Jump to content

US lo kudaa naaaa


Recommended Posts

Posted
Just now, TampaChinnodu said:

Might be true in other areas. But Dallas lo antha money ivvaru anukunta. commission return istharu mostly ani vinna. 

Dallas lo ne istaru.. cuz the house prices are skyrocketed.. they just need to write the certification exam and boom you are a realtor..

  • Replies 35
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Don_Draper

    8

  • TampaChinnodu

    7

  • ronitreddy

    4

  • aakathaai

    2

Top Posters In This Topic

Posted
On 11/5/2017 at 12:09 AM, ringaringa said:
అమెరికా చేరినా.. అదే తీరా? 
మార్కులు, గ్రేడ్‌లు వదలని భారతీయులు 
పిల్లల చదువులపై తల్లిదండ్రుల అతి శ్రద్ధ 
తల పట్టుకుంటున్న అమెరికా ఉపాధ్యాయులు 
ఈనాడు - హైదరాబాద్‌ 
4hyd-main4a.jpg

తెలుగురాష్ట్రాల్లో చదువుల ఒత్తిడితో విద్యార్థులు నలిగిపోతున్నారనేది అందరూ అంగీకరించే విషయమే. తరచూ జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు.. కళాశాల వసతిగృహాల నుంచి పారిపోవడం వంటి ఉదంతాలే ఇందుకు నిదర్శనం. ఇక్కడి నుంచి అమెరికాకు వెళ్లిన భారతీయులు అక్కడా ఈ తరహా ఒత్తిడినే కోరుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అమెరికాలో ఇతర దేశాల వారు దాదాపు 11 లక్షల మంది చదువుకుంటుండగా (ఎఫ్‌ 1 వీసాపై) భారత్‌ విద్యార్థులే 2 లక్షల మంది ఉన్నారు. వారిలో ఎక్కువ శాతం అక్కడే స్థిరపడుతుంటారు. మరికొందరు భారత్‌లోని కంపెనీల్లో పనిచేస్తూ హెచ్‌1బీ ద్వారా అక్కడికి వెళ్లేవారూ ఉంటారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన వేల కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయి.

భారతీయులతోనే సమస్య 
ఎంవీ ఫౌండేషన్‌ ప్రతినిధి వెంకటరెడ్డి అమెరికాలో ఓ సదస్సులో పాల్గొనేందుకు కొంతకాలం క్రితం అమెరికా వెళ్లారు. అక్కడి ప్రభుత్వ (పబ్లిక్‌ స్కూల్‌గా పిలుస్తారు) పాఠశాలలకు వెళ్లి ‘మీరు ఎదుర్కొనే సవాళ్లు ఏమిట’ని అక్కడి ఉపాధ్యాయులను ప్రశ్నించారు. భారతీయులే పెద్ద సమస్య అనే సమాధానం వారినుంచి రావడం విశేషం. తరచూ గ్రేడ్లు,మార్కులు, ర్యాంకుల గురించి అడుగుతుంటారని ట్యూషన్ల గురించి మాట్లాడుతుంటారని వివరించారు. భారతీయులు పిల్లలపై చదువుల ఒత్తిడి పెంచుతుంటారనివారు అభిప్రాయపడుతున్నట్లు వెంకటరెడ్డి తెలిపారు.

శాస్త్రీయంగా పాఠ్య ప్రణాళిక 
అమెరికాలో తరగతిని బట్టి శాస్త్రీయంగా పాఠ్యాంశాలను రూపొందిస్తారు. భారత్‌లోనూ అలాగే చేసినా.. ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు తాము అడ్వాన్స్డ్‌గా ఉంటామని చెప్పుకునేందుకు ఎక్కువ సిలబస్‌, వయసుకు, తరగతికి మించి పుస్తకాలను రూపొందించి చదివిస్తున్నాయి. ‘అమెరికాలో నేర్చుకునే విధానాన్ని నేర్పిస్తారు. ఇక్కడ కేవలం రాయడం నేర్పిస్తారు. అక్కడిప్రాక్టికల్‌పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది’ అని 12 సంవత్సరాలు అమెరికాలో ఉండి ఇటీవల హైదరాబాద్‌ వచ్చి కుమాన్‌ సంస్థను ప్రారంభించిన నీరజ తెలిపారు. మన ప్రభుత్వ బడులు అక్కడి గ్రంథాలయం అంత కూడా ఉండవు. 20-30 ఎకరాల్లో అక్కడి ప్రభుత్వ పాఠశాలలుంటాయి’ అని కొద్ది నెలల క్రితం అమెరికా వెళ్లివచ్చిన పీఆర్‌టీయూ టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తంరెడ్డి చెప్పారు. భారతీయులు తమ పిల్లలకు ఆన్‌లైన్‌ ట్యూషన్లు (స్కైప్‌ ద్వారా) పెట్టిస్తున్నారు. ‘నేను దాదాపు 800 మంది ప్రవాస భారతీయులకు ఆన్‌లైన్‌ ద్వారా ట్యూషన్లు చెప్పాను. వారిలో 60 శాతం మంది తెలుగురాష్ట్రాలు, గుజరాత్‌, పంజాబ్‌ల వారే’ అని ఉపాధ్యాయుడు కృష్ణయ్య చెప్పారు.

అమెరికాలో విద్యావ్యవస్థ ఇదీ.. 
* అమెరికాలో మార్కులు, గ్రేడ్లకు ప్రాముఖ్యం ఇవ్వరు. చదువు విషయంలో ఒకరితో ఒకరు పోటీపడటం ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగా ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ అయితేనే భవిష్యత్తు ఉంటుందని పిల్లలపై రుద్దడం ఉండదు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చదువుకోవాలని ఒత్తిడి చేయరు. 
* అక్కడ విద్యతోపాటు విద్యేతర కార్యకలాపాలకూ ప్రాధాన్యం ఉంటుంది. క్రీడలకు సమప్రాధాన్యం ఇస్తారు. విద్యార్థులు తమకు ఇష్టమైన వాటిని నేర్చుకుంటారు. 
* 12వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువు ఉచితం. రాకపోకలకు బస్సులు పంపిస్తారు. 
* హోం వర్క్‌ ఇవ్వరు. ఒక వేళ ఇచ్చినా ప్రాజెక్టులకు సంబంధించినవి ఉంటాయి తప్ప పుస్తకాలు చదవడం, రాయడం లాంటివి ఉండవు. 
* 12వ తరగతి పూర్తయ్యేసరికి ఏ రంగంలో స్థిరపడాలో నిర్ణయానికి వస్తారు. ఆతర్వాత అండర్‌ గ్రాడ్యుయేట్‌ చదివేవారు తక్కువగా ఉంటారు. గ్రాడ్యుయేట్‌ (పీజీ) విద్య తక్కువమంది చదువుతారు.

4hyd-main4b.jpg
* మా బాబుకు ఇంతకు ముందు 9.5 గ్రేడ్‌ వచ్చింది. ఈసారి 9 గ్రేడ్‌ వచ్చింది. ఎందుకంటారు? లోపం ఎక్కడుంది సార్‌? హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి తండ్రి ఉపాధ్యాయుడి వద్ద వ్యక్తం చేసిన ఆందోళన ఇది. 
* మా అమ్మాయికి 9.7 గ్రేడ్‌ వచ్చింది. ఇంతకంటే ఎక్కువ వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు? విజయవాడ ప్రాంతానికి చెందిన తల్లిదండ్రుల కంగారు. 
* మధ్యాహ్నం 3 గంటలకే ఇంటికి వస్తున్నారు కదా? అయినా హోంవర్క్‌ ఇవ్వడం లేదేంటి? నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన విద్యార్థిని తల్లి ఉపాధ్యాయుడికి వేసిన ప్రశ్నిది. 
* మా అబ్బాయి గణితంలో వెనుకబడుతున్నాడు. మీరేమైనా ట్యూషన్లు చెబుతారా? హైదరాబాద్‌కు చెందిన 6వ తరగతి విద్యార్థి తల్లి ఆరా. 
పిల్లల చదువులపై అత్యంత ఆదుర్దా కనబరుస్తూ ఈ ప్రశ్నలు వేసింది భారతీయులే.. అదీ తెలుగు రాష్ట్రాల వారే. ఈ సంభాషణలు జరిగింది మాత్రం భారత్‌లో కాదు.. అమెరికాలో. అక్కడి ఉపాధ్యాయులు నిర్ఘాంతపోయేలా మనవాళ్లు అడిగిన సందేహాలివి.
‘ప్రైవేటు’లోనూ మనవాళ్లు ఎక్కువే
4hyd-main4c.jpgనేను రెండుసార్లు అమెరికా వెళ్లాను. అక్కడి ప్రైవేటు పాఠశాలల్లో భారీగా రుసుములు ఉంటాయి. అయినా వాటిల్లో భారతీయుల పిల్లల సంఖ్య ఎక్కువగానే ఉంది. అక్కడ పిల్లలపై ఒత్తిడి తక్కువ. ఉపాధ్యాయులపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగాలు శాశ్వతం కాదు కాబట్టి ఎప్పటికప్పుడు వారు తమ పరిజ్ఞానాన్ని, బోధనా సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఉండాలి.
- జి.కిషన్‌, కమిషనర్‌, తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌
చదువు ద్వారా బతుకు నేర్పిస్తారు
4hyd-main4d.jpgమెరికన్లు మనకంటే రెండుమూడు శతాబ్దాలు ముందున్నారని నాకు అనిపిస్తుంది. అక్కడ చదువు ద్వారా నైపుణ్యం సంపాదించడం.. తద్వారా బతకడం నేర్పిస్తారు. పారిశ్రామిక విప్లవం వల్ల ఆలోచనతో ఉత్పత్తులు తయారు చేసి సంపద సృష్టించడం నేర్చుకున్నారు. ఉపాధ్యాయులంటే అక్కడ భయం లేదు. అందువల్ల పిల్లలు తమ ఆలోచనలను పంచుకుంటారు.
- చుక్కా రామయ్య, విద్యావేత్త

Gattigaaaa kottesaaaam 

Posted
3 minutes ago, Crazy_Robert said:

Gattigaaaa kottesaaaam 

Max engineering or medicine ee desi kids. 

Posted
5 minutes ago, Crazy_Robert said:

Gattigaaaa kottesaaaam 

Spelling bee pichi endo kooda ardam kaadu manollaki. max manolle andulo. 

Posted
4 minutes ago, TampaChinnodu said:

Spelling bee pichi endo kooda ardam kaadu manollaki. max manolle andulo. 

nuvvu koooda poka poyinave ch.thumb.gif.6d7eb62c38b6520a4bff3da3e56

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...