Jump to content

Recommended Posts

Posted
అవినీతికే రారాజు 
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ 
రూ.100 కోట్లు కూడబెట్టిన విజయరాజు 
ఇంట్లోనే అనధికార కార్యాలయం 
భూములకు నిరభ్యంతర పత్రాల జారీతో అక్రమార్జన 
ఏపీ, తెలంగాణలోని ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు 
ఈనాడు - అమరావతి 
8ap-main1a.jpg

బీరువాల నిండా వందల సంఖ్యలో అత్యంత ఖరీదైన పట్టుచీరలు... ఇంట్లోనే అనధికారిక కార్యాలయం... ఇంట్లో రోజూ తాగేందుకు కేసుల కొద్దీ మినరల్‌ వాటర్‌ బాటిళ్లు... చిన్నపాటి డ్రమ్ములో ఖరీదైన విదేశీ మద్యం... విలాసవంతమైన ఫర్నిచర్‌... ఈ భోగభాగ్యాలన్నీ నెలకి రూ.80 వేల రూపాయల జీతంతో పనిచేసే దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ మేడెపల్లి విజయరాజువి. విజయవాడ నిడమానూరులోని అతడి నివాసంలో బుధవారం అవినీతి నిరోధక శాఖ నిర్వహించిన సోదాల్లో ఇవన్నీ బయటపడ్డాయి. కమిషనరేట్‌లో ఉండాల్సిన కీలక దస్త్రాలు ఇంట్లో దర్శనమిచ్చాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగంపై ఏసీబీ డీజీ ఆర్‌.పి.ఠాకూర్‌ ఆదేశాల మేరకు ఏపీ, తెలంగాణలోని మొత్తం ఆరు ప్రాంతాల్లో ఏసీబీలోని సీఐయూ విభాగం అధికారులు బుధవారం ఏకకాలంలో సోదాలు చేశారు. హైదరాబాద్‌, విజయవాడ, నెల్లూరు, భీమడోలు ప్రాంతాల్లోని ఆరు చోట్ల విజయరాజు... అతడి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు ఇళ్లల్లో తనిఖీలు జరిగాయి. మొత్తం రూ.100 కోట్ల (మార్కెట్‌) విలువైన అక్రమాస్తులను గుర్తించారు. వీటి పుస్తక విలువ రూ.3 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా లెక్క తేల్చారు.

రూ.1,498 వేతనంతో ఉద్యోగ జీవితం మొదలు 
1990లో జూనియర్‌ అసిస్టెంటుగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన విజయరాజు అంచలంచెలుగా సహాయ కమిషనర్‌గా ఎదిగారు. ఉమ్మడి రాష్ట్రంలో 1990 నుంచి 2004 వరకూ హైదరాబాద్‌లోని దేవాదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా, సీనియర్‌ అసిస్టెంట్‌గా, సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తించారు. హైదరాబాద్‌లోని బల్కంపేట, నల్గొండలోని చెరువుగట్టు, కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు, తిరుమలగిరి, సికింద్రాబాద్‌లోని గణేశ్‌ ఆలయం, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మన్యంకొండ దేవస్థానాలకు కార్యానిర్వహణాధికారిగా పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖ కమిషనరేట్‌లో సహాయ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. దేవాదాయ శాఖ భూములకు సంబంధించిన వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. రూ.1,498 జీతంతో ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ప్రస్తుత జీతం రూ.80 వేలు.

8ap-main1c.jpg

నిరభ్యంతర పత్రాల జారీతో రెండు చేతులా అక్రమార్జన 
కొన్ని ప్రైవేటు భూములను పొరపాటున దేవాదాయ శాఖ భూములుగా పేర్కొంటూ దేవాదాయ శాఖ గతంలో రిజిస్ట్రేషన్‌ శాఖకు వివరాలు పంపింది. దీంతో ఆ భూముల యజమానులు వాటి క్రయ, విక్రయాలు నిర్వహించుకోలేని పరిస్థితి ఎదురైంది. ఈ శాఖ కమిషనరేట్‌ నుంచి అవి దేవాదాయ భూములు కాదు అనే నిరభ్యంతర పత్రాన్ని ఆ భూముల యజమానులు తెచ్చుకుంటే క్రయ విక్రయాలకు అడ్డంకి ఉండదు. ఈ పత్రాల జారీలో కమిషనరేట్‌లో భూముల వ్యవహారాలు చూసే విభాగానిది కీలకపాత్ర. అందులో భాగంగానే వాటికి సంబంధించిన ప్రతి దస్త్రమూ విజయరాజు దగ్గరకు వచ్చేది. దాదాపు 150 నిరభ్యంతర పత్రాల జారీకి సిఫార్సు చేసినట్లు గుర్తించారు. రూ.పదుల కోట్లు అక్రమంగా కూడబెట్టారన్న ఆరోపణలున్నాయి.

భూములకు సంబంధించి కమిషనరేట్‌లో ఉండాల్సిన కీలక దస్త్రాలు ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులకు లభ్యమయ్యాయి. కొన్ని నోట్‌ ఫైల్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖకు చెందిన దస్త్రాలు కూడా విజయవాడలోని ఆయన ఇంట్లో స్వాధీనం చేసుకున్నారు. ఎవరికైనా పని కావాలంటే నేరుగా తన ఇంటికొచ్చి తగిన ముడుపులు చెల్లించుకుంటేనే విజయరాజు ఆ పని చేసి పెడతారన్న ఆరోపణలున్నాయి.

8ap-main1d.jpg

మేడెపల్లి విజయరాజు పేరిట గుర్తించిన అక్రమాస్తులు 
* సరూర్‌నగర్‌ గడ్డి అన్నారం మండలంలో 100 చదరపు గజాల ఇంటి స్థలం. 
* కృష్ణా జిల్లా పోతేపల్లిలో 201 చదరపు గజాల ఇంటి స్థలం. 
* 3300 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో జీ ప్లస్‌ వన్‌ భవనం. 
* భీమడోలు కూడలిలో 900 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం కలిగిన అతిథిగృహం. 
* విజయవాడ శివారు నిడమానూరులో 1500 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన మూడు పడక గదుల ఫ్లాటు.

భార్య మేడెపల్లి లిల్లిగ్రేస్‌ పేరిట... 
* భీమడోలు మండలం జి.కొత్తపల్లిలో ఎకరా భూమి. 
* భీమడోలులో 200 చదరపు గజాల స్థలం. 
* కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో 196 చదరపు గజాల ఇంటి స్థలం.

పెద్ద కుమారుడు మేడెపల్లి ప్రదీప్‌ విజయ్‌ పేరిట... 
* పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం గుణుపూడి గ్రామంలో 195.5 చదరపు గజాల ఇంటి స్థలం. 
* గుంటూరు జిల్లా రామచంద్రపుర అగ్రహరంలో 200 చదరపు గజాల ఇంటి స్థలం.

చిన్న కుమారుడు మేడెపల్లి సందీప్‌ పేరిట... 
* పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం జగన్నాథపురం గ్రామంలో 1.57 ఎకరాల వ్యవసాయ భూమి.

తండ్రి మేడెపల్లి ఫ్రాన్సిస్‌ పేరిట... 
* పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం వట్లూరు గ్రామంలో 200 చదరపు గజాల విస్తీర్ణంలో రెండు ఇంటి స్థలాలు.

సోదరి గంజి విజయ కుమారి పేరిట... 
* భీమడోలులో 200 చదరపు గజాలు, 212 చదరపు గజాల విస్తీర్ణంలో రెండు స్థలాలు.

8ap-main1f.jpg

అన్నీ కలిపి చూస్తే... 
* ఇంటి స్థలాలు: 10 
* ఫ్లాటు: 1 
* జీ ప్లస్‌ వన్‌ ప్లస్‌ పెంట్‌హౌస్‌: 1 
* ఇల్లు: 1 
* వ్యవసాయ భూమి: 2.57 ఎకరాలు 
* స్వాధీనం చేసుకున్న నగదు: రూ.2.12 లక్షలు 
* బ్యాంకు బ్యాలెన్సు: రూ.5 లక్షలు 
* గృహోపకరణాలు: రూ.16 లక్షలు 
* బంగారు ఆభరణాలు: 519 గ్రాములు 
* వెండి: 2 కిలోలు 
* కార్లు: 3 
* ద్విచక్రవాహనాలు: 4 


దేవుడు చీరల్నీ వదల్లేదు 
8ap-main1b.jpg

హైదరాబాద్‌, విజయవాడల్లోని విజయరాజు ఇళ్లల్లో సోదాల సందర్భంగా 537 చీరలు గుర్తించారు. వీటిలో 100కు పైగా అత్యంత ఖరీదైన పట్టు చీరలు ఉన్నట్లు లెక్క తేల్చారు. ఒక్కో పట్టు చీర విలువ కనీసం రూ.50 వేల నుంచి గరిష్ఠంగా రూ.లక్ష వరకూ ఉంటుందని అంచనా. ఈ లెక్కన రూ.20 లక్షల విలువైన పట్టు చీరలు, రూ.10 లక్షల విలువైన ఇతర చీరలు ఉన్నట్లు గుర్తించారు. దేవతామూర్తులకు భక్తులు సమర్పించే ఖరీదైన పట్టుచీరలను తన అధికారిక హోదాను అడ్డం పెట్టుకుని ఇలా సొంతానికి వాడుకున్నట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. 


ప్రధాన కార్యదర్శి హోదాను అడ్డం పెట్టుకొని...

దేవాదాయ శాఖ అధికారుల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న విజయరాజు అక్రమాలకు ఈ హోదాను అడ్డం పెట్టుకున్నారన్న ఆరోపణలున్నాయి. తిరుమంగళగిరి వేంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు మరో పది ప్రధాన ఆలయాల్లో ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండానే అభివృద్ధి పనులు చేశారన్న అభియోగాలున్నాయి. 


బహుమతులుగా ఆభరణాలు...

దేవాలయాల తనిఖీకి వెళ్లినప్పుడు స్థానిక అధికారుల నుంచి బహుమతులరూపంలో బంగారు ఆభరణాలు తీసుకునేవారన్న ఆరోపణలున్నాయి. 


ఇల్లే అవినీతి కేంద్రం 
8ap-main1e.jpg

విజయరాజు నిడమానూరులోని తన ఇంట్లోనే అనధికారికంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్‌లోని ఇంట్లో అయితే ఏకంగా పైన పెంట్‌హౌస్‌లో ఈ తరహా అనధికారిక కార్యాలయం ఏర్పాటు చేసినట్లు సోదాల్లో వెలుగుచూసింది.

Posted

See the way he is smiling with out any shame. Because Even he knows he will get out of this case very easily. 

Posted
Quote

దేవతామూర్తులకు భక్తులు సమర్పించే ఖరీదైన పట్టుచీరలను తన అధికారిక హోదాను అడ్డం పెట్టుకుని ఇలా సొంతానికి వాడుకున్నట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. 

_%~

Posted

ee US lo jobs chese badulu happy ga india lo govt job lo full dabbulu and luxury ga bathakochu eedi laga

Posted
1 hour ago, boeing747 said:

ee US lo jobs chese badulu happy ga india lo govt job lo full dabbulu and luxury ga bathakochu eedi laga

any doubts

india govt job >>>>>>>>>> US job

Posted

andhuke vayya roju appsc page open chesi refresh chesi chesi  keyboard poyela vundhi.....eesari ela ayina apply chesi raayali....

Posted
3 hours ago, boeing747 said:

ee US lo jobs chese badulu happy ga india lo govt job lo full dabbulu and luxury ga bathakochu eedi laga

@lazybugger 

Posted
4 hours ago, TampaChinnodu said:

_%~

Saaru devini bidda anukunta.ayya Peru francis anta

Posted
16 minutes ago, megadheera said:

Saaru devini bidda anukunta.ayya Peru francis anta

@3$%

Posted

Em chesukuntuntaaru ra ayya inta daachukoni , inka kakurthe _%~

 

Ikkada intha cash bayata padutondi in new currency denominations malli demonitization is a sucess ani sankalu guddukovatam damn

Posted
8 hours ago, TampaChinnodu said:

_%~

adigav ga anni sarees eam sesukuntaru ani , ammukuntaru 

edi name susthe, christian laaga vunadu ga, Hindu gods baagane iicharu vediki 

JAI BALAYYA 

Posted
3 hours ago, Kool_SRG said:

Em chesukuntuntaaru ra ayya inta daachukoni , inka kakurthe _%~

 

Ikkada intha cash bayata padutondi in new currency denominations malli demonitization is a sucess ani sankalu guddukovatam damn

modi ia worst rey, no one is good. 

2019 lo evaru PM ayithe bagundidii ?`

 

Posted
3 hours ago, Kontekurradu said:

modi ia worst rey, no one is good. 

2019 lo evaru PM ayithe bagundidii ?`

 

RahulPulka for #2019

Posted

ilantivi jujubi.. media anthaga leni rojullo 2008 time lo ma dhaggari relative ..same designation ..endowments asst. commissioner ilage pattukunnaru.. devarayanjal bhumulu mottham mingesadu . konni vandhala kotla asthulu bayata paddayi. ayina em cheyyaledhu.. okkaroju paper lo, tv lo vostharu anthe.. just ayanani oka temple nunchi inko temple EO pampincharu.. 2 years case ni lagaru.. ayana retire ayyadu.. happy ga enjoy chesthunnadu life ni ...@aathcare ilantivi anni.. chala lobbying untadhi. ipudu endowment dept lo unna andharu clerk range nunchi edhigina vallu.. assal ela avtharu EO la range ki ..basic degree kuda lekunda... antha pairaveelu, dabbulu 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...