kuda same vuntayi anukunta 

Posted
21 minutes ago, Kontekurradu said:

salary and benifits kuda same vuntayi anukunta 

Ya same untai but ias laki promotions fast ga vasthai compared to ips dgp state police head aina kooda home secretary(IAS) ki report cheyyalsi untadi ias jobs like 9 to 5 jobs la untaai field wise ga iddharu equal ye

Posted

dorikadu kabatti donga.. dorakani donga na kodukulu entha mandi unnaro evadiki eruka.. &.,?

Posted
2 hours ago, GeorgeReddy said:

dorikadu kabatti donga.. dorakani donga na kodukulu entha mandi unnaro evadiki eruka.. &.,?

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...